అధిక ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) స్థాయిని పొందే ప్రమాదాన్ని కలిగి ఉండే వారు ఎవరు ?
- ఊబకాయం లేదా బరువు ఎక్కువ ఉండే వారికి అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉండే అవకాశం ఉంది.
- మధుమేహం (Diabetes) నియంత్రణలో లేకపొతే ట్రైగ్లిజరైడ్స్ రక్తంలో పెరగొచ్చు.
- తగినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాకపోవడం లేదా హైపోథైరాయిడ్ (Hypothyroid) వల్ల కూడా మీకు రక్తంలో కొవ్వు అధిక స్థాయిలో ఉండొచ్చు.
- కాలేయం (Liver) సంబంధిత రోగాలతో బాధ పడే రోగులు కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా కలిగి ఉంటారు.
- ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా కలిగి ఉండడానికి మూత్రపిండ సమస్యలు (Kidney diseases) కూడా ఒక ముఖ్యమైన కారణం.
- జన్యు ప్రభావం (Genetic) అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉండడానికి అతి ముఖ్యమైన కారణం.
- అరుగుదల శక్తిని మించి అధిక కేలరీల ఆహారాల్ని ప్రతి నిత్యం తినడం మరియు శారీరక శ్రమ లేకపోవడం రక్తంలో కొవ్వు పేరగడానికి అతి ముఖ్యమైన కారణాలు.
- మద్యం తాగడం మరియు ధూమపానం సేవించే అలవాటు ఉన్న వారికి కూడా రక్తంలో కొవ్వు స్థాయికి మించి ఉంటాయి.
- మూత్రవిసర్జనకారక మందులువంటివి, స్టెరాయిడ్స్, జనన నియంత్రణ మాత్రలు మరియు రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే మందులు సేవించడం వాళ్ళ మన రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరుగుతాయి.
- పీసీఓడీతో బాధపడుతున్నగర్భిణీ స్త్రీలు మరియు గర్భిణీ స్త్రీలలో కూడా తరచుగా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి.
Pingback: Is it good to eat Fish After Heart attack in Telugu - DM HEART CARE CLINIC
Pingback: What is metabolic syndrome - DM HEART CARE CLINIC
Pingback: What are the normal levels of triglycerides in the blood (Telugu) - DM HEART CARE CLINIC