CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

IRON-RICH DIET IN TELUGU

Iron rich foods list in telugu

ఐరన్ అనేక ముఖ్యమైన విధులను అందించే ఖనిజం. ఎర్ర రక్త కణాలలో భాగంగా మీ శరీరం అంతటా ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడం దీని ప్రధాన విధి

శరీరంలో రక్తం తక్కువగా ఉన్నట్లయితే, అది ఐరన్ లోపం వాళ్ళ కావొచ్చు.
 రక్తాన్ని పెంచడానికి మరియు రక్తహీనతను నయం చేయడానికి, మీరు ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

Functions of iron in the body

ఐరన్ లోపం ఎవరికీ ఎక్కువగా ఉంటుంది?

స్త్రీలు: బహిష్టు సమయంలో స్త్రీలు రక్తాన్ని కోల్పోతారు కాబట్టి, సాధారణంగా స్త్రీలలో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది.

శిశువులు మరియు పిల్లలు: శిశువులు, ముఖ్యంగా తక్కువ బరువు ఉన్నవారు లేదా నెలలు నిండకుండా జన్మించిన వారు, తల్లి పాలు లేదా ఫార్ములా నుండి తగినంత ఐరన్ తీసుకోని వారు ఐరన్ లోపం బారిన పడే ప్రమాదం ఉంది. ఎదుగుదల సమయంలో పిల్లలకు అదనపు ఐరన్ అవసరం. మీ బిడ్డ ఆరోగ్యకరమైన, వైవిధ్యమైన ఆహారం తీసుకోకపోతే, రక్తహీనత ప్రమాదంలో పడవచ్చు.

శాఖాహారులు: మాంసాహారం తినని వ్యక్తులు ఇతర ఐరన్-రిచ్ ఫుడ్స్ తినకపోతే ఐరన్ లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గర్భధారణ సమయంలో: మీ బిడ్డకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి ఎక్కువ రక్తాన్ని తయారు చేయడానికి మీ శరీరం ఐరన్ ఉపయోగిస్తుంది. మీకు తగినంత ఐరన్ నిల్వలు లేకుంటే, మీరు ఐరన్ లోపం తో బాదపడవచ్చు.

Who are at risk of iron deficiency?

ఐరన్ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఐరన్ లోపం ఉంటే మీ ఆహారంలో ఈ ఫుడ్ ఐటమ్స్ తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఆకుకూరలను ప్రత్యాకంగా బ్రోకలీ, గోంగూర,  మెంతి కూర, తోటకూర.  పాలకూర- బచ్చలికూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపం ఉన్నట్లయితే, మీరు వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.

తులసి: తులసి ఆకులతో రక్తహీనత తగ్గుతుంది. తులసి ఆకులను తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

ఉల్లి, క్యారట్, ముల్లంగి, టమాటాలు, పుట్టగొడుగులు, బంగాళాదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.  

మొలకెత్తిన పప్పుధాన్యాలు ప్రతినిత్యం తీసుకోవాలి.  తృణధాన్యాలు మరియు పప్పులను సమృద్ధిగా తినడం ద్వారా కూడా ఇనుము లోపాన్ని అధిగమించవచ్చు. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. 

బీన్స్: వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వలన, మీ ఐరన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు. వీటిలో, సోయాబీన్స్ అత్యంత ముఖ్యమైనవి. వీటిని కాల్చి, నానబెట్టి, పులియబెట్టిన రూపంలో తినవచ్చు. ఇది కాకుండా, చిక్‌పీస్, పచ్చి శనగలు కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్.

గింజలు: గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు వంటి విత్తనాలు ఇనుము యొక్క కొన్ని సాధారణ వనరులు.

మిల్లెట్లు : మీ రోజువారీ ఆహారంలో బజ్రా మీ ఇనుము లోపాన్ని అరికట్టడంలో మీకు సహాయపడుతుంది. మీరు వాటిని మీ ఉప్మా, దోసె, గంజి, స్వీట్లు లో చేర్చడం వంటి వివిధ మార్గాల్లో వాటిని తీసుకోవచ్చు.

క్వినోవా : ప్రొటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే ఉండే ధాన్యం. ఇది ఇనుము యొక్క మంచి మూలం కూడా. క్వినోవాను అన్నం లేదా పాస్తా మాదిరిగా తినవచ్చు. 

డార్క్ చాక్లెట్: మరొక ఐరన్-రిచ్ ఫుడ్. కానీ షుగర్ పేషెంట్స్ తినకూడదు

 నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ ఐరన్ లోపాన్ని అధిగమించడానికి , మీరు ఆహారంలో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలి. మీరు వాల్‌నట్స్, ఖర్జూరం, ఎండుద్రాక్ష మరియు బాదం వంటి డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. నానబెట్టిన ఎండుద్రాక్ష మరియు దాని నీటిని ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం ద్వారా ఐరన్ లోపం తొలగిపోతుంది.  అంజీర, ఆప్రికాట్, ఖర్జూరం,  బాదం  తినండి.

నువ్వులు ప్రతినిత్యం తీసుకోవాలి.

పండ్లను తినండి. ముఖ్యంగా ఆపిల్ , దానిమ్మపండు, ఆరంజ్, అరటిపండు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ.  విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ తింటూ ఉండాలి.

బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగాలిఐరన్ లోపాన్ని తొలగించడానికి ఇది చాలా మంచిది . బీట్‌రూట్ తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇది జ్యూస్ ల చేసుకొని తాగితే చాలా బాగా పనిచేస్తుంది.

మాంసాహారం: అలవాటు ఉంటే చికెన్, చికెన్ లివర్, మటన్‌ లివర్‌, మటన్‌ను తీసుకుంటే శరీరానికి అవసరమైన ఐరన్‌ను పొందొచ్చు.   ఐరన్ లోపాన్ని తొలగించడానికి మీరు మీ ఆహారంలో రెడ్ మీట్‌ను చేర్చుకోవచ్చు. 

గుడ్డు: గుడ్లలో ప్రోటీన్, ఐరన్ మరియు కాల్షియం ఉంటాయి.

సముద్రపు చేపలు: సార్డినెస్, సాల్మన్, మస్సెల్స్, గుల్లలు వంటి చేపలు మరియు షెల్ఫిష్ వంటి సీఫుడ్‌లు ఐరన్ను కలిగి ఉంటాయి.  

పీతలు, రొయ్యల వల్ల కూడా ఐరన్‌ లభిస్తుంది.

Iron rich foods list in telugu

2 thoughts on “Iron rich foods list in telugu”

  1. Pingback: Symptoms of B12 deficiency in Telugu - DM HEART CARE CLINIC

  2. Pingback: Symptoms of Anemia in Telugu - DM HEART CARE CLINIC

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now