కంటిలోని తెల్లని భాగాన్ని, కంటి రెప్పల వెనక భాగాన్ని కప్పి ఉంచే పారదర్శక పొరని కంజంటైవా (conjunctiva) అంటారు.ఈ పొరకు వాపు వచ్చి కందడాన్ని కన్‌జన్‌క్టివైటిస్ (conjunctivitis) అంటారు . దీని కారణంగా కళ్లు ఎర్రగా మారి నీరు కారడం, మండిపోవడం జరుగుతుంది. ఇసుక పోసినట్టు గరగరలాడుతుం ది. ఇది అంటువ్యా ధి. ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. దీనినే పింక్ ఐ లేదా కండ్లకలక అని కూడా పిలుస్తారు. ఇది అంత ప్రమాదకరం కాదు. కానీ , తెల్లని పొర నుంచి కంటి గుడ్డు, కార్నియాకు విస్తరిస్తే మాత్రం చూపు మందగిస్తుంది.
కండ్లకలక యొక్క లక్షణాలు
- కళ్లలో మంట, నొప్పి
- కళ్లల్లో దురద
- కంట్లోంచి నీరు కారుతుంది
- కళ్ల నుంచి చిక్కటి స్రావం కారడం కూడా కారొచ్చు
- పుసులు కట్టి రెప్పలు అంటుకుపోవడం. ముఖ్యంగా ఉదయం నిద్రలేచేసరికి ఎక్కువ ఊసులతో కనురెప్పలు అతుక్కుని కనిపిస్తాయి
- కనురెప్పలు ఉబ్బి పోతాయి
- ఎక్కువ వెలుతురు చూడలేకపోవడం
కండ్లకలక రకాలు
కండ్లకలక లో మూడు సాధారణ రకాలు ఉన్నాయి:
వైరల్ కన్‌జన్‌క్టివైటిస్
వైరస్ల వల్ల వస్తుంది. వైరల్ కాన్జూక్టివిటిస్ చాలా అంటువ్యాధి . ఇది సాధారణంగా ఒకటి లేదా రెండు వారాలలో దానంతట అదే క్లియర్ అవుతుంది. యాంటీబయాటిక్ కంటి చుక్కలు పని చెయ్యవు. సాధారణంగా వైరల్ కళ్లకలక ఒక కంటికే వస్తుంటుంది. దీన్ని తాకిన చేతిని మరో కంటికి తగలకుండా చూసుకుంటే రెండో కంటికి అంటుకోకుండా కాపాడుకోవచ్చు.
బాక్టీరియల్ కన్‌జన్‌క్టివైటిస్
బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. బాక్టీరియల్ కండ్లకలకను యాంటీబయాటిక్ కంటి చుక్కలతో చికిత్స చేయవచ్చు. వైరల్ లేదా అలెర్జీ పింక్ ఐ కంటే ఎక్కువ శ్లేష్మం లేదా చీమును ఉత్పత్తి చేస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు చికిత్స లేకుండా 2-5 రోజుల్లో మెరుగుపడవచ్చు, అయినప్పటికీ యాంటీబయాటిక్ కంటి చుక్కలు రికవరీని వేగవంతం చేస్తాయి.
అలెర్జీ కండ్లకలక
పుప్పొడి, పెంపుడు జంతువుల చర్మం లేదా దుమ్ము పురుగులు వంటి దుమ్ము , ధూళి అలెర్జీ కారకాల వల్ల ప్రేరేపించబడుతుంది. తుమ్ములు లేదా ముక్కు కారడం వంటి ఇతర అలెర్జీ లక్షణాలు కూడా ఉండవచ్చు. యాంటిహిస్టామైన్ కంటి చుక్కలు లేదా మందులను ఉపయోగించడం ద్వారా ఇది తగ్గుతుంది.