హైపోథైరాయిడిజం ఉంటే క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ తీసుకోవచ్చా (Is it safe to consume cabbage and cauliflower with hypothyroidism in Telugu)?
ప్రస్తుతం హైపోథైరాయిడిజం సమస్య చాలామందిని వేధిస్తోంది.అయితే ఎక్కువగా మహిళల్లోనే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. హైపోథైరాయిడిజంతో బాథపడే వాళ్లు బ్రొకోలి, క్యాబేజ్, క్యాలీ ఫ్లవర్, టర్నిప్స్ వంటివి తీసుకోకూడదు అని అనుకుంటారు. చాలామంది వీటిని పూర్తిగా దూరం పెడుతుంటారు. వాటిలో గొంతుకు సంబంధించిన గాయిటర్ వ్యాధికి కారణమయ్యే గోయిట్రోజెన్లు ఉంటాయని భయపడుతుంటారు. అవి తింటే హైపో థైరాయిడిజం వస్తుందని ఆందోళన చెందుతుంటారు.
కానీ గోయిట్రోజెన్లు నిజంగా అంత చెడ్డవా మరియు మీరు వాటిని పూర్తిగా దూరం పెట్టాలా? అన్నది ఇప్పుడు చూద్దాం
హైపోథైరాయిడ్ రోగులు సాధారణంగా గోయిట్రోజెనిక్ కూరగాయలను తినవచ్చు అని అంటున్నారు. మన డాక్టర్ మల్లేశ్వర రావు గారు. తినవచ్చు అన్నామని వాటిని ఎక్కువ గా లేదా రోజూ తీసికోండి అని అర్ధం కాదు.
గోయిట్రోజెన్లు అంటే ఏమిటి ?
గోయిట్రోజెన్లు అనేక మొక్కల ఆధారిత ఆహారాలలో సహజంగా సంభవించే రసాయనాలు. అధిక మొత్తంలో ఈ పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల మీ థైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి.
ఈ ఆహారాలు అయోడిన్‌ను ఉపయోగించగల మీ థైరాయిడ్ సామర్థ్యానికి అంతరాయం కలిగిస్తాయి. మరింత ప్రత్యేకంగా చెప్పాలంటే , కీ థైరాయిడ్ హార్మోన్లు T4 మరియు T3 లలో అయోడిన్ చేర్చబడే ప్రక్రియను గోయిట్రోజెన్ నిరోధిస్తుంది
మరి ఏమిటా ఆహారాలు ?
గోయిట్రోజెన్-రిచ్ ఫుడ్స్ లో క్రూసిఫెరస్ వర్గంలోని కూరగాయలు, కొన్ని పండ్లు,కొన్ని నట్స్ మరియు కొన్ని ధాన్యాలు ఉంటాయి
గోయిట్రోజెనిక్ కూరగాయలు అంటే
- క్యాబేజీ
- కాలీఫ్లవర్
- బ్రోకలీ
- బ్రసెల్స్ స్ప్రౌట్స్
- ముల్లంగి
- టర్నిప్స్ (ఎర్రగా బీట్ రూట్ ని పోలి ఉండే కూరగాయ టర్నిప్)
- బచ్చలికూర
- కాలే
- మస్టర్డ్ గ్రీన్స్ ఆవాల ఆకులు
- బోక్
గోయిట్రోజెనిక్ కూరగాయలను తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని అంటున్నారు. మన డాక్టర్ మల్లేశ్వర రావు గారు.
మోడరేషన్
మోడరేషన్ అంటే మీరు వీటిని పూర్తిగా నివారించాల్సిన అవసరం లేనప్పటికీ, వాటిని మితమైన పరిమాణంలో మాత్రేమే తీసుకోవడం మంచిది . వీటిలో ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి మితమైన మోతాదులో తీసుకుంటే సమస్యలు ఎప్పుడూ సంభవించవు. సమస్య ఎల్లప్పుడూ వాటిని చాలా పెద్ద పరిమాణంలో వినియోగించబడినప్పుడు మాత్రమే.
తగినంత అయోడిన్ తీసుకోవడం కంపల్సరీ
అయోడిన్ వల్ల గోయిట్రోజెన్ల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయోడిన్ లోపం అనేది థైరాయిడ్ పనిచేయకపోవడానికి బాగా తెలిసిన ప్రమాద కారకం. ఐయోడైజ్డ్ సాల్ట్ తినే వారికి మితమైన మోతాదులో గోయిట్రోజెనిక్ కూరగాయలను తింటే ఏ సమస్యా ఉండదు.
థైరాయిడ్ డిజార్డర్ తో బాధపడేవాళ్ల డైట్ లో సెలీనియం కంపల్సరీ ఉండాలి.
సెలీనియం కూడా అయోడిన్ లాగా గోయిట్రోజెన్ల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
సెలీనియం కి గొప్ప వనరులు ఏమిటంటే బ్రెజిల్ నట్స్ , చేపలు, మాంసం, పొద్దుతిరుగుడు విత్తనాలు, టోఫు,టర్కీ చికెన్ , బ్రౌన్ రైస్ కాల్చిన బీన్స్, పుట్టగొడుగులు, నట్స్ మరియు చీజ్.
వండి తినండి .
వీటిని పచ్చిగా మాత్రం తినకూడదు. ఈ కూరగాయలను ఉడకబెట్టి కూర వండుకొని తినడం లేదా మైక్రోవేవ్ చేయడం లాంటివి చెయ్యాలి. లేదా ఆవిరిలో ఉండికించి తినాలి .
గోయిట్రోజెనిక్ కూరగాయలను వంట వండే క్రమంలోనే గోయిట్రోజెన్లు నశిస్తాయని చెబుతున్నారు డాక్టర్స్
వెరైటీ
మీరు రోజువారీ కూరగాయలు తీసుకోవడానికి గోయిట్రోజెనిక్ కూరగాయలపై మాత్రమే ఆధారపడకండి. మంచి సమతుల్య మరియు పోషకమైన ఆహారాన్ని తీసుకొనే భాగంలో మీ ఆహారంలో వివిధ రకాల నాన్ గోయిట్రోజెనిక్ కూరగాయలను కూడా చేర్చండి.
సో ఫ్రెండ్స్ , హైపోథైరాయిడ్ రోగులు లిమిటెడ్ గా క్యాబేజీ, కాలీఫ్లవర్ తినొచ్చని సూచిస్తున్నారు. భయం అక్కర్లేదు అంటున్నారు డాక్టర్ మల్లేశ్వర రావు గారు. మరీ మోతాదుకి మించి తీసుకోకుండా జాగ్రత్త పడండి చాలు.