కొలెస్ట్రాల్ ప్యానెల్ అని కూడా పిలువబడే లిపిడ్ ప్రొఫైల్ (lipid profile), రక్తప్రవాహంలో వివిధ రకాల కొవ్వుల స్థాయిలను కొలిచే ఒక రకమైన రక్త పరీక్ష.
లిపిడ్ ప్రొఫైల్‌లో ఉండే పారామీటర్స్
1.సీరమ్ టోటల్ కొలెస్ట్రాల్ ( total cholesterol)
2.సీరమ్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ ( HDL cholesterol)
3.సీరమ్ ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides)
4.ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ( LDL cholesterol)
5.విఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ( VLDL cholesterol)
లిపిడ్ ప్రొఫైల్‌లో అత్యంత ముఖ్యమైన పారామీటర్
లిపిడ్ ప్రొఫైల్‌లోని అన్ని పారామీటర్లు ముఖ్యమైనవి. అవన్నీ ఒక వ్యక్తి యొక్క ఫాట్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిల గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. అయితే, వీటిలో అత్యంత ముఖ్యమైన పారామీటర్ ఏమిటి అని అడిగితే LDL కొలెస్ట్రాల్ లేదా “చెడు” కొలెస్ట్రాల్ అని చెబుతాను. ఇది ధమనులలో ఫలకం ఏర్పడటానికి దోహదం చేస్తుంది. LDL కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అదనపు కొలెస్ట్రాల్ ధమనుల గోడలలో పేరుకుపోతుంది. కాలక్రమేణా, ఇది ధమనులను ఇరుకైనదిగా చేస్తుంది. తద్వారా రక్తం ప్రవహించడం కష్టమవుతుంది. ఇది గుండెపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్‌తో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
కాబట్టి LDL కొలెస్ట్రాల్ యొక్క అధిక స్థాయిలు గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకంగా చెప్పుకోవచ్చు.
లిపిడ్ ప్రొఫైల్‌లోని ఇతర పారామీటర్లో HDL కొలెస్ట్రాల్ లేదా “మంచి” కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ మరియు మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నాయి. కానీ వీటికన్నా LDL కొలెస్ట్రాల్ యొక్క స్థాయిలు చాలా ముఖ్యం.