What Causes Hypothyroidism in Telugu – Low Thyroid Key Reasons
థైరాయిడ్ అనేది మెడలో ఉండే చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. జీవక్రియ యొక్క పనితీరును నియంత్రించే T3 , T4 హార్మోన్ను ఉత్పత్తి చేయడం దీని పని. హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి T3 , T4 హార్మోన్లను తగినంతగా ఉత్పత్తి చేయని పరిస్థితి. దీనిని అండర్ యాక్టివ్ థైరాయిడ్ అని కూడా అంటారు.ఈ వ్యాధి వచ్చే ప్రమాదం పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ , మగవారు , పిల్లలు లేదా యువకులు ఎవరైనా హైపోథైరాయిడిజం సమస్యను కలిగి ఉండవచ్చు.
హైపోథైరాయిడిజం కారణాలు ఏమిటి?
హషిమోటోస్ థైరాయిడ్
హషిమోటోస్ థైరాయిడ్, ఒక రకమైన థైరాయిడ్ వ్యాధి. ఈ వ్యాధి హైపోథైరాయిడిజం యొక్క ప్రధాన కారణం. 70 నుండి 80% హైపోథైరాయిడిజం కేసెస్ కు ఇదే కారణం.
వైద్య పరిభాషలో దీనిని ‘క్రానిక్ లింఫోసైటిక్ థైరాయిడిటిస్’ అంటారు.
హషిమోటో వ్యాధిలో, మీ రోగనిరోధక వ్యవస్థ మీ థైరాయిడ్‌ను దెబ్బతీస్తుంది. సాధారణంగా రోగ నిరోధక వ్యవస్థ మనల్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. ఈ వ్యవస్థ శరీరంలోకి ప్రవేశించే ఏదైనా విదేశీ పదార్ధాలకి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఉదాహరణకి బాక్టీరియా, వైరస్ లాంటి వాటికి.
కానీ కొన్నిసార్లు అది పొరపాటుగా శరీరం యొక్క స్వంత కణాలపై కూడా దాడి చేస్తుంది. ఈ పరిస్థితిని ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. హషిమోటో వ్యాధిలో ఇదే జరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున థైరోయిడ్ కణాలపై దాడి చేస్తుంది. ఆ విధంగా థైరోయిడ్ కణాలు మెల్లగా చనిపోతాయి. కాబట్టి థైరాయిడ్ గ్రంథి టి త్రి , టి ఫోర్ హార్మోన్లను తగినంతగా ఉత్పత్తి చేయలేదు
హషిమోటో వ్యాధి వంశపారం పర్యంగా రావొచ్చు . మీ కుటుంబంలో ఎవరికైనా హషిమోటోస్ థైరాయిడ్ వ్యాధి ఉంటే, మీరు కూడా ఈ రకమైన వ్యాధికి గురి కావొచ్చు.
అయోడిన్ లోపం
రెండో అతి ముఖ్యమైన కారణం అయోడిన్ లోపం. అయోడిన్ లోపం 5 నుండి 10% హైపోథైరాయిడిజం కేసెస్ కు కారణం అని నివేదికలు చెబుతున్నాయి
థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అయోడిన్ చాలా ముఖ్యం. ఒకవేళ అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయదు. అంతే కాకుండా అయోడిన్ లోపం వల్ల గాయిటర్ లేదా థైరాయిడ్ గ్రంథి ఉబ్బడం సమస్య ఏర్పడుతుంది. పెద్దలకు ప్రతిరోజూ 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరం. గర్భధారణ సమయంలో, పాలు ఇచ్చే స్త్రీలకు మరింత ఎక్కువ అయోడిన్ అవసరం . అందుకే 1962లో కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ఉప్పు తయారీదారులకు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. ఉప్పులో తప్పకుండా అయోడిన్‌ను ఉండాలని పేర్కొంది. కొంతమంది పేదవారు ఇళ్లలో అయోడైజ్డ్ ఉప్పు వాడారు .అందుకే థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా విడుదల కావు
అయోడైజ్డ్ ఉప్పు కారణంగా, అయోడిన్ లోపం యొక్క కేసులు మునుపటి కంటే ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు దాని లోపానికి గురవుతారు.
హైపోథైరాయిడిజం యొక్క ఇతర ప్రధాన కారణాలు ఏమిటో చూద్దాము.
శస్త్రచికిత్స
థైరాయిడ్ గ్రంధిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం లేదా థైరాయిడ్ క్యాన్సర్‌కు రేడియేషన్ థెరపీ చేయడం వల్ల కూడా హైపోథైరాయిడిజం రావచ్చు
మందులు
లిథియం మరియు అమియోడారోన్ వంటి కొన్ని మందులు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి మరియు హైపోథైరాయిడిజానికి దారితీస్తాయి.
పిట్యూటరీ గ్రంధి పనిచేయకపోవడం
థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించే పిట్యూటరీ గ్రంధికి (pituitary gland) సంబంధించిన సమస్యలు హైపోథైరాయిడిజానికి కారణం కావచ్చు.
పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం
కొంతమంది వ్యక్తులు స్వతహాగా థైరాయిడ్ గ్రంధి లోపం తో పుడతారు .
థైరాయిడిటిస్
వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఇతర కారణాల వల్ల థైరాయిడ్ పనితీరును తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయి
గర్భం
కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో లేదా తర్వాత హైపోథైరాయిడిజంను అభివృద్ధి చేయవచ్చు. ఈ పరిస్థితిని పోస్ట్ పార్తామ్ థైరాయిడిటిస్ (post-partum thyroiditis) అంటారు.