Vitamin d levels normal range in Telugu – Vitamin d blood test
విటమిన్ డి అంటే కొవ్వులో కరిగే విటమిన్. మన శరీరంలో విటమిన్ డి అనేక రూపాల్లో ఉంటుంది. విటమిన్ డి టెస్ట్ ద్వారా మన రక్తంలో ఉండే ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ విటమిన్ డి పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. అందుకే ఈ పరీక్షను ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ విటమిన్ డి పరీక్ష అంటారు. ఇది ఒక రక్త పరీక్ష. ఇందులో సిరల నుంచి రక్తాన్ని తీసుకుని పరీక్షిస్తారు. ఈ పరీక్షకు రక్త నమూనాను ఇచ్చే ముందు ఎటువంటి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
మీరు పేర్కొన్న లక్షణాలను గమనించినట్లయితే, ఆలస్యం చేయకుండా మీ విటమిన్ డి స్థాయిలను తనిఖీ చేసుకోండి.
పెద్దలలో ఎంత విటమిన్ డి ఉండాలో తెలుసా ?
- ఈ రీడింగ్ 5 నానో గ్రాములు కంటే తక్కువగా ఉంటే , దీన్ని వెరీ సివియర్ డెఫిసియెన్సీ గా పరిగణిస్తారు.
- వైద్యుల ప్రకారం, పరీక్షలో విటమిన్ డి స్థాయి 5 నుంచి 10 నానో గ్రాములు వరకు వచ్చినట్లయితే, అది సివియర్ డెఫిసియెన్సీగా ఉందని అంటారు.
- 10 నుంచి 20 మధ్య ఉంటే అది డెఫిసియెన్సీ కేటగిరీలోకి వస్తుంది.
- మీ విటమిన్ డి స్థాయి 20 నుంచి 30 నానో గ్రాములు వరకు ఉంటే సబ్ ఆప్టిమల్ లేదా ఇన్ సఫిసియెన్సీ అంటారు. ఈ స్థాయి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.
- విటమిన్ డి స్థాయి 30 నుంచి 50 నానో గ్రాములు వచ్చినట్లయితే, అది ఆప్టిమల్ లేదా నార్మల్ జాబితాలోకి వస్తుంది.ఈ లెవెల్స్ ఆరోగ్యకరమైనవి.
- పరీక్షలో విటమిన్ డి స్థాయి 50 నుంచి 70 నానో గ్రాములు వరకు వచ్చినట్లయితే, అది ‘బోర్డర్‌లైన్ హై’గా ఉందని అంటారు.
- మీ విటమిన్ డి స్థాయి 70 నుంచి 150 నానో గ్రాములు వరకు ఉంటే ఓవర్ డోస్ అంటారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.
- 150 కంటే ఎక్కువ విటమిన్ డి స్థాయిని కలిగి ఉంటే, చాలా డేంజర్ లెవెల్ లేదా టాక్సిక్ లెవెల్ లా గుర్తిస్తారు.
యముకల్లో నొప్పులు, మజిల్ వీక్నెస్, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి, బలహీనంగా మరియు అలసటగా అనిపించడం , డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు , విపరీతంగా జుట్టు రాలడం విటమిన్ డి లోపం లక్షణాలు. డెఫిసియెన్సీ ఉంటే డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా దాని స్థాయిని మెరుగుపరచవచ్చు. 30 నానో గ్రాములు కంటే తక్కువగా ఉంటే సప్లిమెంట్ వాడాలి.
తరచుగా సప్లిమెంట్ల ద్వారా విటమిన్ డి అధిక మొత్తంలో వినియోగించినప్పుడు విటమిన్ డి డేంజర్ లెవెల్ సంభవించవచ్చు. విటమిన్ డి ఎక్కువైతే ఆకలి తగ్గిపోవడం, మలబద్ధకం, వికారం, రక్తపోటు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. కిడ్నీలపై కూడా దుష్ప్రభావం ఉంటుంది. రక్తంలో కాల్షియం మోతాదు ఎక్కువ కావడం జరుగుతుంది . అందుకే ఏదైనా సప్లిమెంట్‌ను ఉపయోగించే ముందు, ఒకసారి డాక్టర్ సలహా తీసుకోండి