ACANTHOSIS NIGRICANS TELUGU
అకాంతోసిస్ నైగ్రికన్స్ (ACANTHOSIS NIGRICANS) లో చర్మం పై నల్లటి వలయాలు, మరియు మడతలు వస్తాయి . ఆ ప్రదేశంలో చర్మం మందంగా కూడా మారవచ్చు. సాధారణంగా, అకాంటోసిస్ నైగ్రికన్స్ మీ చంకలు, గజ్జలు మరియు మెడపై వస్తాయి.
అకాంతోసిస్ నైగ్రికన్స్ సాధారణంగా ఊబకాయం లేదా మధుమేహం ఉన్నవారిలో సంభవిస్తాయి.
ఈ రుగ్మత ఉన్న వారికి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అరుదుగా, ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ కడుపు, పెద్దప్రేగు లేదా కాలేయం వంటి అంతర్గత అవయవంలో క్యాన్సర్ లేదా కణితి కి సూచన కావొచ్చు .
అకాంథోసిస్ నైగ్రికన్స్ ఉంటే అండాశయ తిత్తులు అంటే PCOS , అండర్యాక్టివ్ థైరాయిడ్ లేదా అడ్రినల్ గ్రంధులతో సమస్యలుఉండే అవకాశం ఉంది