కంటిలోని తెల్లని భాగాన్ని, కంటి రెప్పల వెనక భాగాన్ని కప్పి ఉంచే పారదర్శక పొరని కంజంటైవా అంటారు .ఈ పొరకు వాపు వచ్చి కందడాన్ని కన్‌జన్‌క్టివైటిస్ అంటారు . దీని కారణంగా కళ్లు ఎర్రగా మారి నీరు కారడం, మండిపోవడం జరుగుతుంది.
కండ్ల కలక సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. కాంటాక్ట్ లెన్సులు ధరించడం మానేయండి
మీ కళ్ళు సాధారణ స్థితికి వచ్చే వరకు మీ కాంటాక్ట్ లెన్స్‌లను ధరించవద్దు.
తగ్గిన తరువాత మీరు కాంటాక్ట్ లెన్సులు తిరిగి ధరించడాల్సి వస్తే కొత్త జతని ఉపయోగించండి. మీ పాత కాంటాక్ట్ లెన్సులు వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. మీరు వాటిని మళ్లీ ధరించినట్లయితే మీరు మళ్లీ కండ్ల కలకకి గురవుతారు.
2. కంటికి మేకప్ వేసుకోవడం మానేయండి.
కాంటాక్ట్ లెన్సులు మాదిరిగానే మీ కళ్ళు ఆరోగ్యంగా ఉన్న తర్వాత మీ పాత కంటి మేకప్ తొలగించి కొత్త మేకప్ కిట్ వాడండి
3. నల్లటి అద్దాలు పెట్టుకోండి
నల్లటి అద్దాలు పెట్టుకుంటే లక్షణాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దీంతో కళ్లకు ఎక్కువ వెలుతురు తగలదు. ఇతరులకు అంటుకోకుండా నిలువరిస్తుంది.
కళ్లకలక వచ్చినవారు తమ దుప్పటి, తువ్వాలు వంటివి విడిగా పెట్టుకోవాలి. ఇతరులు వాడుకునే వాటితో కలవనీయొద్దు. ఫోన్ వంటి పరికరాలు షేర్ చేసుకోవద్దు.
4. నొప్పి ఉపశమన మందులు లేదా పెయిన్ కిల్లర్ తీసుకోండి
ఇబుప్రోఫెన్ లేదా మరొక ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్ తీసుకోండి. కంటి నొప్పిని తగ్గించడంలో ఇవి సహాయపడవచ్చు, కానీ అవి కండ్లకలకని నయం చేయవు.
5. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ లేదా కంటి చుక్కలు ఉపయోగించండి.
కంటిలో చికాకు లేదా మంటను తగ్గించడానికి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు.
ఒక వ్యక్తికి అలెర్జీల కారణంగా కండ్లకలక కలిగి ఉన్నప్పుడు అలెర్జీ కంటి చుక్కలు ప్రత్యేకంగా సహాయపడతాయి
బాక్టీరియల్ కన్‌జన్‌క్టివైటిస్‌ఉంటే కంటి సమస్యలు రాకుండా ఉండేందుకు యాంటిబయాటిక్స్ చుక్కల మందులు వాడాలి.
6. కళ్లపై వెచ్చగా, తడిగా ఉండే గుడ్డను ఉంచండి
పుసులు కట్టి కంటిరెప్పలు అతుక్కోవడం, లేదా చీము కారుతున్నట్లు అనిపిస్తే వెచ్చగా, తడిగా ఉండే గుడ్డను ఉంచండి. కొన్ని నిమిషాల పాటు మీ కళ్లపై వెచ్చగా, తడిగా ఉండే గుడ్డను ఉంచండి. శుభ్రమైన టవల్ ను గోరువెచ్చని నీటిలో నానబెట్టి, మీ కళ్ళపై ఆ తడిగా ఉన్న గుడ్డను చల్లబడే వరకు ఉంచండి.దీన్ని రోజుకు చాలా సార్లు చేయండి.
ప్రతిసారీ శుభ్రమైన టవల్ని ఉపయోగించండి. మీకు రెండు కళ్లలో ఇన్ఫెక్షియస్ ఉంటే, ప్రతి కంటికి వేరే వేరే టవల్ని ఉపయోగించండి.
పొడి క్రస్ట్‌ను తొలగించడానికి వెచ్చని షవర్ సహాయపడుతుందని కూడా తెలుసుకోండి.
7. తడి గుడ్డ కూల్ కంప్రెస్ గుడ్డను ఉంచండి
పింక్ ఐ మంటను కలిగిస్తుంటే కూల్ కంప్రెస్ మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.
శుభ్రమైన టవల్‌ను చల్లటి నీటిలో నానబెట్టడం ద్వారా కూల్ కంప్రెస్ చేయవచ్చు. కొన్ని నిమిషాలపాటు కంటిపై గుడ్డను ఉంచండి
8. కళ్లను తాకడం మానుకోండి
సాధారణంగా వైరల్ కళ్లకలక ఒక కంటికే వస్తుంటుంది. దీన్ని తాకిన చేతిని మరో కంటికి తగలకుండా చూసుకుంటే రెండో కంటికి అంటుకోకుండా కాపాడుకోవచ్చు. మీరు మీ కళ్ళను తాకవలసి వస్తే, ముందు మరియు తరువాత మీ చేతులను బాగా కడగాలి.
9. పోషకమైన ఆహారం తీకుకోవాలి
విటమిన్లు A, C మరియు E, అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, కంటికి మేలు చేసే ఆహారాలు. వీటిని సమృద్ధిగా తీసుకోండి.
విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు- క్యారెట్లు, చిలగడదుంపలు, బచ్చలికూర, కాలే మరియు ఆప్రికాట్లు.
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు: సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మకాయలు), స్ట్రాబెర్రీలు, మరియు బ్రోకలీ.
విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు: నట్స్ (బాదం, పొద్దుతిరుగుడు గింజలు), బచ్చలికూర మరియు అవకాడోలు.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: కొవ్వు చేపలు , అవిసె గింజలు మరియు వాల్‌నట్‌లు.
పుష్కలంగా నీరు త్రాగడం త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. అదనంగా, అలెర్జీను తీవ్రతరం చేసే ఆహారాలను నివారించండి.