CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

LIPID PROFILE TEST IN TELUGU

Lipid Profile Test In Telugu

ఈ రోజు మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ (Lipid Profile Test In Telugu) గురించి మాట్లాడుతున్నాం. 

లిపిడ్ అంటే కొవ్వు. మన రక్తంలో కొవ్వు అనేక రూపాల్లో ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా మన రక్తంలో ఉండే కొవ్వుల పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష లో టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్, విఎల్‌డిఎల్, కొలెస్ట్రాల్ ఎల్‌డిఎల్ రేషియో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. లిపిడ్‌ ప్రొఫైల్ పరీక్షను కొలెస్ట్రాల్ పరీక్ష అని కూడా అంటారు. ఇందులో సిరల నుంచి రక్తాన్ని తీసుకుని పరీక్షిస్తారు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అంచనా వేయొచ్చు . ఒకవేళ మీ కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా లేకుంటే,ముందుగానే కంట్రోల్‌ చేసుకునే అవకాశం ఉంది.

లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో ఏమి ఉంది?

 

  1. మొత్తం కొలెస్ట్రాల్
  2. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్  
  3. హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్  
  4. ట్రైగ్లిజరైడ్స్
  5. విఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్  
  6. నాన్-హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్
  7. హెచ్‌డిఎల్ మరియు మొత్తం కొలెస్ట్రాల్ మధ్య నిష్పత్తి

లిపిడ్ ప్రొఫైల్ పరీక్షకు ముందు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు

 ఈ పరీక్షకు రక్త నమూనాను ఇచ్చే ముందు సాధారణంగా 12 గంటల పాటు ఉపవాసం ఉండాలని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, ఈ పరీక్షను ఉదయాన్నే ఖాళీ కడుపుతో చేయించుకోవడం మంచిది. ఖచ్చితమైన ఫలితాలను పొందడానికి, ఈ సమయం వరకు నీరు తప్ప ఏదైనా తినడం లేదా త్రాగడం మంచిది కాదు. మీరు ఏదైనా తింటే, దాని విలువలు కొంచెం మారవచ్చు. 

మద్య పానీయాలు తాగడం మానుకోండి. ఆల్కహాల్ వినియోగం పరీక్షకు కనీసం 24 గంటల ముందు అధిక ఆల్కహాల్ వినియోగాన్ని నివారించండి, ఎందుకంటే ఇది తాత్కాలికంగా ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది.

మీరు నీరు త్రాగవచ్చు, కానీ టీ లేదా కాఫీ తీసుకోకండి

అధిక కొవ్వు పదార్ధాలను కనీసం 24 గంటల ముందు నుండి నివారించండి

పరీక్షకు కనీసం 24 గంటల ముందు చాలా కఠినంగా వ్యాయామం చేయవద్దు. 

ఒత్తిడి మరియు ఆందోళన లిపిడ్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. మరింత ఖచ్చితమైన ఫలితాలను పొందడానికి పరీక్షకు ముందు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి.

 మీకు ఇటీవల అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ ఉంటే, పరీక్షను వాయిదా వేయడాన్ని పరిగణించండి, ఎందుకంటే ఇది తాత్కాలికంగా లిపిడ్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది.

లిపిడ్ ప్యానెల్ ఫలితాలు ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో భిన్నంగా ఉండవచ్చు. మీరు గర్భవతి అయితే లేదా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఐతే, పరీక్షను వాయిదా వేయడాన్ని పరిగణించండి

 మీరు తీసుకుంటున్న అన్ని మందులు, గురించి మీ డాక్టర్ కి తెలియజేయండి, ఎందుకంటే కొన్ని లిపిడ్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు.

  ఇటీవలి శస్త్రచికిత్సలు లేదా పెద్ద గాయాలు ఐతే లిపిడ్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. పరీక్షను వాయిదా వెయ్యండి. 

ఎవరు పరీక్షలు చేయించుకోవాలి

20 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి ఒక్కరూ తమ కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. నార్మల్ గా ఉంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారైనా ఈ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఈ టెస్టులో ఏదైనా తేడా కనుగొనబడితే, మీరు ప్రతి సంవత్సరం ఈ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

ఒక వేళ మీ పేరెంట్స్ కి ఏదైనా జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లయితే, 20 ఏళ్లలోపు ఒకసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 20 సంవత్సరాల వయసులో చేసుకోవడం వల్ల ఏదైనా జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లయితే, దానిని ముందుగానే గుర్తించవచ్చు.తద్వారా సకాలంలో చికిత్స పొందడం మరియు జీవనశైలిని మార్చుకోవడం చేయోచ్చు. దీని కారణంగా తీవ్రమైన గుండె వ్యాధులు సంభవించే ముందే వాటిని నివారించవచ్చు. 

కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులను తీసుకుంటుంటే, మధుమేహం, గుండె జబ్బులు లేదా స్ట్రోక్‌తో బాధపడుతున్నట్లయితే, అలాంటి వ్యక్తులు ప్రతి సంవత్సరం లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి.

గుండె జబ్బులు ఉన్నట్లు అనుమానం వచ్చినప్పుడు రోగనిర్ధారణ పరీక్షల్లో భాగంగా లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి 

కొలెస్ట్రాల్ ఎంత ఉండాలో తెలుసుకోండి

మనుషుల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు వయసు, బరువు, లింగ భేదాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తికి వయసు పెరుగుతున్నా కొద్దీ, వారి శరీరం కాలక్రమేణా ఎక్కువ కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది.సాధారణంగా మగవారికి ఆడవారి కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. మగవారి కొలెస్ట్రాల్ స్థాయిలు వయసుతో పాటు పెరుగుతాయి. అయితే మెనోపాజ్ తర్వాత ఆడవారి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.  

టోటల్ కొలెస్ట్రాల్

మన శరీరంలో టోటల్ కొలెస్ట్రాల్ పరిమాణం 200 mg/dl కంటే తక్కువగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. 200 నుండి 239 బోర్డర్ లైన్ పరిధిలో వస్తుంది. 240 కంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ స్థాయి ఉంటే, హై రిస్క్ అని అర్ధము.  

TOTAL CHOLESTEROL VALUES TELUGU IN LIPID PROFILE 2

ట్రైగ్లిజరైడ్స్

శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ ఏ స్థాయిలో ఉండాలో తెలుసుకోండి. ట్రైగ్లిజరైడ్స్ స్థాయి 150 mg/dl కంటే తక్కువగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. 150 నుంచి 199 మధ్య ఉంటే బార్డర్ లెవల్ హై అని చెబుతారు. 200 పైన ఉంటే అధికంగా ఉన్నాయని అర్థం. 500, ఆ పై ఉంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం.  

triglycerides normal range in Telugu

 హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ 

దీనిని హై డెన్సిటీ లిపోప్రొటీన్ అంటారు. దీనిని మంచి కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. ఎందుకంటే ధమనిలో కొలెస్ట్రాల్ నిక్షేపించినట్లయితే, అది దానిని తొలగిస్తుంది. కాబట్టి దాని పరిమాణం ఎక్కువగా ఉండాలి. దీని విలువ 60కి మించి ఉంటే దీన్ని ఆప్టిమల్ లేదా మంచి స్థాయిగా పరిగణిస్తారు.  

hdl cholesterol range and classification in Telugu

 శరీరంలో దాని పరిమాణం మగవారిలో 40 మరియు ఆడవారిలో 50 mg/dl కంటే తక్కువగా ఉంటే, అది శరీరానికి చాలా ప్రమాదం.ఇలా ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రీడింగ్ 41-59 mg/dl అయితే, దీన్ని బోర్డర్ లైన్ లో-లెవల్‌గా పరిగణిస్తారు.  

ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్

 ఎల్‌డిఎల్ అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్‌. దీనిని చెడు కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. దీని పరిమాణం ఎక్కువగా ఉంటే అది శరీరానికి హానికరం. రక్తప్రవాహంలో చాలా ఎక్కువ మొత్తంలో LDL లేదా చెడు కొలెస్ట్రాల్ ఉంటే, అది రక్తనాళాలలో పేరుకుపోతుంది. ఇది శరీరంలోని ఇతర పదార్థాలతో కలిసి ఫలకాలుగా మారి కొవ్వు నిల్వలను ఏర్పరుస్తుంది. ఈ ఫలకాలు గుండెపోటు, స్ట్రోక్‌, ఇతర తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతాయి.

ldl cholesterol range and classification in Telugu

శరీరంలో దీని పరిధి 100 mg/dl కంటే తక్కువగా ఉండాలి . 100 నుంచి 129 మధ్య ఉంటే అది సాధారణ కేటగిరీలోకి వస్తుంది. మీకు ఎలాంటి వ్యాధి లేకుంటే.. మీ కొలెస్ట్రాల్ స్థాయి 100 నుంచి 129 mg / dL వరకు ఉంటే పర్వాలేదు . మీరు గుండె రోగి అయితే.. మీ కొలెస్ట్రాల్ స్థాయి 100 నుంచి 129 mg/dL వరకు ఉంటే అది ప్రమాదకరం.

పరీక్షలో కొలెస్ట్రాల్ స్థాయి 130 నుంచి 159 mg / dL వరకు వచ్చినట్లయితే, అది ‘బోర్డర్‌లైన్ హై’గా ఉందని అంటారు 

కొలెస్ట్రాల్ స్థాయి 160 నుంచి 189 mg/dL ఉన్న వ్యక్తులు అయితే.. అది అధిక లేదా హై జాబితాలోకి వస్తుంది. .

190 కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ స్థాయిని కలిగి ఉంటే. చాలా ఎక్కువగా వెరీ హై గా గుర్తిస్తారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.

విఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ 

ఇది కూడా చెడు కొలెస్ట్రాల్. ఇది ఎక్కువగా ట్రైగ్లిజరైడ్‌లను కలిగి ఉంటుంది

విఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ (చాలా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) 30mg/dl కంటే తక్కువగా ఉండాలి.

నాన్ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ 

మంచి కొలెస్ట్రాల్ మినహా అన్ని కొలెస్ట్రాల్‌ను నాన్ హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. 

అంటే టోటల్ కొలెస్ట్రాల్-హెచ్‌డిఎల్ = నాన్-హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్

అంటే టోటల్ కొలెస్ట్రాల్ మైనస్ హెచ్‌డిఎల్ ఈజ్ ఈక్వల్ టు నాన్-హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ మరియు హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ నిష్పత్తి – దాని సాధారణ పరిధి ఐదు కంటే తక్కువగా ఉండాలి.

ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ మరియు హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ నిష్పత్తి 3.5 కంటే తక్కువగా ఉండాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now