Triglycerides Meaning in Telugu is ట్రైగ్లిజరైడ్స్. ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) అంటే మానవుని శరీర రక్తం లో ప్రవహించే ఒక రకమైన కొవ్వు పదార్థాలు. ఈ కొవ్వు పదార్థాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం కొలెస్ట్రాల్ కు సంబంధించిన లిపిడ్ ప్రొఫైల్ (Lipid profile or Lipid panel blood test) పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది.. రక్తప్రసరణలో ఎక్కువ స్థాయిలో ట్రైగ్లిజెరైడ్లుండడం మన శరీరానికి హాని కలిగించవచ్చు.
Hypertriglyceridemia
రక్తప్రసరణలో ఎక్కువ స్థాయిలో ట్రైగ్లిజెరైడ్లుండడం “హైపర్ ట్రైగ్లిసరిడామియా” (Hypertriglyceridemia) అని పిలుస్తారు.
Dangers Of Having High Triglycerides
1. Heart diseases | గుండె జబ్బులు
రక్తంలో కొవ్వు గుండె రక్తనాళాలలో పూడికలు ఏర్పడడానికి Hypertriglyceridemia కారణం కావచ్చు.
ఎక్కువ స్థాయి లో ట్రైగ్లిజెరైడ్లుండడంవల్ల గుండె రక్తనాళాలు గట్టిపడడం జరుగుతుంది . ఇది క్రమేపి గుండెపోటుకి (heart attack) కారణం కావొచ్చు.
2. Brain stroke | పక్షవాతం
ట్రైగ్లిజరైడ్లు మెదడుకు రక్తాన్ని నిరోధించి పక్షవాతానికి (brain stroke) కూడా దారితీయవచ్చు.
3. Pancreatitis | ప్యాంక్రియాటైటిస్
ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటె కడుపులో తీవ్రమైన నొప్పికి కారణమయ్యే అవకాశం ఉంది. దీనికి ప్యాంక్రియాటైటిస్ (pancreatitis) అంటారు. ప్యాంక్రియాస్ (pancreas) అనేది 12 నుండి 20 సెం.మీ పొడవుకలిగిన అవయవం. గర్భాశయం లోపల, కడుపు వెనుక మరియు కాలేయం క్రింద ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ జబ్బుతో ప్యాంక్రియాస్ అనే గ్రంధి అకస్మాత్తుగా ఉబ్బిపోతుంది . ఇది చాల ప్రమాదకరమైన జబ్బు.
నాకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయని నేను ఎలా తెలుసుకోగలను?
డయాగ్నోస్టిక్ సెంటర్‌లో (diagnostic centre) లిపిడ్ ప్రొఫైల్ రక్త పరీక్ష చేయించుకోండి.
Pingback: Heart attack in Telugu | గుండెపోటు ఎలా వస్తుంది - DM HEART CARE CLINIC
Pingback: 10 Causes of High Blood Triglycerides in Telugu - DM HEART CARE CLINIC
Pingback: Is it good to eat Fish After Heart attack in Telugu - DM HEART CARE CLINIC
Pingback: Is red meat good for heart patients after angioplasty - DM HEART CARE CLINIC
Pingback: Triglycerides diet Telugu - DM HEART CARE CLINIC