CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

Causes of leg or ankle swelling in Telugu | pedal edema reasons

Leg Swelling Reasons In Telugu | కాళ్ళ వాపులకు కారణాలు

కాళ్లవాపు (leg swelling) అనేది సర్వసాధారణంగా కనిపించే సమస్య. మీ శరీరంలోని కణజాలాలలో నీరు చేరడాన్ని ఎడెమా(edema) అంటారు. ఎక్కువమందిలో నీరు చేరడం  పాదాలు, చీలమండలు మరియు కాళ్ళలో సంభవిస్తుంది, అయితే ముఖం, చేతులు మరియు కడుపులో కూడా నీరు చేరవచ్చు.

Pedal edema అంటే ఏమిటి ?

చీలమండలు, పాదాలు మరియు కాళ్లలో నీరు చేరడాన్ని Pedal edema అంటారు.

Pedal edema ఎలా వస్తుంది?

మన బరువులో అరవై శాతం వరకు నీరు ఉంటుంది. నలబై శాతం నీరు మన శరీరంలోని జీవకణాల్లో న ఉంటుంది. ఇక పదహారు శాతం నీరు జీవకణాల మధ్య ఉంటుంది. మిగతా నాలుగు శాతం రక్తంలో ప్లాస్మా రూపంలో ఉంటుంది. ఇలా మన ఒంట్లో నీరు మూడు విభాగాల్లో ఉంటుంది.

నీరు  ఒక భాగం నుంచి మరో భాగంలోకి చాలా తేలికగా మారిపోతుంటుంది. ప్రక్రియలో ఎక్కడ తేడా వచ్చినా ఒంట్లో నీరు ఎక్కువగా చేరిపోయే అవకాశం ఉంటుంది.

కాళ్లలో వాపు రావడానికి కారణాలు

నిజానికి కాళ్లలో వాపు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ, ఎక్కువమందిలో క్రింది పరిస్థితుల వల్ల కాళ్లలో వాపు కలుగుతుంది.

Causes of swelling leg infographics in Telugu

ఎక్కువసేపు నిలబడడం లేదా కూర్చోవడం

మీరు ఎక్కువసేపు నిలబడితే నీరు మీ చేతులు, కాళ్ళు మరియు పాదాలలోకి చేరుతుంది. అలాగే ఎక్కువసేపు కూర్చున్నా కూడా కాళ్ళ వాపు రావచ్చు. పనిచేసే చోట అదే పనిగా కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి నిలబడడం, నడవడం, పచార్లు కొట్టడం లాంటివి చేయాలి.

Leg Swelling Reasons In Telugu - prolonged sitting

ఉప్పు ఎక్కువ మొత్తంలో తినడం

ఉప్పు ఎక్కువ మొత్తంలో తినడం వల్ల కూడా మీ కాళ్లలో వాపు రావచ్చు. అలంటి వారికి ఉప్పు తీసుకోవడం తగ్గించమని సూచిస్తున్నారు. అంతే కాకుండా ఆహారంలో ఉప్పు తక్కువగా తినేవారు ఎక్కువ కాలం జీవిస్తారని కూడా గమనించాలి. అధిక ఉప్పు తినేవారికి అధిక రక్తపోటు మరియు గుండెపోటు కూడా వస్తాయి.

Leg Swelling Reasons In Telugu - high salt foods

అధిక బరువు కలిగి ఉండడం

అధిక బరువు కలిగి ఉండే వారికి కాళ్లవాపులు తరచుగా వస్తూ ఉంటాయి. ఊబకాయం డయాబెటిస్, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అయితే, ఆహారం, కొన్ని జీవనశైలి మార్పులు మరియు వ్యాయామం ద్వారా అధిక బరువు నియంత్రించవచ్చు.

Leg Swelling Reasons In Telugu - weight gain or obesity

గర్భిణీ స్త్రీ

గర్భధారణ సమయంలో, ముఖ్యంగా కాళ్లు, చీలమండలు, పాదాలు మరియు వేళ్లలో కొంత వాపు ఉండటం సాధారణం.  గర్భం యొక్క చివరి నెలలో  స్త్రీలకు  వాపు లాంటి సమస్యలు ఉంటాయి. బీపీ కారణంగా కూడా ఇది అవ్వవచ్చు. ఉప్పు ఎక్కువ తీసుకోవడం కూడా ఒక కారణం. మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చండి. పండ్లు తినండి.

Leg Swelling Reasons In Telugu - Pregnancy

మందుల నుండి వచ్చే దుష్ప్రభావం

తరచుగా వాడే మందుల నుండి వచ్చే దుష్ప్రభావాలు పాదాల వాపుకు మరొక సాధారణ కారణం. అధిక రక్తపోటు మాత్రలు, గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ థెరపీ, యాంటిడిప్రెసెంట్స్ లేదా స్టెరాయిడ్స్ వంటి కొన్ని మందులను తీసుకోవడం వల్ల కాళ్లవాపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Leg Swelling Reasons In Telugu - certain medications

హార్ట్‌ ఫెయిల్యూర్‌ లేదా గుండె సమస్యలు

మీ గుండె యొక్క దిగువ గదుల్లో రక్తం పంపు బాగా లేకపోతే  అప్పుడు, నీరు మీ కాళ్లు, చీలమండలు మరియు పాదాలలో చేరి, కాళ్లవాపుకు దారితీస్తుంది. దీనినే హార్ట్‌ ఫెయిల్యూర్‌ (heart failure) అంటాము.  వీరు శ్వాస తీసుకోలేకపోతుంటారు. దీని కోసం మీ కార్డియాలజిస్ట్ సలహాను అనుసరించండి.

Leg Swelling Reasons In Telugu - heart failure

మూత్రపిండాల వ్యాధులు

మూత్రపిండాల వ్యాధులు కారణంగా కాళ్ళ వాపు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మూత్రపిండాల పనితీరు మందగిస్తే శరీరంలో లో ఉప్పు,  నీరు నిల్వ ఉండి కాళ్ళ వాపులకు దారి తీయవచ్చు. దీని వలన పాదాలు మరియు చీలమండలు ఉబ్బుతాయి.

నెఫ్రోటిక్ సిండ్రోమ్ లో మూత్రంలో అధిక ప్రోటీన్ కోల్పోవడం  జరుగుతుంది. దీనివల్ల రక్తంలో ప్రోటీన్ శాతం తగ్గి రక్తం పల్చగా తయారై అప్పుడు కూడా  కళ్లు, కాళ్లు, చేతుల చుట్టూ వాపు వస్తుంది.

Leg Swelling Reasons In Telugu - kidney failure and nephrotic syndrome

కాలేయ సంబంధిత వ్యాధులు

 

మన శరీరంలో లో ప్రోటీన్ కాలేయం ఉత్పత్తి చేస్తుంది . కాలేయ సంబంధిత రోగాలతో బాధపడేవారిలో  ప్రోటీన్ శాతం తక్కువగా ఉంటుంది.   అందువల్ల కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు పాదాలు ఉబ్బుతాయి. దీనిని సిర్రోసిస్ అంటారు. సిర్రోసిస్ అత్యంత తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధిలో, కాలేయ కణాలు పెద్ద ఎత్తున నాశనమవుతాయి.

liver diseases are a common cause of leg swelling- liver with surrounding structures

పోషకాహార లోపం

ఆహారం తీసుకోవడం ద్వారానే శరీరానికి పోషకాలు అందుతాయి.  పోషకాహార లోపం సాధారణంగా తగినంత సమతుల్య ఆహారం లేకపోవడం వల్ల సంభవిస్తుంది. పోషకాహార లోపం రక్తంలో ప్రోటీన్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇది కాళ్లు చుట్టూ వాపు కు దారితీస్తుంది. అందుకోసం  సమతుల్య ఆహారం తీసుకోండి. పోషకాహార లోపం రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత కూడా ఎడెమాకు దారితీయవచ్చు

Leg Swelling Reasons In Telugu - malnutrition

థైరాయిడ్ సమస్య

హార్మోన్ ప్రభావం వల్ల   కాళ్ళలో నీరు రావచ్చు . హైపోథైరాయిడిజం అనేది మీ శరీరం తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు ఏర్పడే పరిస్థితి. మీ దిగువ కాళ్ళలో చర్మం వాపు మరియు గట్టిపడటం అనేది థైరాయిడ్ సమస్య యొక్క లక్షణం కావచ్చు.

Leg Swelling Reasons In Telugu - low thyroid or hypothyroidism

కాళ్ళకి గాయం

కాళ్ళకి గాయం లేదా బెణుకు అయినప్పుడు దెబ్బ తగిలిన కాలు వాపుకు గురి అవుతుంది.

అదేవిధంగా, కీటకం  కుట్టడం వలన, కుట్టిన పాదం ఉబ్బుతుంది.

సిరల్లో రక్తం గడ్డకట్టడం ( DVT or Deep vein thrombosis)

కాలులోని సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల మీ కాళ్ళలో వాపు, నొప్పి, ఉష్ణోగ్రత పెరుగుదల మరియు  కాలు రంగులో మార్పును గమనించవచ్చు. గడ్డకట్టడం తొలగించబడిన తర్వాత లేదా కరిగిపోయిన తర్వాత, వాపు మరియు నొప్పి నెమ్మదిగా తగ్గిపోతుంది

DVT causes leg swelling - blood clots in the veins in the leg causing leg swelling

సెల్యులైటిస్ (cellulitis)

సెల్యులైటిస్ అనేది చర్మానికి సోకే ఒక తరహా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌. సెల్యులైటిస్ లో కాలు విపరీతంగా వాచిపోయి, ఎర్రగా కందిపోయి, ముట్టుకుంటేనే నొప్పిని కలిగిస్తూ బాధాకరంగా మారిపోతుంది. సెల్యులైటిస్ సాధారణంగా కాళ్ళను ప్రభావితం చేస్తుంది కానీ ముఖం, చేతులు మరియు ఇతర ప్రదేశాలను కూడా ప్రభావితం  చేయవచ్చు.

కాళ్ళ వాపులు ఉంటే ఏమి చేయాలి

కాళ్లవాపులు  ఉంటే  ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కాళ్లవాపులు వెనుక కారణం ఏంటి అన్నది తెలుసుకోవడమే ప్రధానం. కొన్ని రకాల నిర్ధారణ పరీక్షలు చేయించడం ద్వారా అసలు కారణం  తెలియవచ్చు. మీ డాక్టర్ మీకు 2d echo పరీక్ష, రక్త పరీక్ష మరియు స్కానింగ్ పరీక్ష  చేయించవచ్చు

కాళ్లవాపులు కోసం  కొన్ని  పరీక్షలు అవసరం.  అవి ఏమిటంటే

  1. హిమోగ్లోబిన్
  2. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్
  3. లివర్ ఫంక్షన్ టెస్ట్
  4. ఈసీజీ
  5. 2డి ఎకో
  6. థైరాయిడ్ ప్రొఫైల్

కాళ్ళ వాపులకు చికిత్స

ఉప్పు తగ్గించుకోవడం,ఎక్కువ సేపు నిల్చో కుండా ఉండటం, నిత్యం నడక, కొన్ని మందుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ద్వారా కాళ్ళ వాపులు రాకుండా నివారించవచ్చు. సంబంధిత డాక్టర్ని సంప్రదించి తగిన సూచనలను పాటించాలి.

5 thoughts on “Leg Swelling Reasons In Telugu | కాళ్ళ వాపులకు కారణాలు”

  1. Pingback: ECG test in Telugu - DM HEART CARE CLINIC

  2. Pingback: Blood test for heart failure - NT pro BNP in Telugu - DM HEART CARE CLINIC

  3. Pingback: 2d ఎకో పరీక్ష - 2d echo test in Telugu - CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

  4. Pingback: Heart Failure Symptoms in Telugu - DM HEART CARE CLINIC

  5. Pingback: Symptoms of kidney disease - DM HEART CARE CLINIC

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now