CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

LIVER FUNCTION TEST TELUGU

LIVER FUNCTION TEST TELUGU

కాలేయం మన శరీరంలో అతిపెద్ద గ్రంథి. లివర్ శరీరంలో ప్రోటీన్లు, ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి మరియు మన ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మందులు,ఇన్ఫెక్షన్స్ , ఆల్కహాల్‌ వల్ల మన కాలేయం పాడైపోతుంది. లివర్‌ ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేయడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి .

లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటే ఏమిటి?

లివర్ ఫంక్షన్ టెస్ట్ ని కాలేయ పనితీరు పరీక్ష లేదా ఎల్ ఎఫ్ టి అని కూడా పిలుస్తాము. మీ కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడిన వివిధ పదార్ధాలను కొలిచే రక్త పరీక్ష.  ఈ పరీక్ష ద్వారా వివిధ రకాల కాలేయ సంబంధిత వ్యాధులను లేదా మీ పిత్త వాహిక సంబంధిత వ్యాధులను  గుర్తించగలం. కాలేయం సరిగ్గా పని చేస్తుందో లేదో మరియు మన శరీరంలో కాలేయం ద్వారా ఎన్ని ప్రోటీన్లు మరియు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతున్నాయి మరియు బిలిరుబిన్ స్థాయిలు లాంటివి నిర్ధారించబడుతాయి.

కాలేయ పనితీరు పరీక్షలో అనేక రకాల పరీక్షలు చేస్తారు..

సీరం బిలిరుబిన్: బిలిరుబిన్ అనేది ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం సమయంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థపదార్థం. లివర్‌ దెబ్బతిన్నప్పుడు, రక్తంలో బిలిరుబిన్ పేరుకుపోతుంది. ఇది కామెర్లుకి దారితీస్తుంది.

  • మొత్తం బిలిరుబిన్ – 0 2-1.2 mg/dl
    ప్రత్యక్ష బిలిరుబిన్ – 0.0-0.2 mg/dl
    పరోక్ష బిలిరుబిన్ – 0.5 – 0.7 mg/dl

సీరం ప్రోటీన్ :సీరం ప్రొటీన్ టెస్ట్ మీ రక్తంలో ప్రోటీన్ స్థాయిని కొలుస్తుంది. మీ కాలేయం ప్రోటీన్‌ను తయారు చేస్తుంది. ప్రోటీన్  శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది.   తక్కువ ప్రోటీన్ స్థాయిలు మీ కాలేయం సరిగా పనిచేయడం లేదని సూచించవచ్చు.

  • మొత్తం ప్రోటీన్ – 6.0 – 8.0 gm/dl
    అల్బుమిన్ – 3.8- 5.0 gm/dl
    గ్లోబులిన్ – 2.3- 3.5 gm/dl
    A/G నిష్పత్తి = అల్బుమిన్ / గ్లోబులిన్ నిష్పత్తి (2:1)

కాలేయ ఎంజైమ్ పరీక్షలు

SGOT, SGPT, ALP, GGT, LDH వంటి ఈ పరీక్షలు మీ రక్తంలోని కొన్ని ఎంజైమ్‌ల స్థాయిలను కొలుస్తాయి. లివర్‌ దెబ్బతిన్నప్పుడు, బాగా పనిచేయనప్పుడు ఈ ఎంజైమ్‌లు రక్తప్రవాహంలోకి లీక్‌ అవుతాయి.

సీరం గ్లుటామేట్ ఆక్సలోఅసెటేట్ ట్రాన్సమినేస్ (SGOT) – 5-35 U/L

సీరం గ్లుటామేట్ పైరువేట్ ట్రాన్సామినేస్ (SGPT) – 5-40 U/L

సీరమ్ ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ (ALP) – 4-11 KA

సీరమ్ గామా గ్లుటామేట్ బ (GGT) – 9-48 U/L

లాక్టేట్ డీహైడ్రాజినేస్ (LDH) – 230-460 U/L

బ్లడ్‌ క్లాట్‌ టెస్ట్‌

రక్తం గడ్డకట్టడానికి అవసరమైన నిర్దిష్ట ప్రోటీన్లు లేకపోవడం వల్ల రక్తం గడ్డకట్టదు.ఎందుకంటే ఈ ప్రోటీన్ కాలేయంలో తయారవుతుంది .కాలేయం సాధారణంగా పనిచేయకపోతే ప్రొటీన్ ఉత్పత్తి దెబ్బతింటుంది. ప్రోథ్రాంబిన్ టైమ్ పరీక్ష మీ రక్త నమూనాలు గడ్డకట్టడానికి ఎంత సమయం పడుతుందో కొలుస్తుంది . లివర్‌ సరిగ్గా పని చేయకపోతే, రక్తం గడ్డకట్టదు.

ప్రోథ్రాంబిన్ సమయ పరీక్ష (PTT) – 11-15 సెకన్లు

 

ఈ టెస్ట్ చేసేటపుడు ల్యాబ్ టెక్నీషియన్ బ్లడ్ శాంపిల్ తీస్తున్న ప్రాంతాన్ని శుభ్రం చేస్తారు. కాలేయ పనితీరు పరీక్షకు 2- 3 ml రక్తం అవసరమవుతుంది. రక్తం తీసుకున్న తర్వాత, దానిని పరీక్ష కోసం పంపబడుతుంది.

LFT పరీక్ష ఎప్పుడు చేయాలి?

మన కాలేయం 40-60% పాడైపోయే వరకు వీటి సంకేతాలు ఉండవు, కాబట్టి మనం రొటీన్ చెకప్‌లో లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి.

మీరు క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకుంటే, మీరు మీ లివర్ ఫంక్షన్ టెస్ట్ని క్రమం తప్పకుండా మరియు ప్రతి సంవత్సరం చేయించుకోవాలి. ఇది కాకుండా, 20 మరియు 40 సంవత్సరాల మధ్య ప్రతి మూడు సంవత్సరాలకు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి. మీ వయస్సు 40 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటే, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ ని చేయించుకోవాలి

మీరు ఇలాంటి లక్షణాలను అనుభవిస్తే, మీరు కాలేయ పనితీరు పరీక్ష చేయించుకోవాలి. జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, వికారం మరియు వాంతులు, పొత్తికడుపు వాపు, పాదాలు పొంగిపోవడం, ఆకలి తగ్గి పోవడం , బరువు తగ్గిపోవడం, అలసట, దురద , కళ్ళు పసుపు రంగులోకి మారడం,  మూత్రం   ముదురు పసుపు రంగులోకి మారడం.

 

కాలేయ పనితీరు పరీక్ష చేయించుకునే ముందు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు.

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now