సాధారణంగా ఏ వ్యక్తికైనా కాలేయంలో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. కానీ కాలేయ కణాలలో కొవ్వు ఎక్కువగా
పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, క్రమంగా కాలేయం ఉబ్బిపోతుంది. దీని వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అతిగా మద్యం సేవించడం మరియు అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అతి ముఖ్యమైన రెండు కారణాలు.
ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా?
మీరు ఫ్యాటీ లివర్ నివారించాలనుకుంటే, ఔషధాలే కాకుండా, కొవ్వు కాలేయాన్ని నిరోధించే కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి మరియు ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి, ఈ ఇంటి నివారణలను మీరు అనుసరించవచ్చు.
- ప్రతిరోజూ వ్యాయామం చేయండి.
- బరువు తగ్గండి
- మీ మధుమేహాన్ని నియంత్రించుకోండి
- మద్యం, ధూమపానం పూర్తిగా మానేయండి.
- రాత్రి 9 గంటలలోపు ఆహారం తీసుకోండి, ఆలస్యంగా భోజనం చేయకండి.
- ఏదైనా ఆహారాన్ని బాగా నమిలి తినండి.
- వెల్లుల్లిని తినండి.
- కొబ్బరి నీరు, మజ్జిగ పుష్కలంగా త్రాగాలి.
- పండ్లను తీసుకోండి
- శరీర కొవ్వును పెంచే ఆహారాలను తక్కువగా తినండి.
- చక్కెర జోడించిన తీపి పదార్దాలు నివారించండి
- బ్రోకలీ, చేపలు, అవకాడో వంటివి ఎక్కువగా తీసుకోవాలి.