మన శరీరానికి ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ కీడు చేస్తుంది.వైద్య పరిభాషలో చెప్పాలంటే చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ అని అంటారు. జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు, వేపుళ్లు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చిరు తిళ్లను ఎక్కువగా తినడం వల్ల, మన శరీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంది. గుండె వ్యాధులకు కారణమయ్యే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, కొంత స్థాయిని మించితే ప్రమాదకరంగా మారుతుంది. కనుక, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎప్పుడూ నియంత్రణలో ఉండాలి.
మీ శరీరంలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు, అది కాలక్రమేణా మీ రక్తనాళాల గోడలలో అతుక్కుపోతుంది. ఇతర పదార్థాలతో కలిసి, ఇలా గట్టిపడే సమ్మేళనాన్ని ఫలకం అంటారు. రక్త నాళాల్లో ఫలకం ఏర్పడటం వల్ల, కాలక్రమేణా ఆ నాళాలు పూడుకుపోతాయి. ఈ ఫలకం మీ గుండె మరియు ఇతర అవయవాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. రక్త ప్రసరణకు ఇలా ఆటంకాలు ఏర్పడినప్పుడు, అది స్ట్రోక్ లేదా గుండెపోటుకు కారణమవుతుంది.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి సూచించే సాధారణ మందు స్టాటిన్స్. స్టాటిన్స్ మీ శరీరాన్ని కొలెస్ట్రాల్ తయారు చేయకుండా ఉంచడంలో సహాయపడతాయి.
కనుక , ఇవి అధిక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తులలో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రోసువాస్టాటిన్ అత్యంత శక్తివంతమైన స్టాటిన్స్‌లో ఒకటి. రోసువాస్టాటిన్ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ని సమర్థవంతంగా యాభై శాతం వరకు
తగ్గించగలదు. డాక్టర్ పర్యవేక్షణలో ప్రతిరోజూ రాత్రిపూట దీన్ని తీసుకోండి.
ఈ మందులతో సంబంధం లేకుండా జీవనశైలి మార్పులను కూడా వైద్యులు సిఫారసు చేయవచ్చు. శారీరక శ్రమ, గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్ వినియోగం తగ్గించడం, పొగ తాగడం మానేయడం వంటి జీవన శైలి మార్పులతో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ని ఇరవై ఐదు శాతం వరకు తగ్గించగలరు.
ఇలా మందులతో, జీవనశైలి మార్పులతో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ని మీరు డెబ్బైఐదు శాతం వరకు తగ్గించవచ్చు.
Pingback: How to improve hdl cholesterol (good cholesterol) - DM HEART CARE CLINIC