విటమిన్లు ఎ, సి మరియు ఇ, అలాగే మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ మరియు ఫోలిక్ యాసిడ్‌లతో నిండిన పండ్లు కంటే మెరుగైన పోషకాహారం మీకు లభించదు. పండ్లు గుండెపోటు ప్రమాదాన్ని మరియు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పండ్లు రక్తపోటును కూడా తగ్గిస్తాయి. పండ్లు రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి
మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు పండ్లలో వేటిని తినాలి, వేటిని తినకూడదో అన్న అనుమానాలు ఉంటాయి.
కొన్ని జాగ్రత్తలతో మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు పండ్లు తినొచ్చు. దీన్ని అమలు చేయడానికి ముందు మీ doctorని సంప్రదించండి
పండ్లు తినేటప్పుడు ఈ సూచనలను అనుసరించండి.
- తక్కువ glycemic index కలిగి ఉన్న పండ్లు తినండి.
- భోజనంతోపాటు పండ్లు తినకూడదు. భోజనం చేసిన ఒకటి లేదా రెండు గంటల తర్వాత తీసుకోవడం ఉత్తమం. పండ్లను తినడానికి ఉదయం సరైన సమయం. అంటే అల్పాహారంగా తీసుకోవచ్చు.
- పండ్లను నమిలిన తర్వాతే తినాలి. ఎందుకంటే పండును నమిలి తిన్నప్పుడు మాత్రమే అందులో ఉండే పీచు పదార్థాలు శరీరంలోకి వెళ్తాయి. అలాగే, పండ్లు తినడం ద్వారా వాటిలో ఉన్న చక్కెర శరీరంలో నెమ్మదిగా కరుగుతుంది. పండ్ల రసాలు తాగడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది. కాబట్టి అవి తాగొద్దు.
- రోజుకు ఒకటి కంటే ఎక్కువ పండ్లు తినకూడదు.
- మీ బ్లడ్ చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే పండ్లు తినండి.
మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు తినగలిగే పండ్లు కొన్ని
చెర్రీస్
GI:20
బ్లూబెర్రీస్
GI:38
స్ట్రాబెర్రీస్
GI:41
బ్లాక్బెర్రీస్
GI: 25
ఆపిల్
GI:39
పియర్
GI:32
అవోకాడో
GI:15
నారింజ
GI:40
జామ
GI:12
నేరేడు పండు
GI:25
పీచ్
GI:42
రేగు
GI:40
తినదగిన ఇతర పండ్లు
- పుచ్చకాయ
- ఉసిరి
మధుమేహం రోగులు తినకూడని పండ్లు
మధుమేహం రోగులు తినకూడని పండ్లు కూడా ఉన్నాయి. వాటి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా కొన్ని పండ్లను దూరం పెట్టాలి. వాటివల్ల రక్తంలో చక్కెర స్థాయి అమాంతంగా పెరుగుతుంది
అరటి పండు
GI:62
సపోటా
GI:55
మామిడి పండు
GI:60
పైనాపిల్
GI:66
ద్రాక్షపండ్లు
GI:60
ఎండిన ఖర్జూరాలు
GI:58
మధుమేహం రోగులు ఏమి పండ్లు తినాలో , ఏవి తినకూడదో తెలుసుకున్నారు కదా. మల్లి కలుద్దాం.
Related Posts:
- TOP 10 FOODS TO REDUCE TRIGLYCERIDES IN TELUGU
- Fueling Your Body to Fight Asthma: A Guide to the Best…
- Best ways to naturally decrease uric acid levels at home
- Coronary Angiogram Means In Telugu | కరోనరీ యాంజియోగ్రామ్…
- Flax seeds in Telugu
- Is mango good for diabetic patients in Telugu?
- ECG Test Means in Telugu | ఈసీజీ పరీక్ష
- Medicines for High Triglycerides in Telugu
- Foods to Avoid in High Triglycerides In Telugu
- "FAST Track to Brain Stroke Identification: How to Recognize…
Pingback: Fatty liver disease treatment - DM HEART CARE CLINIC
Pingback: Symptoms of kidney failure - DM HEART CARE CLINIC