కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, వైద్యులు సాధారణంగా స్టాటిన్స్ (statins) అనే మందులను ఇస్తారు. ఈ ఔషధం కొలెస్ట్రాల్ స్థాయిని తక్కువగా ఉంచడమే కాకుండా, గుండెపోటు లేదా స్ట్రోక్ అవకాశాలను తగ్గిస్తుంది. కొందరికి స్టాటిన్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందికి ఈ దుష్ప్రభావాలు కలగవచ్చు.
తలనొప్పి, వికారం వంటి జీర్ణ స సమస్యలు తీసుకొస్తాయని అంటున్నారు. స్టాటిన్స్ తీసుకునే వ్యక్తులలో అలసట, బలహీనత ఏర్పడుతుంది. స్టాటిన్స్ తీసుకునే కొంతమందిలో జ్ఞాపకశక్తి కోల్పోవడం కూడా గమనించబడింది.
జీర్ణ సమస్యలు
కొందరిలో స్టాటిన్ వల్ల డయేరియా, వికారం , మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా కలగవచ్చు .
కండరాల నొప్పి లేదా బలహీనత
5 నుంచి 10 శాతం కేసులలో శరీరం నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులకి కారణం అవుతుంది. ఆల్కహాల్ తీసుకునేవారిలో ఇది ఇంకా ఎక్కువగా వస్తుంది. చాలా అరుదుగా, అధిక-మోతాదు స్టాటిన్ వాడకం కండరాల కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీనిని ర్యాబ్డో మాయోలైసిస్ అంటారు ఇందులో తీవ్రమైన కండరాల నొప్పి ఉంటుంది. ఇందులో కిడ్నీ దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. స్టాటిన్ మందులు తీసుకునే వ్యక్తులు కండరాల నొప్పి అనుభవిస్తారు . అయితే, క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా కండరాల నొప్పిని తగ్గించవచ్చు.
మధుమేహం ప్రమాదం
మీరు స్టాటిన్ తీసుకున్నప్పుడు మీ బ్లడ్ షుగర్ స్థాయి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
కాలేయం దెబ్బతింటుంది
అరుదుగా స్టాటిన్స్ అధికంగా ఉపయోగించడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
స్టాటిన్స్ యొక్క అత్యంత సాధారణ దుష్ప్రభావాలు 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి వివిధ రకాల ఔషధాలను ఉపయోగించే వారిలో కూడా కనిపిస్తాయి . ఏదైనా కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారిలో కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకొనే వారికీ, హైపోథైరాయిడిజం తో బాధ పడే వారికీ కూడా ఇవి ఎక్కువగా కలగవచ్చు
Statin Side Effects |
---|
కండరాల నొప్పి లేదా బలహీనత |
కాలేయం దెబ్బతినడం |
జీర్ణ సమస్యలు (ఉదా., వికారం, విరేచనాలు) |
రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల |
జ్ఞాపకశక్తి కోల్పోవడం లేదా గందరగోళం |
తలనొప్పి |
చర్మం దద్దుర్లు లేదా ఫ్లషింగ్ |
నిద్ర భంగం |
నరాలవ్యాధి |
మధుమేహం ప్రమాదం |
ఈ మందులు వాడడం, లేదా ఆపేయడం వంటి విషయంలో ముందుగా కార్డియాలజిస్టులను (cardiologist) కలిసి వారి నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ మల్లేశ్వర రావు గారు సలహా ఇస్తున్నారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న రోగులలో, లేదా కాలేయ వ్యాధి ఉన్నట్లయితే స్టాటిన్స్ ఉపయోగించకూడదు.