రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ (triglycerides) ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉండే కండిషన్‌ను ‘హైపర్ ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. ఇవి పెరగడం వల్ల పాంక్రియాటైటిస్ వస్తుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. మెదడుకూ హాని కలగజేసే అవకాశం ఉంది. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా… అంటే ఆహార నియమాలు, వ్యాయామం చేయడం వంటివి పాటించడం ద్వారా రక్తంలో వాటి పాళ్లను తగ్గించుకోవచ్చు.
ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిని తగ్గించడానికి జీవనశైలి మార్పులు సరిపోని సందర్భాల్లో, వైద్యులు మందులు సూచిస్తారు. ఇలాంటి సాధారణ మందులలో ఒకటి ఫైబ్రేట్ (Fibrates).
ఫైబ్రేట్
ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి ఫెనోఫైబ్రేట్ (Fenofibrate) మరియు జెమ్‌ఫైబ్రోజిల్ (Gemfibrozil) వంటి మందులు సాధారణంగా వాడుతారు.
Fibrate | Brand Names | Common Dosages |
---|---|---|
ఫెనోఫైబ్రేట్ | Tricor, Lofibra, Lipofen | 48 mg, 145 mg, 160 mg, 200 mg |
జెమ్‌ఫైబ్రోజిల్ | Lopid | 600 mg |
ఉపయోగాలు
ఇవి ట్రైగ్లిజరైడ్ రక్త స్థాయిలను ఏకంగా 30% నుండి 50% వరకు తగ్గించడం వాళ్ళ ఎక్కువ మంది ఈ మందులనే ఉపయోగిస్తారు . ఇవి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతాయి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను కేవలం కొంతవరకు తగ్గిస్తాయి.
దుష్ప్రభావాలు
ఫైబ్రేట్లుకి సాధారణంగా దుష్ప్రభావాలు చాలా తక్కువ. కండరాల నొప్పి , గాల్ బ్లాడర్ లో స్టోన్స్ మరియు అజీర్తి, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావచ్చు .
- తలనొప్పి
- కడుపు నొప్పి లేదా అసౌకర్యం
- వికారం మరియు వాంతులు
- అతిసారం
- కాలేయ ఎంజైమ్ స్థాయిలు పెరగడం
- పిత్తాశయ రాళ్ల ప్రమాదం
- కండరాల నొప్పి లేదా బలహీనత (మయోపతి)
- అరుదుగా, రాబ్డోమియోలిసిస్
- అలెర్జీ (దద్దుర్లు, దురద, వాపు)
- ప్యాంక్రియాటైటిస్ (ప్యాంక్రియాస్ యొక్క వాపు)
ఎవరు ఉపయోగించకూడదు?
మీకు తీవ్రమైన మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధి, పిత్తాశయ రాళ్లు, కండరాల రుగ్మతలు ఉన్నట్లయితే ఫైబ్రేట్లు ఉపయోగించకూడదు.
Contraindication | Description |
---|---|
తీవ్రమైన కాలేయ వ్యాధి | ఫైబ్రేట్‌లు కాలేయ ఎంజైమ్ స్థాయిలను పెంచుతాయి . |
పిత్తాశయ వ్యాధి | తీవ్రమైన కాలేయ సమస్యలు ఉన్న వ్యక్తులకు ఇవి సూచించబడవు. ఫైబ్రేట్‌లు పిత్తాశయ రాళ్లు లాంటి పిత్తాశయ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. |
కిడ్నీ వ్యాధి | ఫైబ్రేట్‌లు ప్రధానంగా మూత్రపిండాల ద్వారా తొలగించబడతాయి . తీవ్రమైన మూత్రపిండ సమస్యలు ఉన్న వ్యక్తులలో పేరుకుపోతాయి. |
హైపర్సెన్సిటివిటీ | ఒక వ్యక్తికి ఫైబ్రేట్‌లకు అలెర్జీ ఉంటే, ఇవి సూచించబడవు. |
కండరాల లోపాలు | ఫైబ్రేట్‌లు కండరాల సంబంధిత దుష్ప్రభావాల ప్రమాదాన్ని పెంచుతాయి, ఇందులో మయోపతి మరియు రాబ్డోమియోలిసిస్‌తో సహా. |