కొన్ని రోజుల క్రితం నలభై ఏళ్లు దాటిన వారిలో రక్తపోటు సమస్యలు ఎక్కువగా కనిపించేది అయితే జీవన విధానాలు ఆహారపు అలవాట్లలో మార్పులు మరియు జీవనశైలిలో మార్పుల కారణంగా వయసుతో సంబంధం లేకుండానే చాలా మంది రక్తపోటు సమస్యలు వస్తున్నాయి.
అధిక రక్తపోటు గుండె జబ్బులకు మూల కారణం. ఇది చాలా ప్రమాదకర స్థాయికి చేరుకుంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. మన మూత్రపిండాలను కూడా వ్యాధులకు గురి చేయవచ్చు. ఇది గుండెపోటుకు కూడా దారి తీస్తుంది
అధిక రక్తపోటు మనకి వచ్చినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి. హైబీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి.. ఆహారం, లైఫ్‌స్టైల్ రెండింటిపై శ్రద్ధ చూపడం అవసరం.
Table of Contents
అధిక రక్తపోటును తగ్గించడానికి జీవనశైలి మార్పులు
ఉప్పవాడకం తగ్గించాలి
ఒత్తిడిని తగ్గించండి
డాష్ డైట్ అనుసరించండి
ధూమపానం, మద్యం మానేయండి
వ్యాయామాలు చేయండి
బరువు తగ్గాలి
ఆహారంలో ఉప్పవాడకం తగ్గించాలి
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం అధికంగా చేరి, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. WHO తెలిపిన వివరాల ప్రకారం చాలా మంది ప్రతిరోజూ 9 నుండి 12 గ్రాముల ఉప్పును తింటున్నారని తెలిసింది. మీరు రోజూ 2,300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సోడియం తీసుకోకూడదని DASH డైట్ చెబుతోంది. ఇది 1 టీస్పూన్ ఉప్పుకు సమానం. అధిక రక్తపోటు ఉన్నవారు రోజుకు 1500 mg లేదా అంతకంటే తక్కువ సోడియం తీసుకోవడం ఇంకా మంచిది
మీ రోజువారీ ఆహారంలో అవసరమైన దానికంటే ఎక్కువ సోడియం తీసుకోకండి. సోడియంలోని చిన్న తగ్గింపు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని మరియు రక్తపోటును కూడా తగ్గిస్తుందని నిరూపించబడింది. లో సోడియం డైట్‌ను ఎంచుకోవాలి.
పిజ్జా, శాండ్విచ్లు, సూప్‌లు, టమోటా సాస్, పచ్చళ్ళు, బిస్కెట్లు, హాట్ డాగ్స్ ఇతర జంక్ ఫుడ్స్ లో సోడియం అధికంగా ఉంటుంది. టేబిల్ దగ్గర కూరలో కానీ మనం తీసుకునే ఫుడ్‌లో ఉప్పు తక్కువైంది అనేసి పైనుంచి వేసుకోవడం మానేయండి.
కొంతమంది సాధారణ ఉప్పు బదులుగా రాతి ఉప్పు , రాక్ సాల్ట్ లేదా సైంధవ లవణం ,సముద్రపు ఉప్పు , హిమాలయన్ బ్లాక్ సాల్ట్ తీసుకోవచ్చా అని అడుగుతారు. ఈ రకమైన ఉప్పు లో కూడా సోడియం అధికంగా ఉంటుంది . ఇవి సాధారణ ఉప్పు తో పోల్చుకుంటే కొంచెం ఆరోగ్యకరమైనప్పటికీ వీటిని కూడా రోజుకి ఒక టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు.
ఒత్తిడిని తగ్గించండి
మానసిక ఒత్తిడి స్థాయి విపరీతంగా పెరిగితే రక్తపోటు విపరీతమైన హెచ్చుతగ్గులకు గురికావటం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకని ఒత్తిడి తగ్గించుకొని హెల్తీ గా ఉండటం చాలా అవసరం. చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికావద్దు. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటే శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉంటూ సక్రమంగా తమ విధులు అవి నిర్వహిస్తాయి. యోగా వంటి కార్యకలాపాలలో పాల్గొనండి.
కచ్చితంగా 7- 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం
నిద్ర లేకపోవడం వల్ల అధిక రక్తపోటు పెరుగుతుందని చాలామందికి తెలియదు.స్ట్రెస్ హార్మోన్లను తగ్గించుకోవడానికి.. నిద్ర చాలా ముఖ్యం.
మీ రక్తపోటు కంట్రోల్లో ఉండటానికి.. కచ్చితంగా 7- 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీ కంట్రోల్లో ఉండటానికి ప్రశాంతమైన నిద్ర అవసరం.
మద్యం సేవించడం మానేయండి
మద్యపానం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.. ఆరోగ్యాన్ని దెబ్బతీసుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. హైపర్‌టెన్షన్‌ను నియంత్రించాలంటే.. అల్కహాల్ తాగడం మానేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే హై బీపీలో 5 పాయింట్ల తగ్గుదలని చూడవచ్చు.
కనీసం 30 నిమిషాల పాటు రోజూ వ్యాయామం చేయాలి
నడక, జాగింగ్ వంటివి వాటిని రోజువారి అలవాటుగా మార్చుకోవటం మంచిది. కనీసం 30 నిమిషాల పాటు రోజూ వ్యాయామం చేయాలి. ఇది మన మెటబాలిజమ్‌ని క్రమబద్ధీకరిస్తుంది. బరువు పెరగడాన్ని తద్వారా హైబీపీ ప్రమాదాన్ని నివారిస్తుంది. కనీసం 3 నెలల పాటు క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామాలు చేయడం వల్ల బీపీ కొలతలో 9 పాయింట్లు తగ్గించవచ్చు.
మరింత చురుకుగా మారడం వలన వ్యాయామం వలన 4 నుండి 12 వరకు డయాస్టొలిక్ మరియు 3 నుండి 6 వరకు సిస్టోలిక్ రక్తపోటు సంఖ్యలను తగ్గించవచ్చు
ధూమపానం ఆపండి
ధూమపానం వల్ల రక్తపోటు సమస్య వస్తుంది. ధూమపానం హృదయ సంబంధ వ్యాధులకు కూడా దారి తీస్తుంది. కొందరైతే స్మోక్ చేయకుండానే ఈ పొగాకుకి అలవాటు పడిపోతారు. అదెలా అంటే.. పాన్, పాన్ మసాలా మొదలైన పద్ధతులకి బానిసలైపోతారు. స్మోకింగ్ చేసినా, ఇతర పద్ధతుల్లో తీసుకున్నా సరే బీపీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. మీరు స్మోకింగ్ అలవాటు నుండి బయట పడితే మీరు ఆర్దికంగా మరియు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.
బరువు తగ్గాలి
10 పౌండ్లు బరువు తగ్గితే సిస్టోలిక్ ఒత్తిడిలో 7 పాయింట్ల తగ్గుదలకు కారణమవుతుంది. మీరు నిజంగా మీ బరువును నియంత్రించాలనుకుంటే.. మొదట మీ ఆహారాన్ని నియంత్రించడం నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. దీని కోసం బయటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జిడ్డు పదార్థాలు తినడం తగ్గించండి. మీ ఆహారంలో తక్కువ కేలరీల ఆహారాన్ని చేర్చండి. నిత్యం వ్యాయామం చేయడం కూడా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
డాష్ డైట్‌ని అనుసరించండి
అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి చాలామంది డాష్ డైట్‌ను ఫాలో అవుతున్నారు. అమెరికన్ నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇనిస్టిట్యూట్ ప్రకారం గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే డ్యాష్ డైట్ ఉత్తమమని తేల్చారు.
డాష్ డైట్ అంటే ‘డైటరీ అప్రోచేస్ టూ స్టాప్ హైపర్ టెన్షన్’. అంటే అధిక రక్తపోటును నివారించే ఆహారాన్ని తీసుకోవడం అన్నమాట.
డాష్ డైట్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.
మన ఆహారంలో పొటాషియం, కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటే, ఈ పోషకాలు రక్తపోటు నియంత్రణకు దోహదం చేస్తాయి.
డాష్ డైట్ యొక్క మరొక ఉద్దేశం ఏమిటంటే మనం తీసుకునే ఆహారంలో సంతృప్త కొవ్వు మరియు సోడియం తక్కువగా ఉండాలని. సోడియం అంటే ఉప్పు. ఉప్పు తగ్గించడం మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని మరియు రక్తపోటును కూడా తగ్గిస్తుందని నిరూపించబడింది.
డాష్ డైట్
ఉప్పవాడకం తగ్గించాలి
అధిక సంతృప్తికర కొవ్వులు మితంగా తీసుకోవాలి.
కూరగాయలు, పండ్లు పుష్కలంగా తీసుకోవాలి
నట్స్, తక్కువ కొవ్వు ఉండే పాల పదార్థాలు తీసుకోవాలి
Pingback: What fruits are good for diabetes (and the worst) - DM HEART CARE CLINIC
Pingback: Symptoms of kidney failure - DM HEART CARE CLINIC