యూరిక్ యాసిడ్ (uric acid) అనేది ప్రతి ఒక్కరి శరీరంలో తయారయ్యే ఒక మూలకం. మహిళలో యూరిక్ యాసిడ్ యొక్క సాధారణ పరిధి 2.4 నుండి 6.0 mg/dL. పురుషులలో దీని సాధారణ పరిధి 3.4 నుండి 7.0 mg/dL.
శరీరంలో యూరిక్ యాసిడ్ ఒక స్థాయి కంటే ఎక్కువగా ఉంటే ప్రమాదకరం. దీని వల్ల జాయింట్ ప్రోబ్లెంస్ మరియు కిడ్నీ లో రాళ్ళూ రావొచ్చు.
కీళ్లలో యూరిక్ ఆసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవ్వడం వాళ్ళ గౌట్ (gout) సంభవిస్తుంది. గౌట్ అనేది ఆర్థరైటిస్. కీళ్లలో ఆకస్మిక తీవ్రమైన నొప్పి, వాపు, కంది పోవడం గౌట్ యొక్క లక్షణాలు. ఈ వ్యాధి ఎక్కువగా పాదాల మీద ప్రభావం చూపిస్తుంది. గౌట్ ని కంట్రోల్ చేయకపోతే జాయింట్స్ పర్మినెంట్‌గా డామేజ్ అయిపోతాయి.
అందుకే శరీరంలో యూరిక్ యాసిడ్‌ను సమతుల్యంగా ఉంచాలి. ఆహారంలో ఉండే ప్యూరిన్ మరియు ఫ్రూక్టోజ్ యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. ఆహారంలో ప్యూరిన్ కంటెంట్ అండ్ ఫ్రూక్టోజ్ కంటెంట్ తెలుసుకొని తినాలి .
గౌట్ దాడులను ప్రేరేపించే లేదా మరింత తీవ్రతరం చేసే కొన్ని ఆహారాలు మరియు పానీయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం .
అవయవ మాంసాలు
కాలేయం (లివర్) , మూత్రపిండాలు మరియు స్వీట్బ్రెడ్లు (మెదడు) వంటి అవయవ మాంసాలను తీసుకోవడం మానుకోండి ఎందుకంటే వీటిలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్యూరిన్లలో చాల ఎక్కువగా ఉంటాయి. ప్యూరిన్ కంటెంట్ లో ఇవే నెంబర్ వన్.
సీఫుడ్
ఆంకోవీస్ లేదా నేతలు, సార్డినెస్ లేదా కవలు, మాకేరెల్ లేదా కన్నంగదాతా చేప , హెర్రింగ్ మరియు స్కాలోప్స్ వంటి కొన్ని సీఫుడ్‌లలో కూడా ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. రోహు లేదా శీలావతి, కట్ల లేదా బొచ్చ చేప కూడా తినకూడదు. వీటి బదులుగా మాగా, టూరా చెప తినండి.
రెడ్ మీట్
గొడ్డు మాంసం, గొర్రె మాంసం, మేక మాంసం మరియు పంది మాంసంతో సహా ఇతర రెడ్ మీట్ వినియోగాన్ని ఆపండి. ఎందుకంటే వాటిలో ప్యూరిన్లు అధిక స్థాయిలో ఉంటాయి. వీటి బదులుగా స్కిన్ లెస్ చికెన్ తినండి.
షెల్ఫిష్
రొయ్యలు, ఎండ్రకాయలు, పీత మరియు ఇతర షెల్ఫిష్లు అధిక ప్యూరిన్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. వాటిని కూడా ఆహారం నుంచి నివారించాలి.
ఆల్కహాల్
బీర్, అధిక ప్యూరిన్ కంటెంట్ కారణంగా గౌట్ దాడులను ప్రేరేపిస్తుంది. వైన్ మరియు ఇతర ఆల్కహాల్ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడానికి దోహదపడతాయి. వీటిని పూర్తిగా నివారించాలి.
చక్కెర పానీయాలు
శీతల పానీయాలు మరియు చక్కెరలు జోడించిన పండ్ల రసాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వీటి బదులుగా నీరు, హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ ఎంచుకోవడం ఉత్తమం.
అధిక కెలొరీ ఆహారం
ఇవి అధిక బరువుకి కారణం కావొచ్చు . అధిక బరువు యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.
ప్రాసెస్ చేయబడిన ఆహారాలు
ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్ వంటి అత్యంత ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తరచుగా అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి, ఇవి గౌట్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి.
అధిక కొవ్వు పాల ఉత్పత్తులు
వెన్న తియ్యని పాలు, క్రీమ్, చీజ్ మరియు వెన్న వంటి పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. బదులుగా తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాలను తాగండి. ఉదాహరణకు డబల్ టోన్డ్ మిల్క్ .
ఈస్ట్-రిచ్ ఫుడ్స్
బ్రెడ్, పేస్ట్రీలు మరియు కొన్ని రకాల బీర్ వంటి ఈస్ట్‌తో చేసిన ఆహారాలు వాటి అధిక ప్యూరిన్ కంటెంట్ కారణంగా గౌట్ దాడులకు దోహదం చేస్తాయి అని పరిశోధనలో తెలిసింది . వీటిని కూడా అవాయిడ్ చెయ్యండి.
ఆకుకూరలూ, కూరగాయలూ ఎక్కువ తీసుకోడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువగా నీరు తీసుకోవడం, బరువును నియంత్రలో పెట్టుకుంటే యూరిక్ ఆసిడ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.