We will now discuss Vitamin C rich Foods in Telugu.
విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ (ascorbic acid) అని కూడా పిలుస్తారు.విటమిన్ సి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది ఓ యాంటీ ఆక్సిడెంట్. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుండి మన కణాలను రక్షిస్తాయి. మన శరీరాలు మనం తినే ఆహారం నుండి ఐరన్ శోషణకు విటమిన్ సి సహాయపడుతుంది. విటమిన్ సి మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇదే కాకుండా, విటమిన్ సి న్యూట్రోఫిల్స్ అంటే తెల్ల రక్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు మరియు కరోనా వైరస్ వంటి వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది, ముఖ్యంగా వర్షకాలంలో . అలాగే కీళ్లకు ఎంతో సహాయకంగా పనిచేస్తుంది. విటమిన్ సి చర్మం, రక్తనాళాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. పళ్ళు, ఛిగ్గుళ్ళు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
విటమిన్ సి రోజుకి ఎంత అవసరము ?
పురుషులకు రోజుకు 90 మిల్లీగ్రాములు, మహిళలకు 75 మిల్లీగ్రాములు విటమిన్ సి అవసరం అవుతుంది.
విటమిన్ సి లోపం తలెత్తకుండా ఈ టాప్ 10 ఆహారాలు తింటే మీ ఆరోగ్యానికి మంచిది . పులుపు ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లలో కూడా విటమిన్ సి అధికంగాఉంటుందని అంటున్నారు మన డాక్టర్ మల్లేశ్వర రావు గారు.
1.మామిడికాయలు
పచ్చి మామిడికాయలు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మంగోస్ 36 మిల్లీగ్రాముల విటమిన్ సి కలిగి ఉంటాయి. పండని మామిడి పండ్లతో పోలిస్తే పండిన మామిడిలో సాధారణంగా విటమిన్ సి తక్కువగా ఉంటుంది. మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ మరియు ఇతర రకాల కెరోటినాయిడ్లు కూడా ఉన్నాయి.
2.పైనాపిల్
పైనాపిల్‌లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. పైనాపిల్ లో విటమిన్ సి 47 మిల్లీగ్రాములు ఉంటుంది . అదే విధంగా వీటిలో ఇతర పోషకాలు కూడా విరివిగా లభిస్తాయి.
3.స్ట్రాబెర్రీ
100 గ్రాముల స్ట్రాబెర్రీ లో 58 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లను కూడా కలిగి ఉంటాయి.
4.బొప్పాయి
బొప్పాయిలో విటమిన్ సి మరియు విటమిన్ ఎ మంచి మొత్తంలో ఉన్నాయి. ప్రతి 100 గ్రాములలో దాదాపు 60 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. బొప్పాయిలో కెరోటిన్లు, బి విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ వంటి ఇతర పోషక విలువలు కూడా ఉన్నాయి.
5.సిట్రస్ ఫ్రూప్ట్స్
సిట్రస్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అని అంటున్నారు. ఈ పండ్లను రోజూ తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా, ఎన్నో ప్రయోజనాలను పొందుతారు .
సిట్రస్ పండ్లలో విటమిన్ సి పరిమాణం, పండు యొక్క రకం, పరిమాణం మరియు పక్వతతో సహా చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది.
నారింజ 70 నుండి 90 మిల్లీగ్రాములు
గ్రేప్ ఫ్రూట్ 80 నుండి100 మిల్లీగ్రాములు
నిమ్మకాయ 30 నుండి 40 మిల్లీగ్రాములు
నారింజలో 70 మిల్లీగ్రాములు విటమిన్ సి ఉంటుంది. ఒక కప్ ఆరంజ్ జ్యూస్ లో 124 విటమిన్ సి ఉంటుంది. అంటే ఇది ఒకటి త్రాగితే రోజు మన శరీరానికి విటమిన్ సి సరిపోతుందన్న మాట.
నిమ్మకాయలు 100 గ్రాముల రసానికి 53 మిల్లీగ్రాములు విటమిన్ సి కలిగి ఉంటాయి. దీనిని కూడా జ్యూస్ లేదా పచ్చడి చేసుకుని తినవచ్చు.
6.క్రూసిఫరస్ కేటగిరీలోని కూరగాయలు
క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలు మీ రోజువారీ విటమిన్ సి మొత్తం అందిస్తాయి. ఆ కూరగాయలు ఏమిటో చూసేయండి.
బ్రోకలీ (ఒక కప్పు, తరిగినవి): 80 మిల్లీగ్రాములు
కాలే (ఒక కప్పు, తరిగినవి): 80 మిల్లీగ్రాములు
బ్రస్సెల్స్ మొలకలు (ఒక కప్పు): 75 మిల్లీగ్రాములు
ఎర్ర క్యాబేజీ (ఒక కప్పు): 50 మిల్లీగ్రాములు
కాలీఫ్లవర్ (ఒక కప్పు, తరిగినవి): 48 మిల్లీగ్రాములు
ఈ కూరగాయలు అన్ని పోషకాలు లో దట్టమైనవి. యాంటీఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి
బ్రోకలీని వండినప్పుడు ఎక్కువసేపు ఉడక పెట్టకుండా తక్కువ సేపు ఉడకబెడితే విటమిన్ సి ఎక్కువగా బ్రోకలీనిలో ఉంటుంది.
7.కివి
కివీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు 100 గ్రాముల కివీని తింటే, మీకు దాదాపు 92 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. నిజానికి కివిలో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కివిలో ఫైబర్ మరియు మీ శరీరాన్ని రక్షించడంలో సహాయపడే ఫ్లేవనాయిడ్స్ మరియు కెరోటినాయిడ్స్ అనే ప్రత్యేక పదార్థాలు కూడా ఉన్నాయి.
8.రెడ్ బెల్ పెప్పెర్స్ –రెడ్ క్యాప్సికమ్
ఆకుపచ్చ, ఎరుపు మరియు పసుపు వివిధ రంగుల్లో లభించే క్యాప్సికమ్‌లో తగినంత విటమిన్ సి కూడా ఉంటుంది. 100 గ్రాముల రెడ్ క్యాప్సికమ్‌లో 127 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. క్యాప్సికమ్ విటమిన్లు ఎ, బి, ఇ, మరియు కె, అలాగే పొటాషియం, ఫోలేట్, మాంగనీస్, భాస్వరం మరియు మెగ్నీషియం యొక్క మంచి మూలం.
9.జామకాయ
జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మీకు మంచిది. 100 గ్రాముల జామకాయలో 228 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఇది నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది. జామపండులో విటమిన్ ఎ, బీటాకెరోటిన్, లైకోపిన్ మరియు విటమిన్ బి సిక్స్ వంటి ఇతర విటమిన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల జామకాయలో 228 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.
10.ఉసిరికాయ
ఉసిరికాయలో అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల ఉసిరిలో 600 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది.విటమిన్ సి లభించే ఆహార పదార్థాల్లో ఉసిరికాయ మొదటి స్థానంలో ఉంది. రోజుకి ఒకటి లేదా రెండు ఉసిరికాయలు తింటే మనకు ఒక రోజుకు సరిపడా విటమిన్ సి పుష్కలంగా సరిపోతుంది . ఉసిరికాయ ప్రతి కాలంలో లభించదు కనుక ఉసిరి పచ్చడి చేసుకుని తిన్నా విటమిన్ సి లభిస్తుంది