CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

Migraine triggers or causes in Telugu

What are the triggers for migraine headaches in Telugu

మైగ్రేన్‌ (migraine) సమస్య తలెత్తినప్పుడు తలలోని ఒక భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది.  మైగ్రేన్  ఒక  నాడీ సంబంధ వ్యాధి.   ఈ మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే కొన్ని అంశాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం.

1. శారీరకంగా గానీ ,మానసికంగా గానీ కలిగే ఒత్తిడి.

మైగ్రేన్‌తో బాధపడుతున్న 5 మందిలో 4 మంది ఒత్తిడిని ట్రిగ్గర్‌గా పేర్కొన్నారు. ఎక్కువగా ఏడవటం ,వేదన చెందడం కూడా మైగ్రేన్ అటాక్స్ కి దారితీసే అవకాశం ఉంది.

Migraine triggers - Stress | Telugu | Mental and physical stress cause headache
Stress

2. నిద్ర షెడ్యూల్‌లో మార్పులు లేదా సక్రమంగా నిద్ర లేకపోవడం

మైగ్రేన్ తలనొప్పికి నిద్రలేమి ఒక సాధారణ కారణం. అతినిద్ర కూడా మైగ్రేన్ అటాక్స్ కి దారితీసే అవకాశం ఉంది. మైగ్రేన్ అటాక్స్ లో దాదాపు సగం ఉదయం  4 గంటల నుండి    9 గంటల  మధ్య సంభవిస్తాయి.

Migraine triggers - Lack of sleep | Telugu | Sleep changes
Lack of sleep

 

3.హార్మోన్లలో మార్పులు

పురుషుల కంటే స్త్రీలకు మైగ్రేన్ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ. 75 శాతం మంది స్త్రీలు తమ రుతుక్రమం సమయంలో  హార్మోన్లలో మార్పులు వల్ల  మైగ్రేన్ అటాక్స్ను అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు.

migraine triggers - hormonal changes | Telugu | menstrual migraine | menstrual period
menstrual migraine

 

4. మద్యం సేవించడం

చాలా మంది వ్యక్తులు, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత  మైగ్రేన్ మైగ్రేన్ తలనొప్పి ఎక్కువగా వస్తుంది అని చెబుతున్నారు.

migraine triggers - alcohol | Telugu
Alcohol

 5. వాతావరణంలో మార్పులు

తుఫానులు, అధిక వేడి   మైగ్రేన్  అటాక్స్ కి (migraine attacks) దారితీసే సాధారణ వాతావరణ సంబంధిత ట్రిగ్గర్లు. అధిక తేమ  కూడా మైగ్రైన్ కి  దారితీస్తుంది. విపరీతమైన వేడి, విపరీతమైన చలి,  దుమ్ము, ధూళి, గాలి వానలు, బలమైన గాలులు, పొగ, అధిక ఎత్తు మైగ్రైన్ కి కారణాలు

migraine triggers - weather changes | Telugu | Changes in the weather and headache
weather changes

6. కొన్ని రకాల   ఆహార పదార్థాలు

మైగ్రేన్ అటాక్స్    ప్రేరేపించే ఆహారాల  జాబితా చాలానే   ఉంది. ఇందులో కామన్ గా   చాక్లెట్, చీజ్ మరియు ఇతర పాల ఉత్పత్తులు, కృత్రిమ స్వీటెనర్లు మరియు  గాఢమైన వాసనతో ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయి.

migraine triggers - Few food items | Telugu | chocolate, cheese and other dairy products, and pizza
Few food items

 7. డీహైడ్రేషన్

మైగ్రేన్ ఉన్నవారిలో  10 మందిలో 3  మంది డీహైడ్రేషన్ ఒక ట్రిగ్గర్ అని చెప్పారు.

migraine triggers - dehydration | Telugu
Dehydration

  8. ప్రకాశవంతమైన  లైట్లు

ప్రకాశవంతమైన లైట్లు మరియు పెద్ద శబ్దాలు మైగ్రేన్ దాడులకు ట్రిగ్గర్స్. ప్రకాశవంతమైన కాంతి, ఫ్లోరోసెంట్ లేదా మినుకుమినుకుమనే బల్బులు, ఎలక్ట్రానిక్ స్క్రీన్లు మైగ్రేన్ అటాక్స్కి దారి తీయవచ్చు.

migraine triggers - flashing lights | Telugu | Natural, bright light, and fluorescent or flickering bulbs can cause headache
Bright light

9. ఘాడమైన  వాసన

కొన్ని వాసనలు నాసికా భాగాలలో కొన్ని నరాలను  స్టిములేట్  చేసి,  మైగ్రేన్ దాడిని ప్రేరేపించవచ్చు. ఎక్కువ పెర్ఫ్యూమ్ ఉపయోగించడం కూడా ఒక కారణం.

migraine triggers - smell | Telugu | Osmophobia
Some odors

10. మందుల అధిక వినియోగం

మీ వైద్యుడు సూచించిన మందులు    మైగ్రేన్ దాడులకు కారణమూ కావొచ్చు.

 

మరి ఈ మైగ్రైన్ కి సంబందించిన కొన్ని చిట్కాలు .

  1. జంక్ ఫుడ్స్,  మసాలా ఫుడ్స్   దూరంగా పెట్టాలి .
  2. ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం తీసుకోవాలి.
  3. అధిక వెలుతురుకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
  4. రోజుకు కనీసం 7 గంటలు సక్రమంగా   నిద్రపోవాలి.
  5. రెగ్యులర్ వ్యాయామంతో పాటు యోగా చేయాలి.
  6. ఒత్తిడిని తగ్గించుకోవాలి.
  7. ఆహారాన్ని మానుకోవద్దు.

MIGRAINE PREVENTION TIPS IN TELUGU

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now