మానవ శరీరంలో రెండు కిడ్నీలు ఉన్నాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేసి శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. కానీ ప్రస్తుతం కాలంలో కిడ్నీలో రాళ్ల (kidney stones) సమస్య చాలా ఎక్కువైంది.
1. కాల్షియం రాళ్ళు
ఇవి అత్యంత కామన్ గా ఉండే కిడ్నీ స్టోన్స్ . ఇవి ప్రధానంగా కాల్షియం ఆక్సలేట్ లేదా కాల్షియం ఫాస్ఫేట్‌తో కూడి ఉంటాయి. మూత్రంలో కాల్షియం మరియు ఆక్సలేట్ అధికంగా ఉండటం వల్ల ఈ కాల్షియం రాళ్లు ఏర్పడతాయి.
కాల్షియమ్ ఆక్సలేట్
61% కిడ్నీ స్టోన్స్ ఈ రకానికి చెందినవే.
కాల్షియమ్ ఫాస్ఫేట్
15% కిడ్నీ స్టోన్స్ ఈ రకానికి చెందినవి
2. స్ట్రువైట్ స్టోన్స్
ఇన్ఫెక్షన్ స్టోన్స్ అని కూడా వీటిని పిలుస్తారు. ఇవి మెగ్నీషియం, అమ్మోనియం మరియు ఫాస్ఫేట్‌లతో కూడి ఉంటాయి. ఇవి సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లకు (UTIs) ప్రతిస్పందనగా ఏర్పడతాయి. 5%-15% కిడ్నీ స్టోన్స్ ఈ రకానికి చెందినవి.
3. యూరిక్ యాసిడ్ రాళ్లు
ఈ రాళ్లు యూరిక్ యాసిడ్‌తో తయారవుతాయి. మూత్రం చాలా ఆమ్లంగా ఉన్నప్పుడు ఇవి ఏర్పడతాయి. అధిక ప్యూరిన్ ఆహారం లేదా గౌట్ వంటి పరిస్థితులు ఉన్న వ్యక్తులకు యూరిక్ యాసిడ్ స్టోన్ ఏర్పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. 10%-15% కిడ్నీ స్టోన్స్ ఈ రకానికి చెందినవి.
4. సిస్టీన్ స్టోన్స్
సిస్టీన్ స్టోన్స్ చాలా అరుదు. అందుకే వీటి గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు.
5. మిశ్రమ రాళ్లు
కొన్నిసార్లు, మూత్రపిండాల్లో రాళ్లు వివిధ ఖనిజాల కలయికగా ఉండవచ్చు. ఉదాహరణకు, యూరిక్ యాసిడ్‌తో కలిపిన కాల్షియం ఆక్సలేట్.
రాయి రకాన్ని బట్టి, ఆక్సలేట్‌లు, ప్యూరిన్‌లు లేదా ఫాస్ఫేట్‌ల వంటి రాయిని ఏర్పరిచే పదార్థాల వినియోగాన్ని తగ్గించే ఆహార ప్రణాళికను రూపొందించవలసి ఉంటుంది. అందుకే ఏ రకమైన స్టోన్ మీకుందో మీరు తెలుసుకోవాలి. రాయి ఏ రకమైనప్పటికీ , మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్న వారు రోజుకి కనీసం 10 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు పుష్కలంగా తాగాలి.
Type of Kidney Stone | Incidence Percentage |
---|---|
కాల్షియం ఆక్సలేట్ | 61% |
కాల్షియం ఫాస్ఫేట్ | 15% |
యూరిక్ యాసిడ్ | 10-15% |
స్ట్రువైట్ (ఇన్ఫెక్షన్-సంబంధిత) | 5-15% |
సిస్టీన్ | 1-2% |