పచ్చ కామెర్లు (jaundice) కాలేయ (liver) సంబంధిత సమస్య. ఇది రక్తంలో బిలిరుబిన్ (bilirubin) పేరుకుపోయినప్పుడు సంభవించే ఒక వైద్య పరిస్థితి. బిలిరుబిన్ అనేది ఎర్ర రక్త కణాలు (red blood cells) విచ్ఛిన్నమైనప్పుడు ఉత్పత్తి అయ్యే పసుపు వర్ణద్రవ్యం. సాధారణంగా, కాలేయం బిలిరుబిన్‌ను ప్రాసెస్ చేస్తుంది మరియు పిత్త వాహికల ద్వారా (bile ducts) చిన్న ప్రేగులలో (small intestine) తొలగిస్తుంది. అయితే, హెపటైటిస్ (hepatitis) లేదా లివర్ సిర్రోసిస్ (cirrhosis) వంటి కాలేయ సమస్య ఉన్నట్లయితే లేదా పిత్త వాహికలలో అడ్డంకులు ఏర్పడినట్లయితే, బిలిరుబిన్ రక్తంలో పేరుకుపోతుంది .
కళ్లు పచ్చగా కనిపించడం, మూత్రం పచ్చగా రావడం అనేది పచ్చ కామెర్ల లక్షణం. లివర్ ఫంక్షన్ టెస్ట్ (liver function test or LFT) అనే ఒక రక్త పరీక్ష చేయిస్తే మనం ఈ సమస్యను గుర్తించగలం.
పచ్చ కామెర్లకు ముందు కారణం ఏంటో తెలిస్తే దానికి తగ్గట్టు చికిత్స ఉంటుంది.
పచ్చ కామెర్లు ముఖ్యంగా మూడు రకాలుగా రావచ్చు.
- రక్త కణాలు సరిగ్గా లేక, లేదంటే మలేరియా వంటి ఇన్ఫెక్షన్ల వల్ల, రక్త కణాలు అధికంగా విచ్ఛిన్నం అవ్వడం వల్ల
- హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల, లేక మద్యం అధికంగా తాగడం వల్ల (hepatotoxic jaundice)
- పిత్తాశయంలో రాళ్ల వల్ల లేదా ఏదైనా క్యాన్సర్ వల్ల (obstructive jaundice)
పచ్చ కామెర్లకు సూప్‌లు మరియు స్టెమ్డ్ వెజిటేబుల్స్ వంటి తేలికైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను తినండి. కొవ్వు, మాంసాహారం మరియు వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి. పుష్కలంగా ద్రవాలు త్రాగాలి.