ఊపిరితిత్తుల ధమనులను పల్మనరీ ఆర్టరీ (pulmonary artery) అంటారు. ఇది గుండె యొక్క కుడి వైపు నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళుతుంది.
రక్తం గడ్డ కాలులో విడిపోయి ఊపిరితిత్తులకు ప్రయాణించి, ఊపిరితిత్తులలోని ఒక భాగానికి రక్త ప్రవాహాన్ని ఆపడాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు.
సిరలు
రక్త ప్రసరణ వ్యవస్థలో సిరలు ఒక భాగం. ఇవి గుండె వైపు చెడు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్త నాళాలు. సిరలు, కణజాలాల నుండి తిరిగి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళతాయి. ఈ సిరలు, మన కాళ్లల్లో కూడా ఉంటాయి. వాటిలో ఒక రకమైన సిరలను, డీప్ వీన్స్ అంటారు.
డీప్ వీన్ థ్రాంబోసిస్ లేదా డివిటి (DVT)
ఈ సిరల్లో రక్తం గడ్డలు లేదా క్లాట్స్ ఏర్పడడాన్నే, డీప్ వీన్ థ్రాంబోసిస్ (Deep vein thrombosis) అని లేదా డివిటి అని పిలుస్తారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ లో కాలు అంతా వాచిపోయి కనిపిస్తుంది. రక్తం గడ్డల్లో కొంత భాగం విరిగిపోయి రక్తప్రవాహంలోకి ప్రవేశించవచ్చు. ఇవి మీ రక్తప్రవాహం అంతటా ప్రయాణించవచ్చు. ఐతే, ముఖ్యంగా ఇవి ఊపిరితిత్తుల రక్తనాళ్ళలోకి వెళ్తాయి. దీన్ని పల్మనరీ ఎంబోలిజం పేరుతో సంబోధిస్తారు.
డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) ప్రమాద కారకాలు:
వయస్సు: DVT ప్రమాదం వయస్సుతో పెరుగుతుంది, ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత.
జన్యు పరంగా కుటుంబ చరిత్ర: DVT యొక్క కుటుంబ చరిత్ర ఉంటే DVT ప్రమాదం ఎక్కువగా ఉంటుంది .
ఊబకాయం: అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులు DVT అభివృద్ధి చెందే ప్రమాదం కలిగి ఉంటారు .
ఎక్కువసేపు కూర్చోవడం: సుదీర్ఘ విమానాలు లేదా కార్ రైడ్‌ల సమయంలో ఎక్కువసేపు కూర్చోవడం DVT ప్రమాదాన్ని పెంచుతుంది.
శస్త్రచికిత్స: కొన్ని శస్త్రచికిత్సలు, ముఖ్యంగా నీ జాయింట్ మరియు హిప్ జాయింట్ కి సంబంధించినవి, DVT ప్రమాదాన్ని పెంచుతాయి.
క్యాన్సర్: క్యాన్సర్ ఉన్నవారికి రక్తంలో క్యాన్సర్ కణాలు ఉండటం వల్ల DVT అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
హార్మోన్ల చికిత్స: HRT మరియు గర్భనిరోధక మాత్రలు వంటి హార్మోన్ల చికిత్సలు DVT ప్రమాదాన్ని పెంచుతాయి.
గర్భం మరియు ప్రసవం: గర్భిణీ స్త్రీలు మరియు కొత్త తల్లులు హార్మోన్ల మార్పులు మరియు రక్త పరిమాణం పెరగడం వల్ల DVT ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
రక్తం గడ్డకట్టే రుగ్మతలు: ఫ్యాక్టర్ V లీడెన్ వంటి జన్యుపరమైన రక్తం గడ్డకట్టే రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు DVT ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు.
ధూమపానం: ధూమపానం DVTకి ప్రమాద కారకం, ఎందుకంటే ఇది రక్తం గడ్డకట్టడాన్ని పెంచుతుంది మరియు రక్త నాళాలను దెబ్బతీస్తుంది.
పల్మనరీ ఎంబోలిజం (Pulmonary embolism)
పల్మనరీ ఎంబోలిజం అనేది ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం. ఈ గడ్డలు కాళ్ళ సిరల్లో నుండి ఊడిపోయి, కాళ్ళ సిరలు ద్వారా , శరీరంలోని రక్తప్రవాహంలో ప్రయాణించి, ఊపిరితిత్తుల రక్తనాళాలలో ఈ విధంగా చేరుతాయి.
ఈ గడ్డను ఎంబోలస్ అంటారు. పల్మనరీ ఎంబోలిజం ఊపిరితిత్తులకు రక్త ప్రవాహాన్ని ఆపేస్తుంది.రక్త సరఫరా లేకపోవడం వల్ల ఊపిరితిత్తుల కణజాలం మరణిస్తుంది. దీనివల్ల రక్తంతో కూడిన దగ్గు రావచ్చు. పల్మనరీ ఎంబోలిజం వల్ల ఊపిరితిత్తులలో ఆక్సీజనేషన్ సరిగ్గా జరగదు. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ అమాంతంగా పడిపోతాయి. ఊపిరి ఆడదు. ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.
పల్మనరీ ఎంబోలిజం చాలా ప్రాణాంతకమైనది. తక్షణ వైద్య సంరక్షణ తీసుకోకపోతే చాలా సీరియస్ అవుతుంది
బ్లడ్ థిన్నర్స్ (Blood thinners) సరైన సమయంలో వాడడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
లక్షణాలు
పల్మనరీ ఎంబోలిజం యొక్క లక్షణాలు:
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: రక్తంలో ఆక్సిజన్ తగ్గడం వల్ల ఇది సంభవించవచ్చు
- ఛాతీ నొప్పి
- తలతిరగడం, మూర్ఛ: మెదడుకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఇది సంభవించవచ్చు.
- దగ్గు, దగ్గులో రక్తం
- వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన: ఇది గుండెకు రక్త ప్రసరణలో తగ్గుదలకు సంకేతం.
- చెమటలు పట్టడం
- కాలు వాపు
- అలసట లేదా బలహీనత: ఇది రక్తంలో ఆక్సిజన్ తగ్గడం వల్ల కావచ్చు
చికిత్స
త్రాంబోలిటిక్స్: ఈ మందులు ఎంబోలిజంను తొలగించడంలో సహాయపడతాయి.