vitamin d overdose or toxicity in Telugu
భారత దేశంలో దాదాపు 76 శాతం విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారు. వీలల్లో చాలా మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విటమిన్ డీ సప్లిమెంట్స్ ని తీసుకుంటున్నారు. ఐతే , శరీరంలో విటమిన్ల మోతాదు ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది
సాధారణంగా మన శరీరంలో 70 నానో గ్రాములు కంటే ఎక్కువ విటమిన్ డి స్థాయిని కలిగి ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి . 150 నానో గ్రాములు కంటే ఎక్కువ ఉంటే ఇంకా డేంజర్ . కాబట్టి, వైద్యుని సంప్రదించిన తర్వాతే విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాలి.
విటమిన్ డీ మీ శరీరానికి కావలసిన దాని కంటే ఎక్కువగా ఉంటే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
శరీరంలో అధిక కాల్షియం స్థాయిలు
శరీరంలో విటమిన్ డి అధికంగా పేరుకుపోయినప్పుడు రక్తంలో కాల్షియం స్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితిని హైపర్‌కాల్సెమియా (HYPERCALCEMIA) అంటారు.
ఎములకు దృఢంగా ఉండాలంటే శరీరానికి సరిపడ కాల్షియం అవసరమే కానీ.. ఎక్కువైతే కూడా ప్రమాదమని చెబుతున్నారు. రక్తప్రవాహంలో కాల్షియం యొక్క అధిక స్థాయిలు, మూత్రపిండాలు దెబ్బతినడంతో సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. హైపర్‌కాల్సెమియా మీకు వికారం, వాంతులు, మలబద్ధకం, నీరసం, కండరాల బలహీనత, అలసట మరియు విపరీతమైన దాహం వంటి సమస్యలను కలిగిస్తుంది.
వాంతులు , వికారం
హైపర్‌కాల్సెమియా కారణంగా తలతిరగడం, వికారం, వాంతులు వంటి సమస్యలు రావచ్చు .
అలసట, నీరసం
చాలామంది బాగా అలసట ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న చిన్న పనులకే అలసిపోతారు. శరీరం డి హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల అలసట వస్తుంది
ఆకలి లేకపోవడం
తినే టైం అయినా ఏమీ తినబుద్ధి. ఆకలి మందగించడం వల్ల బరువు కూడా గణనీయంగా తగ్గుతుంటుంది.
విపరీతమైన దాహం
రక్తంలో కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల , అధికంగా దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో నీటి కొరత ఏర్పడడం వల్ల కూడా దాహం ఎక్కువవుతుంది.
తరచుగా మూత్రవిసర్జన
మీ శరీరం అదనపు కాల్షియంను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నందున, ఒక్కోసారి అతి మూత్రం సమస్య కూడా ఏర్పడుతుంది. దీంతో అకస్మాత్తుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. రాత్రిపూట మూత్రం పోసేందుకు నిద్ర లేవడం, మూత్రం ఆపులేకపోవడం కూడా కలగొచ్చు
డీహైడ్రేషన్
తరచుగా మూత్రవిసర్జన వల్ల డీహైడ్రేషన్ కలుగుతుంది. దీర్ఘకాలంగా కొనసాగే డీహైడ్రేషన్ మీ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది, కిడ్నీలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.
మలబద్ధకం
శరీరంలో నీరు తక్కువైనపుడు పేగుల్లో మలం గట్టిగా మారుతుంది. డీహైడ్రేషన్ కారణంగా, మీరు మలబద్ధకం బారిన పడవచ్చు.
కండరాల నొప్పి, బలహీనత లేదా తిమ్మిరి.
విటమిన్ డీ ఎక్కువగా ఉన్నప్పుడు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, ఒళ్ళు నొప్పులు, నరాల నొప్పులు, కండరాల నొప్పులు ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతారు.
ఎముక నొప్పి
కాల్షియం పరిమాణం ఎక్కువైతే ఎముకలకు దృఢంగా మారకపోగా పెళుసుగా మారుతాయి. దీంతో అవి సులభంగా విరిగేందుకు అవకాశం ఉంటుంది. బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, భుజాలు, కీళ్ల నొప్పులు ఇలా అనేక రకాలుగా ఎముకల నొప్పులు బాధిస్తుంటాయి.
శరీరంలో నొప్పులు
విటమిన్ డీ ఎక్కువైనా సందర్భంలో శరీరమంతా నొప్పులు కలుగుతాయి. ప్రత్యేకించి ఎక్కువసేపు నిలబడి, నడవడం లేదా వ్యాయామం చేసే సందర్భంలో నొప్పులు ఉంటాయి. పాదాలు, చేతులు, నడుము, భుజాలు, మెడ తదితర ప్రాంతాల్లోని నెప్పులు ఎక్కువగా బాధిస్తుంటాయి.
కిడ్నీ స్టోన్స్
శరీరంలోని అదనపు కాల్షియం కారణంగా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడుతాయి.
కిడ్నీ ఫెయిల్
రక్తంలో అధిక స్థాయి కాల్షియం మీ మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి మీ మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేయడానికి చాలా కష్టపడతాయి. అధిక స్థాయి కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తుంది. చివరికి మూత్రపిండాల వైఫల్యానికి దోహదపడుతుంది.
క్రమ రహితమైన హృదయ స్పందన
విటమిన్ డి టాక్సిసిటీ అధిక రక్త కాల్షియం స్థాయిలతో సహా ఇతర ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది అరిథ్మియా వంటి గుండె ప్రాబ్లెమ్ కి కారణం కావొచ్చు
డిప్రెషన్ , ఆందోళన , నిరాశ
అధిక విటమిన్ డి స్థాయిలు న్యూరోట్రాన్స్మిటర్ పనితీరును ప్రభావితం చేస్తాయి. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కూడా కారణమవుతుందని అధ్యయనాల్లో తేలింది.
కోమా
తీవ్రమైన సందర్భాల్లో , హైపర్‌కాల్సెమియా కోమాతో సహా ఇతర తీవ్రమైన నరాల సంబంధిత లక్షణాలను కలిగిస్తుంది.
డెత్
సరైన టైం లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది మరణానికి కూడా దారి తీస్తుంది
విటమిన్ డీ సప్లిమెంట్స్ ని తీసుకుంటున్న వారు , విటమిన్ డి స్థాయిలను పర్యవేక్షించడం చాలా అవసరం. ఈ లక్సనలు ఉంటే వెంటనే సప్లిమెంట్స్ తీసుకోవడం ఆపెయ్యాలి . వెంటనే డాక్టర్ ని కలవాలి