CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

Triglycerides diet in Telugu | dyslipidemia

Triglycerides diet Telugu

Triglycerides meaning in Telugu

 

శరీరంలో రక్త ప్రవాహంలో కనిపించే ఒక రకమైన కొవ్వు పదార్ధాలే ట్రైగ్లిజరైడ్లు (triglycerides). ప్రారంభంలో ఇవి కొవ్వు కణాలలో నిల్వ చేయబడి తరువాత రక్త ప్రవాహంలోకి విడుదలవుతాయి. ట్రైగ్లిజరైడ్ల స్ధాయి అధిక మొత్తంలో ఉండటాన్ని ట్రైగ్లిసరిడామియా అంటారు. 

triglycerides meaning in Telugu. ట్రైగ్లిజరైడ్స్

High triglycerides symptoms in Telugu and Risks in Telugu

 

శరీరంలో అధిక మొత్తంలో ట్రైగ్లిజరైడ్లు ఉండటం గుండె జబ్బులకు మూల కారణం. ఇది చాలా ప్రమాదకర స్థాయికి చేరుకుంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.  

How to reduce triglycerides naturally in Telugu

 

రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, జీవనవిధానాల్లో మార్పు, ఆహార నియమాల మార్పు, మందులు వాడటం వంటివి అవసరం.

 

 

1. Exercise | వ్యాయామం

నడక, జాగింగ్ వంటివి వాటిని రోజువారి అలవాటుగా మార్చుకోవటం వల్ల శరీర బరువు మరియు ట్రైగ్లిసరైడ్స్ తగ్గుతాయి.  రోజుకు కనీసం 30 నిమిషాల పాటు చురుకు నడవటం, స్విమ్మింగ్ వంటివి క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించవచ్చు. 

2. Weight loss | బరువు తగ్గాలి

లావుగా ఉన్న వారు బరువు తగ్గాలి. మీ శరీర బరువులో 5-10% కోల్పోవడం వల్ల మీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలో తేలింది. మీరు నిజంగా మీ బరువును నియంత్రించాలనుకుంటే,మొదట మీ ఆహారాన్ని నియంత్రించడం చేయాలి.. ఎక్కువగా బరువు ఉంటే శరీర బరువు Normal కి వచ్చేలా dietలో క్యాలరీలు తగ్గించుకోవాలి.

3. Stop Alcohol, smoking

 

Alchol, smoking చేస్తే ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి.   కాబట్టి ధూమపానం మానేయండి మరియు మద్యం మానేయండి.

4. Triglycerides lowering foods

 

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఆహారంలో కొద్దిపాటి మర్పులు చేసుకోవడం చాలా అవసరం.

a. అధిక ట్రైగ్లిజరైడ్ తో బాధపడేవారు ఎటువంటి కొవ్వు పదార్థాలు తినవచ్చు ?     

        

కొవ్వు శాతం ఎక్కువగా ఉండే మాంసం తినొద్దు. రొయ్యలు, మాంసం, చికెన్‌ , డీప్‌గా వేయించిన వేపుళ్లను తగ్గించాలి. కొవ్వులో వాస్తవానికి 3 రకాలు ఉంటాయి. ఒకటి కొవ్వు ఆమ్లాలు, రెండు అసంతృప్త కొవ్వులు, మూడోది సంతృప్త కొవ్వులు. 

 కొవ్వు ఆమ్లాలు మీ శరీరానికి హానికరం. వీటిని వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అధికంగా పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారంలో ఈ రకమైన కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

సంతృప్త కొవ్వు మీ శరీరానికి మంచిది కాదు. కాబట్టి వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది. సంతృప్త కొవ్వులు మొత్తం శరీరంలో కేవలం10% మాత్రమే ఉండాలి. జంతువుల నుంచి లభించే ఆహారంలో అనగా మాంసం, చికెన్‌లో ఈ రకం కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. పాలు లేదా పాల ఉత్పత్తులలో కూడా సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి.

మంచి కొవ్వుల విభాగంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి పలు విధాలుగా మేలు చేస్తాయి.

సంతృప్త కొవ్వు ఆమ్లాలు తగ్గించి, ఒమేగా 3, ఒమేగా 6, MUFA, PUFA వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది. 

b. అధిక ట్రైగ్లిజరైడ్ తో బాధపడేవారు ఎటువంటి కార్బొహైడ్రేట్స్ తినవచ్చు ?

 

తేలికగా జీర్ణమయ్యే కార్బొహైడ్రేట్స్ తీసుకోవడాన్ని  తగ్గించండి.  తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలతో ట్రైగ్లిజరైడ్లు పెరుగుతాయి. శుద్ధి చేయబడిన కార్బొహైడ్రేట్స్ మరియు సాధారణ చక్కెర వాడకం కూడా ఎంత వీలైతే అంత తగ్గించాలి. శుద్ధి చేసిన పిండి నుండి ధాన్యపు పిండికి మారాలి . బ్రౌన్ రైస్, గోధుమ పిండి, బార్లీ పిండి, ఓట్స్ పిండి , బుక్వీట్   పిండి  ఎక్కువగా తీసుకోండి. వైట్ రైస్, మైదా, బియ్యం పిండి వాడకం తగ్గించండి. టేబుల్ షుగర్, క్యాండీస్, చాకోలెట్స్, ఫ్రూట్ జామ్స్ , ఐస్ క్రీం, కేకులు, వంటి చక్కెర పదార్ధాలు, అలాగే తెల్ల బియ్యం, పొట్టు తీసిన పిండి వంటి కార్బొహైడ్రేట్స్ ను తగ్గించాలి. కూల్ డ్రింకులు తీసుకోరాదు. చక్కెరతో తయారైన స్వీట్లు , వెన్న, నెయ్యి, ఫ్రక్టోజ్ అధికంగా ఉండే తేనె వంటి తీపి కలిగిన సిరప్ లను ఆహారంగా తీసుకోవటం ఆపేయాలి. 

వివిధ వ్యాపార సముదాయాల్లో లభించే ఆహార పదార్థాలు, బర్గర్, పిజ్జాలు, చిప్స్, నుడుల్స్ తినొద్దు.     రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.     

c. ఎటువంటి ఆయిల్ వాడితే మంచిది? 

        

మోనోశాచురేటెడ్ కొవ్వులు ఆలివ్ ఆయిల్, నట్స్ మరియు అవకాడోస్ వంటి ఆహారాలలో కనిపిస్తాయి. పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు కుసుమ, 

నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వు మరియు కొవ్వు చేపలు, అలాగే వాల్‌నట్‌లు, అవిసె గింజలు మరియు చియా గింజలు వంటి గింజలు మరియు విత్తనాలలో ఉంటాయి.

ఇంట్లో వంట చేసేటప్పుడు, ఆలివ్, అవిసె గింజ, వాల్నట్ ఆయిల్, కుసుమ, నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వు ఆయిల్ వంటివి వాడుకోండి.

d. అధిక ట్రైగ్లిజరైడ్ తో బాధపడేవారు ఎటువంటి ఆహార పదార్థాలు తింటే ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి ?

 

Fish:

 

చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

వారానికి రెండు సార్లు ఆహారంలో చేపలను చేర్చుకోవడం ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించడంలో బాగా ఊయోగపడతాయి. సాల్మన్(salmon), సార్డినెస్(sardines), మాకేరెల్ (mackerel) వంటి సముద్రపు చేపల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. 

Plant-based food:

 

      చిక్కుళ్ళు, సోయా ఉత్పత్తులు , పాలకూర, బచ్చలికూర, వంటి ఆకుకూరలను తీసుకోవటం మంచిది.  ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవటం మంచిది. తృణధాన్యాలు, బీన్స్, పండ్లు, కూరగాయలు, గుమ్మడికాయ గింజలు, రోజుకు 25గ్రాముల లోపు ఫైబర్ ను శరీరానికి అందించేలా చూసుకోవాలి.

 అవిసె గింజ | Flax seeds

 

అవిసె గింజల్లో (flax seeds) ఆరోగ్య కర ఫ్యాట్స్, ఫైబర్ (పీచు పదార్థం) ఉంటాయి. అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్టీ యాసిడ్స్‌ని అల్ఫా-లైనోలెనిక్ యాసిట్ (ALA) అంటారు. అవిసె గింజ ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి. అందువల్ల ఓట్స్, సలాడ్స్, ఇతర చిరుతిళ్లతో కలిపి అవిసె గింజల్ని తినడం అలవాటు చేసుకుంటే, పై ప్రయోజనాలు పొందవచ్చు.

అవిసె గింజ ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయి- Flax seeds for triglycerides- triglycerides diet in Telugu

చియా గింజ | Chia seeds

 

చియా గింజలలో ఫైబర్, ఒమేగా 3, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో చియా గింజలు ముందుంటాయి. నీటిలో నానబెట్టి ఓ గంట పాటు ఉంచి తీసుకోవచ్చు. కావాలంటే వీటిని స్మూతీలు, షేక్స్ లో కూడా చేర్చుకోవచ్చు. 

ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో చియా గింజలు ముందుంటాయి-chia seeds for triglycerides in Telugu-triglycerides diet in Telugu

Garlic | వెల్లుల్లి

 

వెల్లుల్లిలోని కారకాలు చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను 15 శాతం వరకు తగ్గిస్తాయి. ఇటువంటివారు రోజుకు వెల్లుల్లి రెబ్బ ఒకటి, అంగుళం అల్లం తింటే మంచిది

How to reduce triglycerides medically?

Statins and fenofibrates:

 

Statins and fenofibrates అని పిలువబడే ఔషధాలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ ను నియంత్రిస్తాయి . ప్రతిరోజు నిద్రపోయే ముందు ఈ మందులను తీసుకోవడాన్ని మీ డాక్టర్ సూచించవచ్చు. ఇది నియంత్రిత ఆహారం, వ్యాయామం మరియు జీవనశైలితో కలిపి తీసుకోవాలి. ఆహార జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే ఫలితం బాగానే ఉంటోంది.

Control your blood sugars

 

మధుమేహులు వీటి స్తాయిలు ఎక్కువగా ఉన్నాయో పరిశీలించాలి. తప్పనిసరిగా తగ్గించుకోవాలి. గ్లూకోజ్ సమర్థంగా నియంత్రణలో ఉంచుకోవాలి.

Triglycerides lowering foods in youtube in Telugu

Look at our video on Triglyceride diet in Telugu

3 thoughts on “Triglycerides diet Telugu”

  1. Pingback: What fruits are good for diabetes (and the worst) - DM HEART CARE CLINIC

  2. Pingback: What are the normal levels of triglycerides in the blood (Telugu) - DM HEART CARE CLINIC

  3. Pingback: How to improve HDL (Good) Cholesterol Naturally in Telugu - DM HEART CARE CLINIC

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now