Vitamin d deficiency in Telugu
విటమిన్ డి కొవ్వులో కరిగే విటమిన్. ఇది శరీరం కాల్షియం మరియు ఫాస్పరస్‌ని గ్రహించి, నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఎముకలు, దంతాలు మరియు కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ పోషకాలు చాలా అవసరం. దీని లోపం నవజాత శిశువుల నుండి పిల్లలు మరియు పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపం ఉందని ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
దురదృష్టవశాత్తు విటమిన్ డి లోపం ఉన్న చాలా మందికి లక్షణాలు కనిపించవు.
కానీ కొంతమందిలోఇప్పుడు చెప్పే లక్షణాల ద్వారా మనకి విటమిన్ డి లోపం ఉందే లేదో తెలుసుకోవచ్చు.
ఎముకల సమస్యలు (weak bones)
విటమిన్ డి లోపం ఎముకలు మరియు కండరాలకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, మీకు తగినంత కాల్షియం లభించదు మరియు ఇది వల్ల ఎముకలు బలహీనంగా మారడం కారణమవుతుంది.
రికెట్స్ (Rickets)
విటమిన్ డి లోపం పిల్లలలో రికెట్స్ వంటి ఎముక వైకల్యాలకు కారణమవుతుంది . దాని వల్ల, ఎదిగే పిల్లల్లో, కాళ్ళు వంకర అవ్వడం , పుర్రె సొట్ట పడడం , యముకల గూడులో వైకల్యాలు, ఎముకలు తేలికగా విరగడం, యముకల్లో నొప్పులు, మజిల్ వీక్నెస్, కండరాల నొప్పి, వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. దీంతో వాళ్ళ యొక్క ఎదుగుదల కూడా తగ్గిపోతుంది.
ఆస్టియోమలేసియా (osteomalacia)
పెద్ద వారిలో విటమిన్ డి లోపం వల్ల ఆస్టియోమలేసియా అనే ఎముకల సమస్య కలుగుతుంది. ఆస్టియోమలాసియా వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోయి ఎముకలు సులభంగా విరిగిపోతాయి. కాళ్ళు, పెల్విస్, హిప్స్ ప్రాంతం లో స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వంటివన్నీ విటమిన్ డీ లోపం యొక్క లక్షణాలే. ఆస్టియోమలేసియాలో భాగంగా ఆస్టియోపోరోసిస్, ఎముకల్లో నొప్పి, ఆర్థ్రాల్జియా , కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి లక్షణాలు కనిపిస్తాయి.
కండరాల నొప్పి లేదా పట్టేయడం ( muscle pain)
కండరాలలో తరచుగా నొప్పి ఉంటే, అది శరీరంలో విటమిన్ డి లోపానికి సంకేతం.
కండరాలు మెలికలు తిరగడం, మజిల్ వీక్నెస్, కండరాల్లో తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అలసట ( fatigue)
విటమిన్ డి శరీరం యొక్క శక్తి స్థాయిని అలాగే మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.
నిరంతరం బలహీనంగా మరియు అలసటగా అనిపించడం కూడా విటమిన్ డి లోపం యొక్క లక్షణం కావచ్చు. సరిగ్గా తిన్నా, రాత్రి 7 నుండి 8 గంటలపాటు నిద్రపోయినా అలసటగా అనిపిస్తే, అది శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కావచ్చు.
తరచుగా జబ్బు పడటం (Getting sick often)
విటమిన్ డి రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది కాబట్టి, దాని లోపం కారణంగా శరీరం అనేక వైరస్‌లతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది.
తరచుగా జబ్బు పడటం లేదా వ్యాధి సోకడం , తరచుగా అనారోగ్యంగా అనిపించడం విటమిన్ డి లోపం యొక్క సాధారణ లక్షణం . దీని కారణంగా ప్రజలు చాలా తరచుగా జలుబు, దగ్గు, టాన్సిల్స్ లేదా ఫ్లూ సమస్యలకి గురవుతారు.
బరువు పెరగడం (weight gain)
విటమిన్ డి మన బరువు నియంత్రణలో సహాయపడుతుంది. విటమిన్-డి లోపం వల్ల కొందరు విపరీతంగా బరువు పెరిగిపోతారు.
డిప్రెషన్, ఆందోళన (Depression, anxiety)
విటమిన్ డి స్థాయిలు తగ్గడం, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలకు కూడా కారణమవుతుందని అధ్యయనాల్లో తేలింది. నిరంతరం బలహీనంత మరియు అలసట మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ ఈ వ్యక్తులను సులభంగా చుట్టుముడుతుంది.
జుట్టు రాలడం (hair loss)
విపరీతంగా జుట్టు రాలడం మరియు జుట్టు పెరగకపోవడం కూడా విటమిన్ డి లోపం వల్ల కావచ్చు. మీరు ఎన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నా, జుట్టు రాలడాన్ని అరికట్టలేకపోతే, మీరు మీ విటమిన్ డి స్థాయిలను ఖచ్చితంగా తనిఖీ చేయాలనే అర్ధం.
చర్మంపై దద్దుర్లు (Rashes)
శరీరంలో విటమిన్ డి తగినంతగా లేని వ్యక్తుల చర్మంపై దద్దుర్లు మరియు మొటిమలు రావడం సాధారణం. అలాంటి వారిలో వృద్ధాప్య చాయలు తలెత్తడం, తరచుగా చర్మం పగలడం, మచ్చలు వంటి అనేకరకాల సమస్యలు ఏర్పడతాయి. శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు, గోర్లు పసుపు రంగులో కనిపిస్తాయి. అలాగే, చేతులు, కాళ్ళపై తెల్ల మచ్చలు కనిపించడం ప్రారంభమవుతుంది.
నిద్రలేమి (insomnia)
విటమిన్ డి లోపం ఉన్నవారికి నిద్రలేమి ప్రధానమైన సమస్యగా ఉంటుంది.
పుండు త్వరగా మానకపోవడం (poor wound healing)
ప్రమాదవశాత్తు గాయాలు అయినప్పుడు, శస్త్రచికిత్స జరిగినప్పుడు, దెబ్బలు త్వరగా మానడానికి విటమిన్ డి అవసరం. పుండు త్వరగా మానకపోవడం మీ విటమిన్ డి స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయని సంకేతం కావచ్చు.
విటమిన్ డి లోపం చాలా కాలం పాటు కొనసాగితే, ఇది క్రింది సమస్యలకు దారి తీస్తుంది
- గుండె జబ్బులు
- ఆటో ఇమ్యూన్ డిసీజ్
- నరాల వ్యాధులు
- ప్రెగ్నన్సీ సమస్యలు
- రొమ్ము, ప్రోస్టేట్ మరియు పెద్దప్రేగుతో సహా కొన్ని క్యాన్సర్లు
మీలో విటమిన్ డి లోపం యొక్క లక్షణాలను మీరు గమనించినట్లయితే,డాక్టర్ని కలిసి మీరు రక్త పరీక్ష చేయించుకోండి .
కొవ్వు చేపలు మరియు పాల ఉత్పత్తులు వంటి కొన్ని ఆహార పదార్థాలు విటమిన్ డి కలిగి ఉంటాయి. విటమిన్ డీ కి చక్కని సోర్స్ సూర్య రశ్మే. గుడ్డు పచ్చ సొన, ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ బ్రేక్ ఫాస్ట్ సెరియల్ కూడా మంచివే. లోపం ఉంటే ఇంజెక్షన్ రూపంలో కానీ, టాబ్లెట్ ద్వారా గాని దాన్ని సరిచేసుకోవాలి.