CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

Symptoms of anemia in Telugu

Symptoms of Anemia in Telugu

రక్తహీనత ( రక్తం లేకపోవడం) అనేది రక్త సంబంధిత వ్యాధి. ఇది చాలా సాధారణంగా ఉండే రుగ్మత.

హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం అనేది మన దేశంలో చాలా కామన్‌గా వచ్చే సమస్య . ఇండియా లో దాదాపు మూడింట ఒకవంతు మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.  మహిళల్లో ఈ అనీమియా మరింత ఎక్కువగా వస్తుంది.  అయితే, రక్తహీనతను నివారించవచ్చు. దానికి ఐరన్ రిచ్ ఫుడ్స్ మరియు బి 12 ఫుడ్స్ తీసుకోవాలి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వల్ల పలు సమస్యలు ఎదురవుతాయి.  అవి ఏమిటో ఇక్కడ చర్చిద్దాం.

రక్తహీనత యొక్క రకాలు

  1. ఐరన్ లోపం వాళ్ళ వచ్చే అనీమియా
  2. విటమిన్ లోపం అనీమియా: విటమిన్ B-12 మరియు ఫోలేట్ లేకపోవడం వల్ల రక్తహీనత
  3. అప్లాస్టిక్ అనీమియా – కొత్త ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో ఎముక మజ్జ వైఫల్యం
  4. సికిల్ సెల్ అనీమియా, తలసేమియా : హిమోగ్లోబిన్ యొక్క DNA దెబ్బతినడం వల్ల రక్తహీనత

TYPES OF ANEMIA - TELUGU

అనీమియా ఉంటే ఏమేం లక్షణాలు ఉంటాయి?

రక్తహీనత యొక్క లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. అయినప్పటికీ , కొన్ని సాధారణ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.  

Symptoms of anemia in Telugu

  1. ఈ అనీమియా సమస్య ఉన్నవారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొద్ది నిమిషాలు నడిచినా లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస తీసుకోలేకపోతుంటారు.
  2. నీరసం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కలిగి ఉంటారు. 
  3. ఆకలి తగ్గడం, వ్యాధి నిరోధకత సన్నగిల్లడం, పాలిపోయిన చర్మం, ఛాతి నొప్పి, అర చేతులు, పాదాలు చల్లగా అవ్వడం, గోర్లు సరిగ్గా ఎదగకపోవడం వంటి లక్షణాలను కూడా ఉంటాయి.  మీ ముందు రుచికరమైన ఆహారం ఉన్న తర్వాత కూడా తినాలని అనిపించదు. 
  4.  కొన్ని వింత లక్షణాలు కూడా కలిగి ఉంటారు.  మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం తదితర పదార్థాలను తినాలపిస్తుంటుంది.  
  5. పిల్లల్లో జ్ఞాపకశక్తి మందగించడం, మాటలు సరిగా రాకపోవడం, గణితంలో ప్రావీణ్యత తగ్గడం, ఆట-పాటలలో వెనుకబడటం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. 
  6. మైకము
  7. తలనొప్పి
  8. హార్ట్ బీట్ ఎక్కువగా ఉండడం
  9. ఎముక, ఛాతీ, కీళ్ల మరియు కడుపు నొప్పి మొదలైనవి.

మీకు పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా ఉంటే, వైద్యుడిని సంప్రదించండి. అవసరమైతే, అతను రక్తహీనతను నిర్ధారించడానికి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వంటి రక్త పరీక్షలను చేయిస్తాడు. రక్తహీనత కారణాన్ని నిర్ధారించడానికి మీరు మరిన్ని రక్త పరీక్షలు చేయించుకోవలసి రావచ్చు.

  1.  పెరిఫెరల్ బ్లడ్ స్మియర్
  2. సీరం   ఫెర్రిటిన్ పరీక్ష
  3.   సీరం బి 12 పరీక్ష
  4. రెటికులోసైట్ కౌంట్
  5. హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్
  6. ఎండోస్కోపీ

 

 

2 thoughts on “Symptoms of Anemia in Telugu”

  1. Pingback: Symptoms of B12 deficiency in Telugu - DM HEART CARE CLINIC

  2. Pingback: Best iron-rich indian foods to improve hemoglobin - DM HEART CARE CLINIC

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now