మనం కామెర్లు ఉన్నప్పుడు మాంసాన్ని ఎందుకు తినకూడదో తెలుసుకుందాం. కామెర్లు కాలేయాన్ని ప్రభావితం చేసే ఒక వైద్య పరిస్థితి.
కామెర్లు ఉన్నవారు మాంసాహారానికి దూరంగా ఉండవలసిన ఆహార పదార్దాలలో ఒకటి. మాంసంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేయడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది అని మనకు తెలుసు. అందువల్ల మాంసం కాలేయం యొక్క ప్రాసెస్ చేసే సామర్థ్యంపై ఒత్తిడిని కలిగిస్తుంది. అధిక ప్రోటీన్ ఆహారం రక్తప్రవాహంలో అమ్మోనియా పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది మెదడు పనితీరుని దెబ్బతీస్తుంది.అందువల్ల కోమాలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
అంతే కాకుండా , మాంసంలో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయంపై మరింత ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. పిత్తాన్ని ఉత్పత్తి చేయడం కాలేయం బాధ్యత. ఇది కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అయితే, కాలేయం సరిగా పనిచేయనప్పుడు, పిత్త ఉత్పత్తి లోపించి, కొవ్వులను సరిగ్గా జీర్ణం చేయడం శరీరానికి కష్టమవుతుంది. ఇది కాలేయానికి మరింత హాని కలిగించవచ్చు మరియు రికవరీని నెమ్మదిస్తుంది.మాంసాహారం బదులుగా, కామెర్లు ఉన్నవారు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలులతో కూడిన సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టాలి. పుష్కలంగా ద్రవాలు త్రాగాలి.