అధిక ట్రైగ్లిజరైడ్స్ (triglycerides) గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి, అయితే అదృష్టవశాత్తూ, ఆ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే కొన్ని రుచికరమైన ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
కొవ్వు చేప (Fat fish): సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ మరియు ట్రౌట్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని తేలింది.
గింజలు (Nuts): బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు మరియు అవిసె గింజలు వంటి గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కూడా ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో చాలా సహాయపడతాయి.
హోల్ గ్రెయిన్స్ (Whole grains): బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ మరియు హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణ ధాన్యాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది .ఫైబర్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
అవోకాడో (Avocado): అవోకాడో అనేది పోషకాలు అధికంగా ఉండే పండు. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బెస్ట్ అని తేలింది.
లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ (Leafy green vegetables): బచ్చలికూర, కాలే మరియు కొల్లార్డ్ గ్రీన్స్ వంటి లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్‌లను నియంత్రించడంలో మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దిట్ట.
ట్రైగ్లిజరైడ్ స్థాయిలను గణనీయంగా తగ్గించడానికి ఆహారంలో మార్పులు మాత్రమే సరిపోవని గమనించడం ముఖ్యం. వీటితో పాటు క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజెస్ చేస్తూ, ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. కొంతమంది మెడిసిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.