ఫ్యాటీ లివర్ వ్యాధి (fatty liver disease) నేటి కాలంలో సర్వసాధారణమైపోయింది. కాలేయం జీవక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాలేయం కొంత కొవ్వును కలిగి ఉండటం సాధారణమైనప్పటికీ, అధిక కొవ్వు పేరుకుపోవడం ప్రమాదం. దేనిని ఫాటీ లివర్ డిసీజ్ అంటారు. ఫాటీ లివర్ డిసీజ్ అభివృద్ధికి దోహదపడే వివిధ కారకాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అవి ఏమిటో చూద్దాం.
అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం
రెగ్యులర్ గా మరియు అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏర్పడుతుంది.
అధిక కేలరీలు ఉన్న ఆహారం
అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు కొవ్వు పేరుకుపోతుంది. చక్కెర పానీయాలు, అధిక కేలరీలు తీసుకుంటున్నట్లయితే అవసరానికి మించి కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. అందుకే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు.
శారీరక శ్రమ లేకపోవడం
శారీరక శ్రమ లేకపోవడం ఊబకాయం మరియు ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేస్తుంది. ఈ రెండూ ఫాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఊబకాయం
30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్(BMI) ఉన్న వాళ్ళు దీని వల్ల ప్రమాదంలో పడతారు. BMI బరువు, ఎత్తుతో సంబంధం కలిగి ఉంటుంది. శరీరం బరువు పెరిగే కొద్ది కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టే.
మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్
మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ సమస్య ఉంటుంది .
మందులు
కార్టికోస్టెరాయిడ్స్ మరియు కొన్ని క్యాన్సర్ మందులు వంటి కొన్ని మందులు ఫ్యాటీ లివర్ దుష్ప్రభావంగా కలిగిస్తాయి.
వేగంగా బరువు తగ్గడం
చాలా త్వరగా బరువు తగ్గడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కాలేయంలోకి విడుదల అవుతుంది.
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు
ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు అనేక విధాలుగా ఫ్యాటీ లివర్ వ్యాధికి దోహదం చేస్తాయి. అధిక కొలెస్ట్రాల్ ఇన్సులిన్ రెసిస్టన్స్కు దారితీస్తుంది. ఇది కొవ్వు జీవక్రియను నియంత్రించే కాలేయ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. తద్వారా కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ లివర్ ఇన్‌ఫ్లమేషన్ ను మరింత తీవ్రతరం చేస్తుంది . ఆహార మార్పులు మరియు మందుల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా కొవ్వు కాలేయ వ్యాధిని నివారించవచ్చు.
జన్యుపరమైన కారణాలు
కొంతమంది వ్యక్తులు కాలేయంలో అదనపు కొవ్వును నిల్వ చేసుకొనే తత్త్వం జన్యు పరంగా కలిగి ఉండవచ్చు. కొన్ని జన్యు వైవిధ్యాలు మన శరీరం కొవ్వులను ఎలా ప్రాసెస్ చేస్తుంది అనేదానిని ప్రభావితం చేస్తుంది.
ఈ వ్యాధిని కొన్ని డైట్ మరియు లైఫ్ స్టైల్ టిప్స్ ద్వారా నయం చేయవచ్చు. అవసరమైతే మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది