కాలేయం కొంత కొవ్వును కలిగి ఉండటం సాధారణమైనప్పటికీ, కాలేయం యొక్క బరువులో 5-10% కంటే ఎక్కువ కొవ్వుతో కూడి ఉంటే, అది ఫాటీ లివర్గా పరిగణించబడుతుంది. రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం ఫ్యాటీ లివర్ వ్యాధికి ప్రధాన కారణం. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది రెండో రకం . ఊబకాయం, , టైప్ 2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక రక్తపోటు కారకాలతో ఇది వస్తుంది .
ఫాటీ లివర్ త్రీ స్టేజెస్ లో ఉంటుంది.
మొదటి స్టేజ్
మొదటిది ఫాటీ లివర్. కొవ్వు కాలేయం చుట్టూ చేరడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది.
సెకండ్ స్టేజ్
ఈ సమస్య ఎక్కువ అయితే సెకండ్ స్టేజ్ అయిన స్టీటోహెపటైటిస్కి దారితీస్తుంది.ఈ స్టేజ్ లో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువై లివర్ పనిచేయకుండా పోతుంది. ఇది మరింత ప్రమాదకరం.
థర్డ్ స్టేజ్
వ్యాధి ఇంకా ముదిరితే సిర్రోసిస్ అంటారు. ఇది థర్డ్ స్టేజ్ . ఇందులో ఆరోగ్యకరమైన టిష్యూను స్కార్ టిష్యూ రీప్లేస్ చేస్తుంది. దీని వల్ల కాలేయంలో మచ్చలు ఏర్పడతాయి. మచ్చ కణజాలం ఏర్పడిన తర్వాత దానిని తొలగించడం లేదా చికిత్స చేయడం సాధ్యం కాదు. లివర్ పెర్మనెంట్ గా డామేజ్ అయ్యినట్టు. అంతిమంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దారితీస్తుంది.
అందుకే వ్యాధి ముదరక ముందే వీటిని గ్రహించి వెంటనే చికిత్స తీసుకోవాలి. అప్పుడే ప్రమాదం నుంచి బయటపడతారు.