హాయ్ ఫ్రెండ్స్ . ఈ రోజు ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గించడానికి మందులు ఎప్పుడు మరియు ఎందుకు వాడాలి అని తెలుసుకుందాము( When To Start Treatment For Uric Acid) . ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి .
యూరిక్ యాసిడ్ సాధారణ పరిధి ?
మహిళలో యూరిక్ యాసిడ్ (Uric acid) యొక్క సాధారణ పరిధి 2.4 నుండి 6.0 మిల్లీగ్రాములు పెర్ డెసిలీటర్ . పురుషులలో దీని సాధారణ పరిధి 3.4 నుండి 7.0 మిల్లీగ్రాములు పెర్ డెసిలీటర్
హైపర్ యూరిసేమియా అంటే ఏమిటి ? అది ఎంత మందికి ఉంటుంది ?
మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి 7 మిల్లీగ్రాములు కంటే ఎక్కువుంటే, హైపర్ యూరిసేమియా అంటారు. మనలో 21% మందికి హైపర్ యూరిసేమియా ఉన్నట్లు మన డాక్టర్ మల్లేశ్వర రావు గారు అంటున్నారు. కానీ మనలో కేవలం 3.9% మందిలో గౌట్ వస్తుంది. హైపర్ యూరిసేమియా ఉన్న ప్రతి నాలుగురులో ఒక్కరికి మాత్రమే దాని వల్ల గౌట్ ప్రాబ్లెమ్ వస్తుంది.
ఎసింప్టమాటిక్ హైపర్ ఉరిసీమియా అంటే ఏమిటి ?
ఇలా మనలో చాలా మందికి బ్లడ్ లో చాలా ఎక్కువ యూరిక్ ఆసిడ్ ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు కనపడవు. దాన్ని ఎసింప్టమాటిక్ హైపర్ ఉరిసీమియా అంటారు. వీరికి సాదరంగా మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. 9 మిల్లీ గ్రాములు పెర్ డెసిలీటర్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా దీనికి మెడిసిన్ వాడం. అంటే నలుగురిలో ముగ్గురికి మందులు అవసరం లేదు.
గౌట్ ఎటాక్ అంటే ఏమిటి ?
కానీ కొంతమందిలో రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు గౌట్ (Gout) వ్యాధి సంభవిస్తుంది. యూరిక్ యాసిడ్ ఇలాంటి వారి జాయింట్స్ మధ్యలో సూది వంటి స్పటికాలను ఏర్పరుస్తుంది. జాయింట్స్‌లో యూరిక్ యాసిడ్ చేరిన తరువాత ,జాయింట్స్ వెచ్చగా ఉండడంతో పాటూ భరించలేనంత నొప్పీ, వాపూ ఉంటాయి. ఇలా హఠాత్తుగా వచ్చే నొప్పిని గౌట్ ఎటాక్ అంటారు.
మందులు ఎందుకు వాడాలి ?
గౌట్ ఎటాక్ వచ్చిన వారు భవిష్యత్తులో ఇలాంటి దాడులను నివారించాలి .దీని కోసం , యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే మందులు తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ నొప్పి భరించలేనంతగా ఉంటుంది.అలాగే గౌట్‌ని త్వరగా ట్రీట్ చేయకపోతే జాయింట్స్‌లో యూరిక్ యాసిడ్ వాటిని పర్మినెంట్ గా డామేజ్ చేస్తాయి. అది క్రానిక్ ఆర్థరైటిస్ గా మారుతుంది.
ఏఏ మందులు వాడాలి?
వీటిని యూరేట్ తగ్గించే మందులు అని పిలుస్తారు.
గౌట్ కోసం అత్యంత సాధారణంగా ఉపయోగించే మందు అల్లోపురినోల్. అల్లోపురినోల్ తీసుకోలేని కొంతమందికి ఫెబుక్సోస్టాట్ చక్కగా పనిచేస్తుంది. అయితే వైద్యుని సలహాతోనే వీటిని వాడాలి. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మన పాత వీడియో చూడండి.
గౌట్ ఎటాక్ వచ్చిన వారికి యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎంత ఉండాలి ?
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగినంత తక్కువగా అంటే 6 మిల్లీ గ్రాములు కంటే తక్కువగా ఉండేటట్టు మందులు తీసుకోవడం అవసరం. దీని కోసం ఎంత డోసు వేయాలన్నది వైద్యులను అడిగి తెలుసుకోవాలి.
యూరేట్ తగ్గించే మందులు ఎవరు వాడాలి ?
అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ గైడ్‌లైన్ ప్రకారం ,ఈ మందులు ఈ క్రింది పరిస్థితులు ఉన్నవారు తీసుకోవాలి
ఫస్ట్ ఇండికేషన్
తరచుగా గౌట్ దాడులు ఉండడం. తరచుగా అంటే సంవత్సరానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ గౌట్ దాడులు రావడం.
సెకండ్ ఇండికేషన్
వైద్యపరంగా గుర్తించదగిన టోఫీ . టోఫీ చర్మం కింద వచ్చే తెల్లటి లేదా పసుపురంగు గడ్డలు. అవి చిన్న గింజల నుండి పెద్ద ముద్దల వరకు పరిమాణంలో ఉంటాయి.ఇవి సాధారణంగా చేతుల వేళ్లు, కాలి వేళ్లు, మోచేతులు మరియు చెవులు లో వస్తాయి.
థర్డ్ ఇండికేషన్
పెర్మనెంట్ గా జాయింట్ డామేజ్ అయ్యి ఉంటే క్రానిక్ ఆర్థరైటిస్ అంటారు . గౌట్‌ని త్వరగా ట్రీట్ చేయకపోతే అది క్రానిక్ గా మారుతుంది. జాయింట్స్‌లో యూరిక్ యాసిడ్ వాటిని పర్మినెంట్ గా డామేజ్ చేస్తాయి. వీళ్లు కూడా వాడాలి
ఫోర్త్ ఇండికేషన్
కిడ్నీ లో యూరిక్ ఆసిడ్ స్టోన్స్ ఉంటే . కిడ్నీలో రాళ్ల ఎందుకొస్తాయో తెలుసుకోవడానికి మన పాత వీడియో చూడండి
ఫిఫ్త్ ఇండికేషన్
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న వారు
దీని బట్టి మనకి తెలిసింది ఏమిటంటే యూరిక్ ఆసిడ్ ఎంత లెవెల్స్ లో ఉందో అన్న దాని పైన మెడిసిన్ వాడము. దాని వల్ల ఎంత ప్రాబ్లెమ్ అవుతుందో అన్న దాని పైన మాత్రమే మెడిసిన్ వాడిస్తాము.
మందులు వాడుతున్నపుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ?
సాధారణంగా ప్రారంభంలో తక్కువ మోతాదును వాడమని సూచిస్తారు. ప్రారంభ సమయంలో ప్రతి 2 నుండి 5 వారాలకు సీరం యూరేట్ స్థాయిని పర్యవేక్షించాలి . యూరిక్ ఆసిడ్ మందులు వాడిన తరువాత కూడా ఎక్కువగా ఉంటే మందుల డోస్ పెంచుకోవాలి.
యూరిక్ యాసిడ్ స్థాయిలు సాధారణ పరిధిలో వచ్చిన తరువాత మాత్రలను ప్రతిరోజూ కొనసాగించాలి. యూరిక్ యాసిడ్ స్థాయిలు తగినంత తక్కువగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ప్రతి ఒకటి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి రక్త పరీక్షలు చేయాలి.
గౌట్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. మీ యూరిక్ యాసిడ్ తగ్గించే మందు తీసుకోవడం ఎప్పటికీ ఆపవద్దు. వీటి వల్ల దుష్ప్రభావాలను కలిగి ఉంటే, మీరు మాత్రలు తీసుకోవడం మానేసి, సలహా కోసం వైద్యుడిని కలవాలి
వీటితో పాటు ఇవి కూడా చెయ్యాలి. వాటికోసం మన పాత వీడియో చూడండి.
- ఒకటి. ఆల్కహాల్ తగ్గించడం
- రెండు. ప్యూరీన్ రిచ్ ఫుడ్ తగ్గించడం.వాటికోసం మన పాత వీడియో చూడండి.
- మూడు. ఆకుకూరలూ, కూరగాయలూ ఎక్కువ తీసుకోడం
- నాలుగు. బరువు తగ్గడం
- ఐదు. స్మోకింగ్ అలవాటు పూర్తిగా మానేయడం
- ఆరు. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం
- ఏడు. సరిపడా నీరు తీసుకోవడం
మన డాక్టర్ మల్లేశ్వర రావు గారు ఏమంటున్నారంటే
మందుల విషయంలో మనలో చాలా నెగ్లిజెన్స్ ఉంటుంది . గౌట్ ఉన్నవారిలోసగం మంది మంది మాత్రమే డ్రగ్స్ తీసుకున్నారని కనుగొన్నారు. అంటే డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టిన వారిలో చాలామంది దానిని తీసుకోవడం మానేస్తారు . తీసుకొనే వారిలో 38% కంటే తక్కువ మంది మాత్రమే 6 మిల్లీ గ్రాములు కంటే తక్కువ యూరిక్ యాసిడ్ స్థాయిని సాధించారు. అంటే సరైన డోస్ తీసుకోవడం లేదని అర్ధం. ఇలాంటివి చెయ్యొద్దు.