ఇప్పుడు ఉన్న కాలంలో గుండె ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని ఆహారాలు మనం తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.ఎలాంటి ఆహారాల్లో చేప (fish) ఒకటి.
చేపల్లో ఉండే ప్రత్యేకతలు ఏమిటి
మానవులకు లభించే ముఖ్యమైన మరియు ఆరోగ్యకరమైన మాంసాహారా ల్లో చేప ఒకటి. చేపల్లో చెడు కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే మటన్ లో చెడు కొవ్వు అధిక మోతాదులో ఉంటుంది. Chicken లో చెడు కొవ్వు కొంచెం తక్కువగా ఉన్న మంచి కొవ్వు అంత ఎక్కువగా ఉండదు. కానీ చేప విషయంలో అలా కాదు. చేపలలో చెడు కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది మరియు మంచి కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది.
మంచి కొవ్వు అంటే ఏమిటి ? దానివల్ల ప్రయోజనాలు
మంచి కొవ్వు అనగా సంతృప్తికర కొవ్వు. సంతృప్తికర కొవ్వు తింటే గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అన్నవి మంచి కొవ్వు కి సంబంధించినవి. మన గుండె కి ఇవి ఎంతో మేలు చేసి గుండె పోటు రాకుండా కాపాడతాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి చాలా మేలు చేస్తాయి
తరుచుగా చేపలు తినడం వల్ల మన రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ (triglycerides) ముప్పై శాతం వరకు తగ్గుతాయి. ట్రైగ్లిజరైడ్స్ (triglycerides) అనగా రక్తంలో ప్రవహించే ఒక రకమైన చెడు కొవ్వు పదార్ధాలు. ట్రైగ్లిజరైడ్స్(triglycerides) మన రక్తంలో ఎక్కువగా ఉంటె గుండెపోటు మరియు పక్షవాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ (triglycerides) ఎక్కువగా ఉన్న వారు తరచుగా చేప తింటే చాలా మంచిది.
రక్తపోటుని తగ్గించడంలో సహాయ పడుతాయి
చేపలలో ఉండే వివిధ పోషకాహారాలు మన రక్తపోటుని గణనీయంగా తగ్గిస్తాయి. చేపలు తింటే BP రెండు నుంచి నాలుగు points వరకు తగ్గుతుంది అని వివిధ పరిశోధనలో వెల్లడైంది.
నాడీ వేగం తక్కువగా కొట్టుకోవడనికి ఉపయోగపడతాయి
చేప తినడం వల్ల నాడీ వేగం తక్కువగా కొట్టుకుంటుంది. ఒక పరిశోధనలో చేప తినడం వల్ల విశ్రాంతి సమయంలో హార్ట్ బీట్ (heart beat) లేదా పల్స్ రేట్ (pulse rate) రెండు నుంచి నాలుగు వరకు తగ్గుతుందని వెల్లడయింది. విశ్రాంతి సమయంలో తక్కువ నాడి వేగం గుండె పనితీరుకు ఒక చిహ్నం.
గుండెపోటు ప్రమాదాన్ని దూరం చేస్తుంది
చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ గుండె రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. తద్వారా ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే విషయంలో చేపలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి.
ఇదే కాకుండా చేపలు ఎక్కువగా తీసుకునే వారికి గుండె లయలో మార్పులు తక్కువగా వస్తాయి. గుండెలయలో మార్పులు రావడాన్ని అంటారు. కొంతమందికి గుండె కొట్టుకోవడం sudden గా ఆగిపోయి ఆకస్మిక మరణం సంభవించవచ్చు. కానీ చేపలు ఎక్కువగా తినే వారికి ఇలా జరగడం తక్కువ.
ఎంత తినాలి
కాబట్టి ప్రతి ఒక్కరు కనీసం వారానికి రెండు సార్లు చేపలు తినాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (heart association) వారు సూచించారు.మొత్తం కలిపి వారానికి వంద గ్రాముల వరకు ఉడకబెట్టిన లేదా grill చేసిన చేపలు తిన్నడం శ్రేయస్కరం.
కనుక చేపలను మీ ఆరోగ్యం లో భాగం చేసుకోవడం మర్చిపోకండి.
Pingback: Iron rich foods list in telugu - DM HEART CARE CLINIC
Pingback: Best iron-rich indian foods to improve hemoglobin - DM HEART CARE CLINIC
Pingback: Symptoms of B12 deficiency in Telugu - DM HEART CARE CLINIC
Pingback: What are the normal levels of triglycerides in the blood (Telugu) - DM HEART CARE CLINIC