మార్కెట్లో రకరకాల మామిడి పండ్లు నోరు ఊరిస్తున్నాయి. మామిడిని ఇష్టపడే డయాబెటిస్ పేషెంట్లు మాత్రం తినాలా వద్దా అనే డైలమాలో ఉంటారు.
షుగర్ వ్యాధి ఉన్నవారు మామిడి పండ్లను తినవచ్చా?
షుగర్ వ్యాధి ఉన్నవారు మామిడి పండ్లను తినవచ్చు. ఇది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్న డయాబెటిస్ రోగులకు మాత్రమే వర్తిస్తుంది. వీళ్లు కూడా మామిడి పండ్లను మరీ ఎక్కువ మోతాదులో తింటే షుగర్ స్థాయిలు అమాంతంగా పెరుగుతాయి. మామిడి పండ్లలో సహజ చక్కెరలు ఉంటాయి.కేలరీలు కూడా ఎక్కువే. శరీరం షుగర్‌ను శోషించుకోవడాన్ని మామిడిలో ఉండే పీచు తగ్గిస్తుంది.కాబట్టి గ్లూకోజ్ స్థాయిల పెరుగుదల మరీ ఎక్కువగా ఉండదు. కానీ ఇదంతా మామిడి పండ్లను మితంగా తింటేనే.
గ్లైసెమిక్ ఇండెక్స్
మామిడి పండ్ల యొక్క పక్వత మరియు రకాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ (glycemic index) 41 నుండి 60 ఉంటుంది. ఇది మరి ఎక్కువ కాదు మరియు తక్కువ కాదు. ఒక మోస్తరు.
మామిడి పండ్లు అనేక ముఖ్యమైన పోషకాల యొక్క గొప్ప మూలం
మామిడిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ B6 , ఫోలేట్ , పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు ఉంటాయి.
Nutrient | Amount |
Calories | 99 |
Carbohydrates | 25 grams |
Fiber | 3 grams |
Protein | 1 gram |
Fat | 0.6 grams |
Vitamin C | 67% DV |
Vitamin A | 10% DV |
Folate | 18% DV |
Potassium | 6% DV |
Magnesium | 4% DV |
Copper | 5% DV |
Vitamin B6 | 5% DV |
Vitamin E | 2% DV |
Vitamin K | 6% DV |
ఏ మోతాదులో తినాలి?
డయాబెటిస్ బారిన పడ్డవారు రెండ్రోజులకోసారి ఒకటి లేదా రెండు ముక్కల చొప్పున మామిడి పండ్ల రుచిని ఆస్వాదించొచ్చు.
మామిడి పండ్లను తినాలనుకునే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొన్ని చిట్కాలు
- ఆల్ఫోన్సో, బదామి మామిడి రకాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
- మామిడి పండ్లు బాగా మగ్గితే తినకూడదు. జ్యూస్ జోలికి అసలు వెళ్లకపోవడమే ఉత్తమం. మామిడి పండ్లను పగలు మాత్రమే తినేలా జాగ్రత్తపడండి.
- కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపజేయడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి మామిడి పండ్లను భోజనంలో భాగంగా మాత్రమే తినండి.
- షుగర్ స్థాయిలు ఎక్కువగా పెరగకుండా ఉండటం కోసం మామిడి, కీరదోస, కొబ్బరి, మజ్జిగ కలిపి సూప్‌లా చేసుకొని తాగొచ్చు. మామిడి తిన్నాక షుగర్ ఎక్కువగా ఉండే మామిడి జోలికి వెళ్లకండి.
మీరు మామిడి పండ్లను తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలలో గణనీయమైన పెరుగుదలను గమనించినట్లయితే, మీరు వీటిని తినకూడదు. మీ భోజన ప్రణాళికలో మామిడి పండ్లను ఎలా చేర్చాలనే దాని గురించి మీ వైద్యునితో మాట్లాడటం ఎల్లప్పుడూ ముఖ్యం.