Blood pressure or అధిక రక్తపోటు
అధిక రక్తపోటుతో, తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మరియు మెదడు సంబంధ రక్తనాళాల్లో ఇబ్బందులు రావచ్చు.
అధిక రక్తపోటుతో బాధపడే చాలా మంది రోగులకు రక్తపోటు కు సంబంధించిన ఎటువంటి లక్షణాలు ఉండవు. లక్షణాలు లేని రోగులు కూడా రక్తపోటు వల్ల కలిగే దుష్ప్రభావాలు యధావిధిగా ఎదుర్కొంటారు. కాబట్టి ఈ లక్షణాలు లేని రోగులు కూడా అధిక రక్తపోటుకు వైద్యం తీసుకోవాలి.
కాబట్టి మీకు అధిక రక్తపోటు ఉందో లేదో తెలుసుకోవడానికి అత్యంత ఖచ్చితమైన పద్ధతి ఏమిటంటే, మీ వైద్యుడిని కనీసం సంవత్సరానికి రెండుసార్లు మీ రక్తపోటును తనిఖీ చేయమని అడగడం.
అధిక రక్తపోటుతో బాధపడే రోగులలో చాలా కొద్ది మంది మాత్రం లక్షణాలను కలిగి ఉంటారు. సాధారణంగా ఈ లక్షణాలు వ్యక్తి యొక్క రక్తపోటు అత్యంత ప్రమాదకరమైన లేదా ప్రాణాంతకం అయ్యే స్థాయికి చేరుకునే వరకు స్పష్టంగా కనిపించవు. అందువలన లక్షణాలు వచ్చేంత వరకు మనం వేచి చూడకూడదు.
అధిక రక్తపోటు లక్షణాలు
అధిక రక్తపోటును సూచించే కొన్ని లక్షణాలు ఏమిటంటే
- తలతిరగడం
- తలనొప్పి
- నిద్రలేమి
- చూపు మసకబారడం
- విపరీతమైన అలసట లేదా నీరసం
- చెమటలు పట్టడం
- శ్వాస ఆడకపోవుట
- ముఖం ఎర్రబడడం
- చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం
- మెడ నొప్పి, చేయి నొప్పి, లేదా శరీర నొప్పులు
- గుండె దడ
- ఛాతి నొప్పి (chest pain)
- వికారం
- వాంతులు
- ముక్కు నుండి రక్తం కారడం
కొంతమంది రక్తపోటు లేదనుకునే రోగులు గుండె పోటు లేదా పక్షవాతంతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. ఇంతకుముందే వాళ్లకి రక్తపోటు ఉందని, తెలుసుకోలేకపోవడం వల్ల గుండె పోటు లేదా పక్షవాతం వచ్చిందని వైద్యులు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
రక్తపోటు సమస్య వచ్చిందంటే రక్తనాళాలు మరియు అవయవాలు, ముఖ్యంగా మెదడు, గుండె, కళ్ళు మరియు మూత్రపిండాలు దెబ్బతింటాయి. మీరు ఏవైనా లక్షణాలను అనుభవిస్తున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సంవత్సరానికి రెండు సార్లు బ్లడ్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి .
Pingback: Best ways to naturally decrease uric acid levels at home - DM HEART CARE CLINIC
Pingback: How to reduce hypertension in telugu easily with Diet and Lifestyle Changes - DM HEART CARE CLINIC