CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

What is the reason for acidity and stomach ulcer in Telugu

What is the reason for acidity and stomach ulcer in Telugu

ప్రస్తుతం చాలా మందిని కడుపు అల్సర్ల సమస్య వేధిస్తోంది. కడుపులో ఏర్పడే అల్సర్‌లను గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. పెప్టిక్ అల్సర్ , అసిడిటీ అని కూడా అంటారు. చిన్న ప్రేగులలో వచ్చే పుండ్లను డ్యూడెనల్ అల్సర్ అంటారు. కడుపులో అల్సర్లు ఎందుకు వస్తాయో తెలుసా? గ్యాస్ట్రిక్ అల్సర్స్ వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. ఇక్కడ 10 ప్రధాన కారణాల గురించి డిస్కస్ చేసుకుందాము . దానికి ముందు గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే ఏమిటి, గ్యాస్ట్రిక్ అల్సర్స్ లక్షణాలు ఏమిటి డిస్కస్ చేసుకుందాము

గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే ఏమిటి ?

   గ్యాస్ట్రిక్ అల్సర్స్ కడుపు యొక్క లైనింగ్‌పై అభివృద్ధి చెందే పుళ్ళు. కడుపులో స్రవించే యాసిడ్‌ లోపలి లైనింగ్‌ను తినేయడం వల్ల కడుపు యొక్క లైనింగ్‌ దెబ్బతింటుంది. 

గ్యాస్ట్రిక్ అల్సర్స్ లక్షణాలు ఏమిటి ?

 గ్యాస్ట్రిక్ అల్సర్ కడుపు నొప్పి, గుండెల్లో మంట , అజీర్ణం మరియు కాస్తంత తినగానే కడుపునిండినట్లు అనిపించడం, కడుపు ఉబ్బరం, తేన్పులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఇది వికారం మరియు వాంతికి దారితీస్తుంది.

 

గ్యాస్ట్రిక్ అల్సర్స్ ప్రధాన కారణాలు  

 

1. గాడితప్పిన ఆహారపు అలవాట్లు

కూల్ డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం, టీ మరియు కాఫీల అధిక వినియోగం, మసాలా ఆహారం ఎక్కువగా తినడం, నూనెలో అధికంగా ఉండే ఆహారాలు తినడం, కారంగా ఉండేవి తినడం , జీర్ణం చేయడం కష్టంగా ఉండే ఆహారాలు తినడం మీ కడుపు అల్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి. వేయించిన ఆహారాలు, సిట్రస్ పండ్లు, టమోటా ఆధారిత ఉత్పత్తులు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి ఎసిడిటీ కలిగించే అత్యంత సాధారణ ఆహారాలలో కొన్ని. 

2. అడ్డుఅదుపూ లేని జీవనశైలి

సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఎసిడిటీ ప్రమాదం ఉంది. తిన్న వెంటనే నిద్రపోయే వారిలో ఎసిడిటీ మరింత తీవ్రమవుతుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన అల్సర్‌ల అభివృద్ధికి దోహదం చేస్తుంది. స్థూలకాయంతో బాధపడేవారిలో కూడా గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటుంది.

3. హెలికోబా్కెర్ పైలోరీ

గ్యాస్ట్రిక్ అల్సర్ కి ప్రధాన కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మక్రిమి. ఇది కడుపులోని రక్షిత పొరను బలహీనపరుస్తుంది,అంటే కడుపులోని యాసిడ్ లైనింగ్‌ను దెబ్బతీస్తుంది. 60 నుండి 70% గ్యాస్ట్రిక్ అల్సర్ కేసులకు హెలికోబాక్టర్ పైలోరీ కారణం.

4. పెయిన్ కిల్లర్స్

ఆస్పిరిన్ లేదా ఇబుప్రోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఉపయోగించడం తదుపరి అత్యంత సాధారణ కారణం.పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల పొట్టలోని మ్యూకోజ్‌ పొరకు చిరుగులు ఏర్పడి అల్సర్లకు దారితీస్తుంది. ఇవి 15 నుండి 25% కేసులకు కారణం.

5. ధూమపానం

 పొట్టలో పుండ్లు ఏర్పడటానికి ధూమపానం ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. ఇది పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది 10 నుండి 15% గ్యాస్ట్రిక్ అల్సర్లు ధూమపానం వల్ల సంభవిస్తాయి.

6. అధిక ఆల్కహాల్ వినియోగం

అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. 5 నుండి 10% గ్యాస్ట్రిక్ అల్సర్‌లు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలుగుతాయి

7. జోలింగర్ ఎల్లిసన్ సిండ్రోమ్

 ఈ అరుదైన పరిస్థితి ప్యాంక్రియాస్ లేదా డ్యూడెనమ్‌లో కణితుల వాళ్ళ కలుగుతుంది . ఇది కడుపు లో యాసిడ్ అధిక ఉత్పత్తికి దారితీస్తుంది , గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

8. వయస్సు

 గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రమాదం వయస్సుతో పెరుగుతుంది. బహుశా బలహీనమైన శ్లేష్మ పొర మరియు కాలక్రమేణా మందుల వాడకం వంటి కారకాల కలయిక వల్ల కావచ్చు.

9. జన్యుపరమైన కారకాలు:

కుటుంబంలో ఎవెరికైనా గ్యాస్ట్రిక్ అల్సర్‌ సమస్య ఉన్న ఉంటే ఆ కుటుంభంలో వేరే వారు కూడావంశపారంపర్యంగా వాటిని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది .

10. వైద్య పరిస్థితులు 

తీవ్రమైన అనారోగ్యాలు గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కొన్ని సందర్భాల్లో, పొత్తికడుపును లక్ష్యంగా చేసుకున్న రేడియేషన్ థెరపీ కడుపు లైనింగ్‌లో మంట మరియు పూతలకి దారితీస్తుంది.

 

ఎవరైనా లక్షణాలను ఎదుర్కొంటుంటే సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం డాక్టర్ని కలవడం చాలా ముఖ్యం. ఎండోస్కోపీ ద్వారా వ్యాధి తీవ్రత తెలుసుకోవచ్చు.  

మందులను తరచుగా వాడటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. యాంటాసిడ్స్ వంటి ఓవర్-ది-కౌంటర్ మందులు లక్షణాల నుండి స్వల్పకాలిక ఉపశమనాన్ని అందిస్తాయి. తీవ్రమైన నొప్పి ఉన్నవారికి, కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడానికి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, హెచ్ టు బ్లాకర్స్ వంటి ప్రిస్క్రిప్షన్ మందులు వాడవచ్చు.    

ఐతే మళ్లీ మళ్లీ ఇవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ధూమపానం, ఆల్కహాల్ స్పైసీ పదార్ధాలకు, సిట్రస్ పండ్లు మరియు కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి . పండ్లు మరియు కూరగాయలకు ప్రాధాన్యతనిస్తూ, తక్కువ యాసిడ్ ఆహారాన్ని ఎంచుకోండి. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now