మానవ శరీరంలో రెండు కిడ్నీలు ఉన్నాయి ఎందుకంటే వాటి పని కూడా పెద్దది. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేసి శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. మన శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచడానికి, కిడ్నీ ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్సల్లో ఉన్నారు. షుగర్ మరియు బీపీ ఉన్న వారు కిడ్నీ ఫెయిల్యూర్స్ కి తొందరగా గురి అవుతారు.
మనకు చాలాసార్లు కిడ్నీ సమస్యల లక్షణాలు కనిపిస్తున్నా, అవగాహన లేకపోవడం వల్ల గుర్తించలేకపోతున్నాం. చాలా మంది ఈ లక్షణాలను వేరే సమస్యగా భావించి, తప్పుడు చికిత్స తీసుకుంటున్నారు. కానీ సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైనా కిడ్నీ సంబంధిత సమస్యలు ప్రారంభమైనట్లయితే, అలాంటి వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి?
మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన కొన్ని లక్షణాలు
- అలసట: అన్ని వేళలా బలహీనంగా మరియు అలసటగా అనిపించడం మూత్రపిండాల సమస్యల యొక్క ప్రారంభ సంకేతాలు. మూత్రపిండ వ్యాధి అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఒక వ్యక్తి మునుపటి కంటే బలహీనంగా కనిపిస్తాడు.
- నిస్సత్తువకు లోనవడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు: కొంచెం నడవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది.
- ముఖం చేతులు, కాళ్లు, పాదాలు లేదా మడమల్లో నీరు పేరుకుపోయి ఉబ్బినట్లు అనిపించడం
మూత్రపిండాలు శరీరం నుండి వ్యర్థాలు మరియు అదనపు సోడియంను శరీరం నుండి పంపించడానికి సహాయపడతాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయడం మానేస్తే, శరీరంలో సోడియం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది పాదాలు మరియు చీలమండలలో వాపుకు దారితీస్తుంది. ఈ పరిస్థితిని ఎడెమా అంటారు. ఇది కళ్ళ చుట్టూ కూడా వాపు కి కారణం అవుతుంది.
- వికారం, వాంతి వచ్చినట్లుగా ఉండటం
- ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం : కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ఆకలి తగ్గడం ప్రారంభమవుతుంది. దీని వల్ల, రోగి వేగంగా బరువు తగ్గడం ప్రారంభిస్తాడు. రోగికి ఎల్లప్పుడూ కడుపు నిండినట్లు అనిపిస్తుంది.
- కండరాల తిమ్మిరి రావడం
- శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు ఉండటం
- చర్మంపై దద్దుర్లు, దురద రావడం
- యూరిన్‌లో రక్తం రావడం
- మూత్రం నురగగా రావడం
- తరచుగా మూత్రానికి వెళ్లడం : కిడ్నీ ఫెయిల్యూర్ మొదలైతే, ముందుగా దాని ప్రభావం మూత్రం మీద పడుతుంది. సాధారణంగా మనిషి రోజుకు 8-10 సార్లు మూత్ర విసర్జన చేయడం సహజం, అయితే అంతకంటే ఎక్కువ మూత్రం రావడం కిడ్నీ ఫెయిల్యూర్‌కు ఒక సంకేతం. కొన్నిసార్లు మూత్రంలో మంట మరియు రక్తం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
- యూరిన్ ముదురు రంగులో రావడం
- మూత్రవిసర్జన చేయడంలో ఇబ్బంది రావడం
- మూత్రం పోయాల్సిన అవసరం లేకున్నా ఒత్తిడిగా అనిపించడం
- అంగస్తంభన సమస్యలు
- నిద్ర సమస్యలు
కిడ్నీలో ఉండే మిలియన్ల కొద్దీ ఫిల్టర్‌లు రక్తంలోని టాక్సిన్స్‌ని తొలగించడానికి పని చేస్తాయి. మన మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవడం మరియు కిడ్నీ సమస్యలు ఉంటే, వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. తొలిదశలో చర్యలు తీసుకుంటే కిడ్నీ దెబ్బతినకుండా ఆపవచ్చు . అధిక రక్తపోటు, షుగర్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతున్న రోగులు తొందరగా మూత్రపిండాల వైఫల్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి వారు తమ ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటే, ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించి చికిత్స ప్రారంభించడంలో సహాయపడతాయి.