CARDIOLOGIST IN HYDERABAD FOR ECG, 2D ECHO & STRESS TEST

Lifestyle and diet for fatty liver disease

కాలేయం జీవక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాలేయంలో కొవ్వు మొత్తం మన లివర్ బరువులో 5% మించి ఉండకూడదు. కొందరిలో కొవ్వు విపరితంగా పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ఇలా కొవ్వు పేరుకుపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి .

ఫ్యాటీ లివర్ డీసీజ్ రెండు రకాలు. ఒకటి ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను వైద్య పరిభాషలో NASH అని కూడా అంటారు. మద్యపానం చెయ్యని వ్యక్తుల్లో ఇది సంభవిస్తుంది.

 

సరైన ఆహారం తీసుకోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అస్తవ్యస్తమైన జీవనశైలి వంటివి దీనికి కారణాలు.

కొన్ని డైట్ మరియు లైఫ్ స్టైల్ టిప్స్ ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య నయం చేయవచ్చు.

 

తాగడం మానేయండి

 

కాలేయ సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం మద్యం సేవించడం. మీరు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే, వెంటనే వదిలేయండి లేకపోతే సమస్య మరింత పెరుగుతుంది.

ఫ్యాటీ లివర్ నయం కావాలంటే లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవాలి. చాలా సాధారణమైన డైట్ తీసుకోవాలి. కొందరి విషయంలో ఉపవాసం పనిచేస్తుంది. రాత్రి 9 గంటలలోపు ఆహారం తీసుకోండి, ఆలస్యంగా భోజనం చేయకండి.

ధూమపానం పూర్తిగా మానేయండి.

మంచి ఆహారం తీసుకోండి

 

కొవ్వు కాలేయాన్ని సరిచేయడానికి,సమతుల్య ఆహారం తీసుకోండి. కూరగాయలు మరియు తాజా పండ్లను ఆహారంలో చేర్చాలి. ఆకుకూరలు యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి సహాయపడతాయి. దీనితో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ లాంటి తృణధాన్యాలు ఫైబర్ మరియు పోషకాలను ఎక్కువ మోతాదులో అందిస్తాయి.అలాగే గ్లైసెమెక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫ్యాటీ ఫిష్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లలో అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకోండి.

కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు ఉన్న పదార్ధాలను చేర్చుకోవాలి. తక్కువ కొవ్వు గల పాలతో చక్కెర లేకుండా రోజూ 2 నుంచి 3 సార్లు కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్‌ నయం కావడానికి దోహదం చేస్తుందని పేరుంది. కొబ్బరి నీరు, మజ్జిగ పుష్కలంగా త్రాగాలి.

మోనోశాచురేటెడ్ కొవ్వులు, వెయ్ ప్రోటీన్, గ్రీన్ టీ వంటి ఆహారాలను కూడా ఆహారంలో చేర్చుకోండి. 

  ఆలివ్ ఆయిల్ వాడండి కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించే మోనోశాచురేటెడ్ కొవ్వులను ఇది కలిగిఉంటుంది  

వెల్లుల్లిలో కాలేయం దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది కాలేయానికి ప్రయోజనం చేకూరుస్తుంది.

  వాల్‌నట్‌లు ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ E యొక్క మంచి మూలాలు, కాలేయానికి మేలు చేస్తాయి. అవకాడో, బెర్రీలు, ద్రాక్షలను తీసుకోవడం కాలేయానికి చాలా మంచిది. 

 

చెడు ఆహారం తీసుకోకండి 

 

శాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్‌ తగ్గించాలి. వైట్ బ్రెడ్, వైట్ రైస్ మరియు పేస్ట్రీలు వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చెయ్యండి. స్వీట్లు తీసుకోవడం మానుకోవాలి షుగర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ డ్రింక్స్, సోడాలు మరియు ఎనర్జీ డ్రింక్స్ తగ్గించాలి. పూర్తి కొవ్వు పాల ఉత్పత్తులు కాలేయానికి హాని కలిగించే సంతృప్త కొవ్వులలో అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవద్దు . ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని నివారించండి. అధికంగా సోడియం అంటే ఉప్పు తీసుకోవడం మానుకోవాలి. 

వ్యాయామాలు 

 

 బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, ఇతర ఏరోబిక్ యాక్టివిటీ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి. యోగా ఒత్తిడిని తగ్గించడంతో పాటు కాలేయ కొవ్వు స్థాయిలను మెరుగుపరుస్తుంది.

నిద్ర 

 

నిద్ర సరిగ్గా లేకపోవడం శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఈ అసమతుల్యతల వల్ల అతిగా తినడం మరియు బరువు పెరగడానికి దారితీయవచ్చు. కాబట్టి 6 నుంచి 8 గంటలు తప్పనిసరిగా నిద్రించాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవడం మరియు మేల్కొలపడం చెయ్యండి . నిద్రవేళకు ముందు ఎలక్ట్రానిక్ పరికరాలకు (స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు మొదలైనవి) ఉపయోగించడం పరిమితం చేయండి.

మీ నిద్ర వాతావరణం సౌకర్యవంతంగా, చల్లగా మరియు అంతరాయాలు లేకుండా ఉండేలా చూసుకోండి. 

బరువు 

 

కాలేయంలో కొవ్వు తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గం బరువు తగ్గడం. బరువు తగ్గడం వల్ల కొవ్వు కరిగి ఎటువంటి సమస్యలు లేకుండా ఎక్కువ కాలం జీవించవచ్చు. దీని వల్ల ఫ్యాటీ లివర్ సమస్య దానంతట అదే ముగుస్తుంది.ఆహారంలో మార్పులు చేసుకుంటూ డైట్ ఫాలో అవుతూ శరీరానికి తగినంత శారీరక శ్రమ ఇవ్వడం వల్ల దీని నుంచి బయట పడొచ్చు. మీ BMI 40 కంటే ఎక్కువ ఉంటే బేరియాట్రిక్ శస్త్రచికిత్స ద్వారా కొవ్వుని తీసేయగలరు. మధుమేహం ఉంటే బేరియాట్రిక్ శస్త్రచికిత్స వల్ల షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. 

 

దీర్ఘకాలిక వ్యాధులను కంట్రోల్లో ఉంచుకోండి 

 

 మీకు కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉంటే, వాటిని కంట్రోల్లో ఉంచుకోండి. థైరాయిడ్ కూడా మీ కాలేయ సమస్యనుని మరింత దిగజార్చవచ్చు.  

ఆలస్యం చేయకుండా వైద్యుడిని కలవండి. అవసరమైన మందులు తీసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Call Now