ఎలక్ట్రో కార్డియోగ్రామ్ గుండెలోని విద్యుత్ సంకేతాలను నమోదు చేసి గుండె యొక్క ఆరోగ్యాన్ని తెలిపే సాధారణ పరీక్ష.గుండెకు సంబంధించిన ప్రాధమిక పరీక్షలలో అతి ముఖ్యమైనది ఈసీజీ పరీక్ష . అనేక సాధారణ గుండె సమస్యలను గుర్తించడంలో ఈసీజీ సహాయపడుతుంది ఎలక్ట్రో కార్డియోగ్రామ్ – ECG లేదా EKG అని కూడా పిలుస్తారు.
ఈసీజీ టెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి నొప్పి ఉండదు. ఈసీజీ పరీక్షని క్లినిక్ లో , హాస్పిటల్ లో లేదా డయాగ్నోస్టిక్ సెంటర్లో చేయించుకోవచ్చు. స్మార్ట్‌వాచ్‌ల వంటి కొన్ని వ్యక్తిగత పరికరాలు ECG పర్యవేక్షణను అందిస్తాయి.
ఈసీజీ టెస్ట్ మంచిగా ఉంటే గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని ఖచ్చితంగా చెప్పలేము. అలాగే ఈసీజీ టెస్ట్ లో ప్రాబ్లం ఉన్నంత మాత్రాన గుండెజబ్బులు ఉన్నట్టు కూడా చ్చితంగా చెప్పలేము. ఒక ఈసీజీ ని చూసి పేషెంట్ ని చూడకుండా గుండెజబ్బు ఉందో లేదో చెప్పడం చాలా కష్టం. ఈసీజీ టెస్ట్ లో ప్రాబ్లం ఉన్నంత మాత్రాన మీకు గుండె జబ్బు లక్షణాలు లేకపోయినట్లయితే గాబరా పడాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో మీ దగ్గరలో ఉన్న డాక్టర్ ని సంప్రదించి మీకున్న సందేశాలను తీర్చుకోవాలి.
గుండె లోపల గుండె రక్తనాళాల్లో 90% పూడికలు ఉన్నప్పటికీ కూడా ఈసీజీ నార్మల్ ఉండొచ్చు. గుండె మూడు రక్తనాళాల్లో పూడికలు ఉన్నా కూడా కొన్నిసార్లు ఈసీజీ నార్మల్ ఉండొచ్చు.
Table of Contents
ECG Full form in Telugu
ఎలక్ట్రో కార్డియోగ్రామ్
ఈసీజీ
ఈసీజీ పరీక్ష ఏ విధంగా చేస్తారు
మీ యొక్క రెండు చేతులకి రెండు కాళ్ళకి మరియు ఛాతీ భాగం లో ఎలక్ట్రోడ్లు పెట్టి తీగలు ద్వారా గుండెలోని విద్యుత్ సంకేతాలను ECG మిషన్ కు పంపిస్తారు. విద్యుత్ సంకేతాలకు సంబంధించిన సమాచారం అంతా ఈసీజీలో record అవుతుంది. ఆ సమయంలో మీరు మాట్లాడటం గానీ, కలవడం గాని చేయకూడదు.ఈసీజీ చేయడానికి రెండు నుంచి ఐదు నిమిషాలు సమయం పట్టొచ్చు.
ఈసీజీ పరీక్ష ఎంత ఉంటుంది?
సాధారణంగా ఈ పరీక్ష అన్నది మన హైదరాబాద్ లో నూట యాభై నుంచి మూడు వందల వరకు ఉండొచ్చు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఇది నాలుగు నుంచి ఐదు వందల వరకు కూడా ఉండవచ్చు.
ఈసీజీ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారు?
మీకు గుండె జబ్బులు ఉన్నాయని మీ doctor సందేహించి నప్పుడు మీకు ఈసీజీ పరీక్ష సూచించవచ్చు
మీకు కింది సంకేతాలు మరియు లక్షణాలు ఏవైనా ఉంటే మీకు ఈసీజీ అవసరం.
మీకు గాని, ఛాతి నొప్పి, ఆయాసం, దమ్ము, కాళ్ళల్లో వాపులు, కళ్ళు తిరగడం, మరియు ఇతరాత్ర గుండెకు సంబంధించిన లక్షణాలు ఉంటే ECG పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
మైకము, తలతిరగడం లేదా గందరగోళం
స్పృహ కోల్పోవడం
గుండె దడ
వేగవంతమైన పల్స్
శ్వాస ఆడకపోవుట
బలహీనత
అలసట లేదా వ్యాయామం చేసే సామర్థ్యం క్షీణించడం
అలాగే నలభై వయసు దాటిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా కూడా ECG చేయించుకుంటే మంచిది.
ఏదైనా సర్జరీ గాని మనకి చేయాల్సి వస్తే మన గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి ఈసీజీ మరియు 2d ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష చేయడం అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది.
మీ పూర్వీకులలో ఎవరికైనా గుండెజబ్బులు ఉన్నట్లయితే అవి మనకు వచ్చే అవకాశం ఉంది. అటువంటి వారిలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా ఈసీజీ పరీక్ష చేయించుకుంటే మంచిది .
మనకు గాని మన గుండె వేగంగా కొట్టుకున్నట్టు అనిపిస్తే పరీక్ష ఈసీజీ చేసుకోవాలి. మన గుండె కొట్టుకున్న విషయం మనకి తెలియడాని Palpitations అంటారు.
గుండెపోటు కనిపెట్టడంలో
గుండెపోటు అనేది అకస్మాత్తుగా వచ్చే విపత్తు. గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి రక్తం సరఫరా పూర్తిగా ఆగిపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. ఆ సమయంలో గుండె కండరం ఊపిరి ఆడక చనిపోతుంది.
గుండె పోటుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కనిపెట్టి సరైన సమయంలో వైద్యం తీసుకుంటే మనిషి ప్రాణాన్ని గుండె పాడైపోకుండా కాపాడవచ్చు.
గుండెపోటు ని కనిపెట్టడానికి మన దగ్గర లభ్యమైన అతి ముఖ్యమైన పరీక్షఈసీజీ పరీక్ష.ఈసీజీ పరీక్షలో గుండెపోటును దాదాపు తొంబై ఎనిమిది శాతం ఖచ్చితంగా కనిపెట్టవచ్చు. గుండెపోటు కనిపెట్టడానికి ఈసీజీ పరీక్షని మించిన పరీక్ష లేదు.
కాబట్టి మీలో ఎవరికైనా విపరీతమైన చాతి నొప్పి వస్తే వెంటనే ఈ ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి. పరీక్షలో ఏమైనా గుండెపోటు సంబంధించిన తేడాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి సరైన వైద్యం చేయించుకోవాలి.
గుండెపోటుకు కనిపెట్టడానికి ట్రోపోనిన్ రక్త పరీక్ష , 2d ఎకో పరీక్ష కన్నా ఈసీజీ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది. పరీక్షలో గుండెపోటు కి సంబంధించిన తేడాలు కనిపిస్తే గుండెపోటు అన్నది నిర్ధారించబడినది. అటువంటి సమయంలో మీ డాక్టర్ వెంటనే మీకు యాంజియోగ్రామ్ పరీక్ష చేసుకోమని చెప్తారు. ప్రాణాలని గండం లోకి నెట్టే గుండెపోటు ను ఎదుర్కోవడానికి మనకు ఈసీజీ పరీక్ష ఎంతో సహాయపడుతుంది.
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కనిపెట్టడంలో
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు కూడా ఈసీజీ పరీక్ష వల్ల తెలుసుకోవచ్చు కానీ ఇందుకోసం 2D ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష మరింత ఉత్తమం.
పొటాషియం మరియు కాల్షియమ్ హెచ్చుతగ్గులను అంచనా వేయడం
మన రక్తంలో ఉండే పొటాషియం మరియు కాల్షియమ్ హెచ్చుతగ్గులను అంచనా వేయడంలో కూడా ఈసీజీ పరీక్ష ఉపయోగపడుతుంది.
సడన్ కార్డియాక్ అరెస్ట్
కొంతమంది అకస్మాత్తుగా గుండెజబ్బుతో మరణిస్తూ ఉంటారు. దీనిని హృదయ స్తంభన (సడన్ కార్డియాక్ అరెస్ట్) అంటారు. ఇలా అకస్మాత్తుగా చనిపోయే రోగులలో ఈసీజీ లో కొన్ని రకాల తేడాలు ఉంటాయి. ఆ విధంగా అకస్మాత్తుగా మరణించే ప్రమాదం ఉన్నవ్యక్తులను ఈసీజీ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.
హృదయ స్పందన తెలుసుకోవడానికి
హృదయ స్పందన ఎంత ఉన్నది అనేది తెలుసుకోవడానికి ఈసీజీ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది. మన గుండె సాధారణంగా నిమిషానికి అరవై నుంచి వంద సార్లు కొట్టుకుంటుంది.
క్రమరహిత గుండె లయలు (అరిథ్మియాస్) తెలుసుకోవడానికి
కానీ కొంత మందికి హృదయ స్పందన అన్నది చాలా తక్కువ అయిపోయి అరవై కన్నా కిందకి పడిపోవచ్చు. దీనిని Bradycardia అంటారు.బ్రాడీకార్డియా (Bradycardia) అని కనిపెట్టడానికి ECG పరీక్ష చాలా ఉపయోగపడుతుంది.
అలాగే మరి కొంత మందికి అదే స్పందన అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. దీనిని Tachycardia అంటారు. టాకీకార్డియా (Tachycardia) లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఏట్రియాల్ ఫైబ్రిల్లషన్ (Atrial fibrillation) , atrial flutter, వెంట్రిక్యులర్ టాకీకార్డియా (ventricular tachycardia), SVT.
ఇటువంటి గుండెలయ లకు సంబంధించిన రోగాలు కనిపెట్టడంలో ఈసీజీ పరీక్ష కు మించిన పరీక్ష లేదు.
గుండె యొక్క కండరం ఉబ్బిందో లేదో తెలుసుకోవడానికి
గుండె యొక్క కండరం ఉబ్బిందో లేదో తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది. గుండె యొక్క కండరం ఉబ్బడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అధిక రక్తపోటు.
మీకు ఇంతకు ముందు గుండెపోటు వచ్చినా అది ప్రస్తుత ఈసీజీ లో తెలిసిపోతుంది.
మీరు గనక ఇంతకుముందు పేస్ మేకర్ సర్జరీ చేయించు కున్నట్లయితే ద్వారా మీయొక్క పేస్ మేకర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు.
మీకు ఇంతకుముందే గుండె జబ్బులు ఉన్నట్లయితే ,మీకు చికిత్స పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఈసీజీ మన కున్నటువంటి గొప్ప ఆయుధం.
కరోనరీ ఆర్టరీ వ్యాధి తెలుసుకోవడానికి
గుండెలో ధమనులు మూసుకుపోయి లేదా ఇరుకైనట్లయితే , కరోనరీ ఆర్టరీ వ్యాధి అంటారు.
ఛాతి నొప్పి సమయంలో ఈ ఈసీజీ చేస్తే గుండెరక్తనాళాల్లో పూడికలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఛాతి నొప్పి లేని సమయంలో పరీక్ష నిర్వహిస్తే పూడికలు ఉన్నాయో లేవో ఖచ్చితంగా తెలుసుకోలేము. అటువంటి సమయంలో stress ఈసీజీ అనే పరీక్ష చాలా ఉపయోగపడుతుంది. Stress ఈసీజీ పరీక్షని treadmill పరీక్ష అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఒక రకమైన ఈసీజీ పరీక్ష. ఈ పరీక్షలో మీరు treadmill machine పైన పరిగెట్టాలి. సమయంలో మీ గుండె వేగం పెరిగి, గుండెకు రక్తం అవసరం ఎక్కువ అవుతుంది. ఆ సమయంలో గుండె రక్తనాళాల్లో పూడికలు గనక ఉంటే సరిపడేంత రక్తం గుండె గుండెకు చేరక treadmill ఈసీజీ పరీక్ష లో తేడాలు రావచ్చు.
హోల్టర్ మానిటర్
ఈసీజీ పరీక్షలో ఒక రకమైన పరీక్ష HOLTER పరీక్ష.హోల్టర్ మానిటర్ అనేది ఒక చిన్న పరికరం. ఇది నిరంతర ECGని రికార్డ్ చేస్తుంది. మీ గుండె లయను ట్రాక్ చేయడానికి కొన్ని రోజుల పాటు ధరించాల్సి వస్తుంది . సాధారణంగా 24 నుండి 48 గంటల హోల్టర్ మానిటర్‌ని ధరించమని డాక్టర్ మీకు సూచించవచ్చు. కొన్ని సార్లు పరీక్షను రెండు వారాల వరకు కూడా చేసుకోవాల్సి వస్తుంది.
సాధారణంగా గుండె దడ ఉన్నవారికి, తరచుగా స్పృహ కోల్పోతున్న వారికి, కళ్ళు తిరుగుతున్న వారికి హోల్టర్ పరీక్ష ఉత్తమం.
ఈమధ్య మెడకు తగిలించే మిషన్ కాకుండా band aid లాగా పెట్టుకునే ఒక Patch హోల్టర్ మానిటర్ అన్నవి వస్తున్నవి. ఇవి చాలా సౌకర్యంగా ఉండి హోల్టర్ మానిటర్అ న్నదానిని సులభతరం చేసినవి.
ఈవెంట్ మానిటర్
ఈ పరికరం హోల్టర్ మానిటర్‌ను పోలి ఉంటుంది, అయితే ఇది ఒక్కోసారి కొన్ని నిమిషాల పాటు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే రికార్డ్ చేస్తుంది. మీరు దీన్ని హోల్టర్ మానిటర్ కంటే ఎక్కువసేపు ధరించవచ్చు, సాధారణంగా 30 రోజులు ధరించవచ్చు.
ఈసీజీ పరీక్షలు తేడాలు ఉంటే తదుపరి టెస్టులు ఏమిటి?
ఒకవేళ ఈసీజీ పరీక్ష తేడాగా అనిపిస్తే తదుపరి పరీక్షలు చేయించుకోమని మీకు సలహా ఇవ్వచ్చు.
Pingback: ECG and 2d Echo - DM HEART CARE CLINIC
Pingback: Coronary Angiogram Means In Telugu | కరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఏమిటి ? - DM HEART CARE CLINIC
Pingback: Troponin test telugu - ట్రోపోనిన్ పరీక్ష - DM HEART CARE CLINIC
Pingback: 2d ఎకో పరీక్ష - 2d echo test in Telugu - CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST
Pingback: BEST HEART SPECIALIST IN HYDERABAD - CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST
Pingback: Cardiologist in Attapur Hyderabad - DM HEART CARE CLINIC