విటమిన్లలో ముఖ్యమైనది విటమిన్ బి12. ప్రస్తుతం ఈ విటమిన్ లోపం చాలా మందిలో కనిపిస్తోంది. విటమిన్ బి 12 యొక్క సహాయంతోనే రెడ్ బ్లడ్ సెల్స్ అనే రక్త కణాలు తయారు అవుతాయి. విటమిన్ బి 12 డిఎన్ఏ తయారీకి ఉపయోగపడుతుంది . విటమిన్ B-12 మెదడు మరియు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
శరీరంలో విటమిన్ బి-12 లోపం కారణంగా, మీరు అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
రక్తహీనత
- బి12 లోపిస్తే రక్తహీనత వస్తుంది (ఐరన్ లోపం వాళ్ళ కూడా రక్తహీనత కలుగుతుంది) . రక్తకణాలు తక్కువగా ఉండడంతో శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణవాయువు సరఫరా తగ్గుతుంది. తద్వారా తీవ్రమైన అలసట. శరీరంలో రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అని అటారు
- ఊపిరి ఆడకపోవడం, కాస్త దూరం నడవగానే ఊపిరాడుకుండా ఉక్కిరిబిక్కిరవడం
- గుండెదడ
- శరీర బలహీనత, అలసట, నీరసంగా అనిపించడం
- ఆకలి లేకపోవడం
మెదడుకు ఆక్సిజన్ తగ్గడం వల్ల
- కళ్లు తిరిగినట్లుగా అనిపించడం, కళ్ళు తిరిగి మైకం కమ్మడం
- తలనొప్పి
- కంగారు
- గజిబిజిగా అనిపించడం
- కంటిచూపు తగ్గడం
వంటి సమస్యలు ఎదురవుతాయి.
విటమిన్ బి 12 లోపం వలన చర్మం రంగు లేత పసుపు రంగులోకి మారుతుంది. B12 లోపిస్తే చర్మం పొడిబారిపోతుంది, చర్మం పాలిపోతుంది , నాలిక మరియు నోరు భాగం ఎరువు రంగులోకి మారుతుంది. నాలుక మీద పుండ్లు కూడా వస్తాయి.
నాడీ వ్యవస్థ
- విటమిన్ బి12 లోపం వల్ల చేతులు మరియు కాళ్లలో తిమ్మిరి లేదా జలదరింపు వస్తుంది.
- నడవడంలో ఇబ్బంది.
రక్త పరీక్ష
రక్త పరీక్ష ద్వారా దీని లోపాన్ని గుర్తించవచ్చు.
విటమిన్ B-12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు విటమిన్ B-12 లోపాన్ని భర్తీ చేయవచ్చు.
B-12 పుష్కలంగా ఉన్న ఆహారాలు ఏవి ?
- గుడ్డు
- సోయాబీన్
- పెరుగు
- ఓట్స్
- పాలు
- చీజ్
- బ్రోకలీ
- మాంసాహారం – ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. జంతువుల ఆధారిత ఆహారంలో B12 పుష్కలంగా లభిస్తుంది.
-
- చేప
- చికెన్
- మటన్
-
Pingback: Symptoms of Anemia in Telugu - DM HEART CARE CLINIC