సరైన ఆహారం తీసుకోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అస్తవ్యస్తమైన జీవనశైలి వంటి కారణాల వల్ల ఫ్యాటీ లివర్ 5-20 శాతం భారతీయులను ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలను చూద్దాం.
- ఫ్యాటీ లివర్ తో బాధపడే వాళ్ళలో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. కానీ వ్యాధి ముదరుతుంటే మన శరీరం చాలా సంకేతాలను ఇస్తుంది. వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమయంలో గుర్తించడం, చికిత్స చేయడం మరియు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు.
- కాలేయం మీద పొట్టలో కుడివైపు పైభాగంలో నొప్పి
- ఆకలి లేకపోవడం, ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బంది
- వికారం
- అలసట మరియు బలహీనత
- కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం అంటే జాండిస్ లేదా పచ్చకామెర్లు వచ్చినట్టు (వ్యాధి మరింత ముదిరినప్పుడు ఇది కనిపిస్తుంది).
- బొడ్డు వాపు రావడం జరుగుతుంది.(ఇది కూడా వ్యాధి మురినప్పుడే కనిపిస్తుంది)
- చివరగా పొట్ట ఉబ్బుతుంది. కాళ్లల్లో కూడా నీరు పట్టవచ్చు.
- కొంతమంది బరువు కూడా వేగంగా పడిపోతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అసలు నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఈ లక్షణాలలో ఏవైనా ఎక్కువ కాలం పాటు శరీరంలో కొనసాగితే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలవండి. లివర్ ఫంక్షన్ టెస్ట్, యూఎస్‌జీ టెస్ట్, వంటి పరీక్షలను వైద్యులు సిఫారసు చేస్తారు. అవసరమైన మందులు తీసుకోండి. దీనితో పాటు, కొన్ని డైట్ మరియు లైఫ్ స్టైల్ టిప్స్ ద్వారా నయం చేయవచ్చు.