సాధారణంగా నెలసరి 28 నుంచి 30 రోజుల్లోపు రావాలి . కొన్ని సార్లు రెండు, మూడు రోజులు అటుఇటుగా వచ్చినా పర్లేదు. కొంత మందికి 40 రోజులు దాటినా పీరియడ్స్ రాకుండా ఉండటం, లేదంటే మూడు వారాలకన్నా ముందే పీరియడ్స్ రావడం జరుగుతుంది. దీనిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
ప్రస్తుత జీవనశైలి, కాలుష్యం కారణంగా ఎక్కువ మంది మహిళలు ఈ ఇర్రెగ్యూలర్ పీరియడ్స్ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఋతుక్రమాన్ని ప్రభావితం చేసే హార్మోన్లు రెండు, అవి ఈస్ట్రోజెన్ మరియూ ప్రొజెస్టిరాన్. ఈ హార్మోన్లు సరిగ్గా ఉంటేనే పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యతకారణంగానే పీరియడ్స్ తప్పడం, ఆగిపోవడం జరుగుతుంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కి సూచన కావచ్చు, వాటిలో కొన్ని సంతానోత్పత్తి లో సమస్యలకి కూడా దారి తీయవచ్చు
ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు కారణాలు
ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు అనేక కారణాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హార్మోన్ల అసమతుల్యత
ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి అత్యంత ముఖ్యమైన కారణము. ఈ కారణంగానే పీరియడ్స్ తప్పడం, ఆగిపోవడం జరుగుతుంటుంది.
ఒత్తిడి
ఒత్తిడికి గురవ్వడం ఋతు చక్రం నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఆందోళన క్రమరహిత కాలాలకు దారితీయవచ్చు . ఇందుకోసం ప్రతీ రోజూ ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయొచ్చు.
బరువు మార్పులు
అధికంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం కూడా ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఇది క్రమరహిత కాలాలకు దారితీస్తుంది. అధిక బరువు కూడా ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది, ఇది PCOS అభివృద్ధికి దోహదం చేస్తుంది.
గణనీయమైన బరువును త్వరగా కోల్పోవడం లేదా చాలా తక్కువ శరీర కొవ్వు శాతం కలిగి ఉండటం కూడా ఋతు చక్రానికి అంతరాయం కలిగించవచ్చు. అండోత్సర్గము మరియు ఋతుస్రావం కోసం శరీరానికి తగినంత శక్తి నిల్వలు ఉండకపోవడమే దీనికి కారణం.
అధిక వ్యాయామం
తీవ్రమైన వ్యాయామం ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి దారి తీస్తుంది.
హార్మోన్ల మార్పులు: అధిక వ్యాయామం వల్ల ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ వంటి కొన్ని హార్మోన్ల స్థాయిలలో మార్పులకు దారితీస్తుంది, ఇది రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తుంది.
శక్తి లేకపోవడం : తీవ్రమైన లేదా సుదీర్ఘమైన వ్యాయామం శరీరంలో శక్తి లోటును కలిగిస్తుంది, ఇది పునరుత్పత్తి హార్మోన్ల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది మరియు క్రమరహిత కాలాలకు దారితీస్తుంది.
ఒత్తిడి: వ్యాయామం అనేది ఒక రకమైన శారీరక ఒత్తిడి .
తక్కువ శరీర కొవ్వు: అధిక వ్యాయామం చేసే స్త్రీలలో చాలా తక్కువ శరీర కొవ్వు శాతం ఉండవచ్చు, ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది మరియు ఋతు చక్రం అంతరాయం కలిగిస్తుంది.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్
స్త్రీ అండాశయంలో లేదా ఉపరితలంపై ద్రవంతో నిండిన సంచులు లేదా తిత్తులు ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి మరొక ముఖ్యమైన కారణము.ఈ ప్రాబ్లెమ్ ఉంటే అసలు పీరియడ్ రాకపోవడం లేదా ఇర్రెగ్యులర్ గా పీరియడ్ రావడం జరుగుతుంది . మొటిమలు , ఎక్కువ హెయిర్ గ్రోత్ కూడా రవవుచు . ఈ కండిషన్ ఉన్న మహిళల్లో మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.
ఎండోమెట్రియాసిస్
గర్భకోశం లోపల మాత్రమే ఉండాల్సిన కణజాలంతో కూడిన పలచని పొర ఇతర అవయవాలలో కూడా ఉంటే ఎండోమెట్రియాసిస్ అంటారు. ఫెలోపియన్ ట్యూబ్స్ , పెద్ద పేగులు, చిన్న పేగులు, యోనిలలో ఎక్కడైనా ఈ పొర ఏర్పడవచ్చు. దీనివల్ల కూడా ఇర్రేగులర్ బ్లీడింగ్ అవుతుంది ఇది క్యాన్సర్ కాదు. కానీ, పెయిన్‌ఫుల్ గా ఉండవచ్చు.
పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్
సంక్షిప్తంగా PID అనేది స్త్రీ పునరుత్పత్తి అవయవాలకు సంక్రమించే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అది నెలసరి సమస్యలతో పాటు కడుపు నొప్పి మరియు జ్వరానికి కారణమవుతుంది.
మెనోపాజ్
స్త్రీలు మెనోపాజ్ సమీపిస్తున్నప్పుడు, రుతుచక్రం సక్రమంగా లేకుండా ఇర్రేగులర్గా కావొచ్చు.
థైరాయిడ్ రుగ్మతలు
థైరాయిడ్ గ్రంథి పని తీరు ఎక్కువైనా లేదా తక్కువైనా పెరియడ్స్ ఇర్రేగులర్ కావొచ్చు . థైరాయిడ్ గ్రంధి శరీరం యొక్క జీవక్రియను నియంత్రించడానికి బాధ్యత వహిస్తుంది. థైరాయిడ్ గ్రంథి చురుగ్గా పని చేయకపోవడాన్ని హైపోథైరాయిడిజం అని, అతిగా చురుగ్గా ఉంటే హైపర్ థైరాయిడిజం అని అంటారు. రెండు పరిస్థితులు క్రమరహిత పీరియడ్స్, అలాగే అలసట, బరువు మార్పులు మరియు జుట్టు రాలడం వంటి ఇతర లక్షణాలకు కారణమవుతాయి. ట్రీట్మెంట్ నిర్దిష్ట థైరాయిడ్ రుగ్మతపై ఆధారపడి ఉంటుంది. మందులు లేదా శస్త్రచికిత్స అవసరం పడొచ్చు.
ఇన్ఫెక్షన్లు
టీబీ లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల క్రమరహిత పీరియడ్స్ చాలా సాధారణం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఋతు చక్రంపై ప్రభావం చూపుతాయి.
మందులు
హార్మోన్ల గర్భనిరోధకాలు, స్టెరాయిడ్స్ లేదా బ్లడ్ తిన్నెర్స్ వంటి కొన్ని మందులు ఋతుక్రమం లోపాలను కలిగిస్తాయి.
నిద్రలేమి
ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి ఇదీ కూడా ఒక కారణం.ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు స్మార్ట్ పోన్లతో టైమ్‌ను గడిపేస్తూ నిద్రను చాల నిర్లక్ష్యం చేస్తున్నారు.
గర్భాశయ అసాధారణతలు
గర్భాశయానికి సంబంధించిన ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్ సమస్యలు క్రమరహిత రక్తస్రావం కలిగిస్తాయి.
అనీమియా
ఒకవేళ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే రుతుక్రమ సమయంలో విడుదలయ్యే బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది.
కాన్సర్
మరోవైపు కొన్ని కాన్సర్ లాంటి అనారోగ్య సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయానికి రావు.
అంతే కాకుండా జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్ , మద్యపానం లాంటి అలవాట్లు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి కారణాలు అవుతుంటాయి.
మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ను ఎదుర్కొంటుంటే, అంతర్లీన కారణాన్ని గుర్తించడానికి మరియు తగిన చికిత్స ప్రణాళికను రూపొందించడానికి మీ డాక్టర్ ని కలవడం చాలా ముఖ్యం. ప్యూబర్టీ సమయం లోనూ, మెనోపాజ్ సమయం లోనూ ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి ఎలాంటి చికిత్సా అవసరం లేదు.
మెడికేషన్ తీసుకోవడం తో పాటూ కొన్ని రకాల ఆహార పదార్ధాలని మీ రెగ్యులర్ డైట్ లో భాగం చేసుకోవడం కూడా మంచి ఫలితాలనిస్తుంది.