అల్సర్ సాధారణంగా ఆహారపదార్థాలలో తేడా వలన, వేళకు సక్రమంగా ఆహారం తీసుకోకపోవడం వలన, కాఫీ-టీలు ఎక్కువగా త్రాగడం వలన, నొప్పి టాబ్లెట్స్ వలన, సిగరెట్లు ఎక్కువ కాల్చడం వలన కూడా ఏర్పడుతుంది.
అల్సర్ లక్షణాల నుంచి రిలీఫ్ పొందాలంటే మీరు మీ ఆహారపుటలవాట్లలో మార్పులు చేయాలి. అలాగే ఇతర అలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలి.
అల్సర్ లక్షణాల నుంచి రిలీఫ్ పొందాలంటే, ఈ సూచనలను అనుసరించండి.
- నొప్పి టాబ్లెట్స్ వేసుకోకూడదు
- భారీగా తినవద్దు. కొద్దిగా మాత్రమే ఆహారం తినండి. ఏం తింటున్నామనే దానికంటే ఎంత తింటున్నామన్నదే ముఖ్యం.
- సులువుగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి.
- ఆహారంలో నూనె వాడకం తక్కువగా వుండాలి.
- అధిక బరువును తగ్గించండి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
- ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేయవద్దు
- బిగుతుగా ఉండే దుస్తులు ధరించవద్దు.
- మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నీక్స్ ను పాటించండి.
- ఉపవాసం ఉండకండి.
- వేళకు సక్రమంగా భోజనం చేయాలి.
- నిలవ వుండే ఆహారాన్ని తీసుకోకూడదు.
- భోజనం అయిన వెంటనే వెల్లకిలా పడుకోకుండా కొంత సేపు నడవాలి.
- భోజనం తర్వాత గోరువెచ్చని నీరు తాగండి. గోరువెచ్చని నీరు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి, ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
అల్సర్ బాధితుల్లో కడుపు నొప్పి ని పెంచే ఆహారాలు జాబితా
- చాక్లెట్ తినకూడదు
- స్పైసి ఫుడ్ , ఫ్రైలు, మసాలా వంటలు, నూనెలో బాగా వేయించిన ఆహారాలు, బిర్యానీ తీసుకోరాదు
- ఆరెంజ్, నిమ్మ, పైనాపిల్, దానిమ్మ పండు, ద్రాక్ష వంటి సిట్రస్ ఫ్రూట్స్ తక్కువగా తీసుకోండి
- చింతకాయ, చింతపండు తక్కువగా తినాలి
- కాఫీ, టీ, సిగరెట్లు, మత్తుపానీయాలు త్రాగవద్దు
- టమోటాలు , టొమాటో సూప్‌ను నివారించండి
- మసాలా ఆహారాలు తీసుకోవడం తగ్గించండి.పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివి గుండెమంట కలిగిస్తాయి.
- కూల్ డ్రింక్స్, సోడా తాగ కూడదు.
మీరు మీ ఆహారంలో చేర్చవలసిన పదార్థాల జాబితా
- కాలీఫ్లవర్
- క్యాబేజీ
- ముల్లంగి
- క్యారెట్లు
- గుమ్మడికాయ
- కాయధాన్యాలు, చిక్‌పీస్ మరియు సోయాబీన్స్
- బ్రోకలీ
- కాలే, పాలకూర మరియు బచ్చలికూర వంటి ఆకు కూరలు
- ఆపిల్స్
- బ్లూబెర్రీస్
- రాస్ప్బెర్రీస్
- బ్లాక్బెర్రీస్
- స్ట్రాబెర్రీలు
- చెర్రీస్
- యాపిల్స్, పుచ్చకాయలు, అరటి పండ్లు, జామపండు
- పెరుగు వంటి ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారాలు.
- యోగర్ట్
- తేనె
- పసుపు
- ఓట్ మీల్, ఓట్స్ లాంటివి తీసుకుంటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
- జీడిపప్పు, బాదం, పిస్తా, వేరుశెనగ, ఎండుద్రాక్ష, ఎండు ఆప్రికాట్లు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్
- టీ, కాఫీకి బదులుగా కెఫిన్ లేని గ్రీన్ టీ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.
మీరు మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి.
తక్షణ ఉపశమనం కోసం హోమ్ రెమెడీస్
- ఒక టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక గ్లాసు నీళ్లలో పోసి బాగా మరిగించాలి. అసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
- లవంగాల నూనె వల్ల గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గుతుంది. ఒక గ్లాసుడు నీటికి రెండు నుంచి మూడు చుక్కల లవంగపు నూనెను చేర్చిన తర్వాత, మీల్స్ తరువాత తాగండి.
Pingback: FIRST AID DURING A HEART ATTACK AT HOME IN TELUGU - DM HEART CARE CLINIC